Mamta mohandas

mamta mohandas,Mamta Mohandas photos, Mamta Mohandas gossip, Mamta Mohandas biography, Mamta Mohandas wallpapers, Mamta Mohandas filmography

mamta mohandas

mamta.gif

Posted: 04/16/2012 03:18 PM IST
Mamta mohandas

mamta mohandas

అదృష్టం అనేది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో ఎవరు చెప్పాలేరు. అదృష్టం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. అవకాశం వచ్చిన వెంటనే మనం వినియోగించుకోవాలి. కొంతమంది అదృష్టం అవరించిన గాని .. పెద్దగా పట్టించుకోరు. ఆ అదృష్టం విలువ వారికి తరువాత తెలుస్తుంది. ఇది ఎక్కువగా.. సినిమా హీరోయిన్ లకు వర్తిస్తుంది. ఎందుకంటే వారు చేసే సినిమాలు ఎది విజయం సాధిస్తుందో వారు చెప్పలేరు. అందువలన వచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా అవకాశాలను వదులుకుంటే వెళితే.. హీరోయిన్ మమతా మోహన్ దాకు జరిగిందే మీకు జరుగుతుంది. చిత్రపరిశ్రమను చాలామంది ‘విచిత్ర పరిశ్రమ’ అని కూడా అంటుంటారు. కొంతమంది ‘సినీమాయాప్రపంచం’ అని కూడా అంటుంటారు. ‘మాయ’ అంటే ఇక్కడ ఒక ‘మ్యాజిక్’ అనే అర్థంతో మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంటాయో ఎవరికీ తెలియదు. ఒకోసారి... ఏ సినిమా ఎంత హిట్ అవుతుందో, అది ఎందుకు హిట్ అవుతుందో కూడా ఆ తీసినవాళ్లకూ తెలియదు. అలాగే ఏ నటుడు లేదా నటి ఏ కారణంతో ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోతారో కూడా తెలియదు. అలా అని చెప్పి అంతా ‘అదృష్టం’ మీదనే నెట్టేయడం కాదు. కొన్ని పరిణామాలు ఒకోసారి ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా ఉంటుంటాయి అని చెప్పడం కోసం మాత్రమే. ఉదాహరణకు ఒకటి రెండు సంఘటనలను ఇక్కడ పరిశీలిస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది.

mamta mohandas

‘అరుంధతి’లో అనుష్క ఎంత అద్భుతంగా నటించారో మనకు తెలుసు. ఆ సినిమా అంతపెద్ద హిట్ కావడానికి ఆమె నటన ఎంత కారణమైందో కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఫ్‌కోర్స్... ఆ సినిమా అంత బాగా రావడానికి ప్రధాన కారణం నిర్మాత ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి! దర్శకుడు కోడి రామకృష్ణను పెట్టుకుని, తన సహజమైన పద్ధతిలో కోట్ల రూపాయలకు, కాలానికి ఎలాంటి పరిమితులు లేకుండా శ్యామ్ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘అరుంధతి’ సినిమా ప్రస్తావన ఇక్కడ తీసుకురావడానికి వెనుకవున్న ప్రధాన కారణానికి వస్తే... టైటిల్ పాత్రలో మొదట అనుష్కకు బదులు మమతామోహన్‌దాస్‌ని అనుకున్నారు శ్యామ్. ఆమె కాల్‌షీట్స్ కోసం రెండువారాల వరకూ ఆయన ప్రయత్నించారు కూడా.కానీ మమత డేట్స్ చూసే మేనేజర్ (చెన్నయ్‌లో ఉంటారు) ‘అరుంధతి’ సినిమా చేయడానికి సుముఖత చూపలేదట. దానికి కారణం - శ్యామ్ ఒక్కో సినిమాకి రెండు, మూడేళ్ల వరకూ సమయం తీసుకుంటారు. దానివలన మమత సమయం వృధా అవుతుందని, అంతేకాకుండా శ్యామ్ ‘అరుంధతి’కి ముందు తీసిన ‘అంజి’ (చిరంజీవితో) పెద్ద ఫ్లాప్ అవ్వడాన్ని దృష్టిలో పెట్టుకుని ‘అరుంధతి’కి మమత కాల్‌షీట్స్ ఇవ్వడానికి ఆయన వెనక్కి తగ్గారట. ఆ పరిస్థితిలో ఆ పాత్రకు నెక్ట్స్ ఎవర్ని పెట్టాలా అని ఆలోచించి, చివరికి అనుష్కని ఫైనలైజ్ చేశారు శ్యామ్. ఆ సమయంలో అనుష్క చేతిలో పెద్దగా సినిమాలు లేవు. పైగా ఆమె చేసిన సినిమాలు కొన్ని వరుసగా ఫ్లాప్ కూడా అవ్వడంతో... ఆమె కెరీర్ ‘బ్యాక్ టు బెంగళూర్’ అనే పరిస్థితిలో ఉంది. అయితే... ‘అరుంధతి’ రిలీజయ్యే నాటికి ఆమె నటించిన ‘విక్రమార్కుడు’ రిలీజయ్యి, అది కూడా మంచి విజయం సాధించడం జరిగింది. 

mamta mohandas

అయినా, ‘అరుంధతి’ చిత్రమే ఆమె కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయేలా అయ్యింది. ఆ రకంగా ఒక పెద్ద హిట్ సినిమా చేసే అవకాశాన్ని చేజార్చుకున్న మమతామోహన్‌దాస్ కెరీర్‌లో ఇలాంటి సంఘటన మరోటి కూడా జరిగింది. అది - ‘సింహా’ చిత్రం విషయంలో. సింహాలో నయనతార పోషించినపాత్ర మమతా చేయవలసి ఉంది. దర్శకుడు బోయపాటి శ్రీను నయనతార కేరక్టర్ మమత చేస్తే వెరైటీ అవుతుంది అనుకుని ఒక వారం రోజులపాటు ఆమె సమ్మతి కోసం ఎదురుచూశారు. మమతను కలిసి ‘సింహా’ కథ గురించి, ఆమె కేరక్టర్ గురించి విపులంగా తెలిపారు కూడా. అంతా విన్న తర్వాత ‘ఫ్లాష్‌బ్యాక్’లో వచ్చే కేరక్టర్ అదనీ, పైగా అది చిన్నపాత్రలా అన్పిస్తోందనీ, అదీకాకుండా డెరైక్టరు అడిగిన డేట్స్ సమయంలో తన డేట్స్ వేరే భాషల్లో తమిళ, మలయాళ చిత్రాలకు ఇవ్వడం జరిగినందున సాధ్యపడటంలేదని చెప్పి, సున్నితంగా మమత తిరస్కరించారు ఆ కేరక్టర్‌ను.బహుశా ఆమె మనసులో ‘సింహా’లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి, మరో హీరోయిన్ పాత్ర ఏమన్నా డామినెట్ అవుతుందేమో అని అనుమానం కలిగివుండొచ్చు. ఎందుకంటే - అంతకుముందు తను చేసిన రెండు సినిమాల్లో అలాగే జరిగింది అన్న అభిప్రాయంతో ఆమె ఉండటం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. ఏదేమైతేనేం... ఆ పాత్ర నయనతారకు వెళ్లింది. అంతకుముందు నయన బోయపాటి డెరైక్షన్‌లో ‘తులసి’ చేసి ఉన్నారు. ‘సింహా’లోని ఆమె అద్భుతంగా చేయడం, అది ఎంతో మంచి పేరు కూడా తేవడం జరిగింది. ఇక ఆ విషయం అలా ఉంచితే... అదే డెరైక్టర్ బోయపాటి శ్రీను ‘సింహా’లో జరిగిన సంఘటనను ఏ రకంగానూ మనసులో పెట్టుకోకుండా ‘దమ్ము’లో ఎన్టీఆర్ సరసన ఒక కేరెక్టరును మమతకు ఆఫర్ చేశారు.

mamta mohandas

30-35 రోజుల వరకు ఆమె డేట్స్ ఇవ్వవలసి ఉంటుంది. చాలా మంచి కేరెక్టర్ అని కూడా చెప్పారు. అయితే మళ్లీ మమతకు బ్యాడ్‌లక్కే ఎదురైంది. ఈసారి కూడా ‘‘ఎస్’’ చెప్పలేకపోయారు. దానికి కారణం - ఆమె డేట్స్ పూర్తిగా రెండు, మూడు మలయాళ సినిమాలకు అప్పటికే ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా, అదే సమయంలో ఆమె ‘పెళ్లి’ కూడా ఫిక్స్ కావడంతో డైరీలో ‘దమ్ము’కు కావలసిన డేట్స్ అడ్జెస్ట్ కాలేకపోయాయట. ఆ రకంగా ఆమె ‘మిస్’ అయిన ఆ పాత్రను ఇప్పుడు రాధ కుమార్తె కార్తీక చేశారు. రేపు రిలీజయ్యాక తెలుస్తుంది... తాజాగా ఈ సినిమాలోని కేరక్టర్ ఎటువంటి ఫలితాన్ని మమతాకు మిగులిస్తుందో..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader ummareddy venkateswarlu to join ysr congress party
Kamna apologises for boyfriend comment about lord  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more