ఏదైన అతిగా తింటువుంటే.. చేదుపుడుతుంది. అలాగే ఈ హీరోయిన్ కూడా .. తన లవర్ పై ప్రేమ తగ్గిపోయింది కాబోలు. అతను ఎవరో తెలియాదని మీడియా ముందు చెబుతుంది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం బెడిసికొట్టడంతో సెక్సీ బాంబ్ బిపాసాబసు ఇప్పుడు జాన్ అబ్రహాం అంటే ఎవరూ అనే పరిస్థితికి వచ్చేసింది. జాన్‌కు దీటయిన మగాడి వేటలో ఉందని అంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో జాన్ ప్రస్తావన వచ్చినపుడు, జాన్ అంటే ఎవరని ఎదురు ప్రశ్నించింది.
"నాకు ఎవరయినా పరిచయం అయితే.. మూడు నెలల వరకే వారు నాకు గుర్తుంటారు.. ఆ తర్వాత మర్చిపోతాను," అని బిపాసా పరోక్షంగా జాన్‌ను తాను ఎప్పుడో మరిచిపోయానని హింట్ ఇచ్చింది( బిపాసాతో జాన్ బంధం బెడిసికొట్టి సంవత్సరం అవుతోంది, వారు చాలా కాలంగా మాట్లాడుకోవడం లేదు. జాన్ ప్రస్తుతం ప్రియా రుంచల్ అనే సినిమా పరిశ్రమతో ఏమాత్రం పరిచయం లేని అమ్మడుతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఆమె పేరు చెపితే మెలికలు తిరిగిపోతున్నాడు. తమ వివాహం ఈ ఏడాదే అని ప్రకటించి ఇక బిపాసా తన జీవితంలో గత చరిత్ర అని పరోక్షంగా చెప్పేసాడు కూడా. దానికి బిప్స్ కూడా బాగానే కౌంటర్ ఇచ్చింది. తనకు కూడా రోజూ లెక్కలేనన్ని పెళ్లి సంబంధాలు వస్తున్నాయంటూ వెల్లడించింది.
జాన్ నుండి విడిపోయిన కొత్తల్లో బిపాసా వైరాగ్యంలో మునిగిపోయింది. శూన్యంలోకి చూస్తూ గడిపింది. తర్వాత నెమ్మదిగా కోలుకుంది. జాన్ లోటును మరిచిపోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. సినిమా షూటింగుల అనంతరం ఖాళీ వేళల్లో పార్టీల్లో పాల్గొంటూ బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. పాత స్నేహితులను కూడా కలుస్తోంది. ఎంత మరిచిపోయినట్లు కనిపించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆమెలో జాన్ లోటు బాగానే కనిపిస్తోందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more