తెలుగు చలనచిత్రరంగంలో వర్గాలులేవు . తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిలో లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుతో పాటు దర్శక రత్న దాసరి నారాయణరావు ప్రముఖులు. గత కొన్నేళ్లుగా పరిస్థితి గమనిస్తే...ఈ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన విబేధాలు రోజురోజుకీ ముదిరి ఇద్దరి మధ్య దూరం బాగానే పెంచాయి. అందుకే తెలుగు సిరీ పరిశ్రమకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా....ఒకరు హాజరైతే, మరొకరు హాజరు కారు.
తెలుగు చలనచిత్రరంగంలో వర్గాలులేవు. అంతా ఒక్కటే అంటూ చెప్పుకునే మా అధ్యక్షుడు మురళీమోహన్, టి.సుబ్బరామిరెడ్డి కళాపరిషత్ కలిపి అక్కినేనికి 75 సంవత్సరాలు వేడుక చేశారు. ఆ కార్యక్రమానికి హేమాహేమీలు వచ్చారు. కానీ దాసరి, బాలకృష్ణలు రాలేదు. ఒకరకంగా అక్కినేనికి చివరిదశలో మంచి ఫామ్‌లో ఉండేలా హిట్‌చిత్రాలు ఇచ్చింది దాసరి అన్నవిషయం తెలియంది కాదు.
అటువంటి దాసరికి అక్కినేనికి ‘ప్రేమాభిషేకం’ చిత్రంలో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్‌వల్ల కొన్ని మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ తీసిన మరో చిత్రంలో పాతబాకీల విషయంలోనూ రచ్చ అయింది. అక్కినేని ససేమిరా అనడంతో ముదిరి పాకాన పడింది. దాంతో నువ్వానేనా? అనే తేడా వచ్చింది. దాంతో ఇద్దరు పెద్దలు అహంతో మాట్లాడుకోవడం మానేశారని వార్తలు వచ్చాయి.
అప్పటి నుంచి దాసరి వచ్చిన ఫంక్షన్‌కు అక్కినేని ఆలస్యంగా రావడం, దాసరి వెళ్ళాక రావడం.. అసలు రాకపోవడం చేసేవాడు. అలాంటిది తెలుగు ఇండస్ట్రీ పుట్టినప్పటినుంచి నటుడిగా ఇరగదీశానని టి. సుబ్బరామిరెడ్డి చెప్పినట్లయితే… మరి దాసరి ఎందుకు పిలవలేదు. నందమూరి వంశం ఎందుకురాలేదు అన్నది చర్చ జరుగుతోంది. పరిస్థితి ఏ రేంజ్ లో ఉందంటే ....ఇటీవల దాసరి నారాయణ రావు సతీమణి పద్మ మరణించినా అక్కినినితో పాటు ఆయన వారసులెవరూ పరామర్శకు రాలేదు. కనీసం ఫోన్లో కూడా పరామర్శించలేదట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వీరి మధ్య విబేధాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో.
ఈ పరిస్థితికి కారణం డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గతంలో వచ్చిన విబేధాలే అని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. ఆ మధ్య అన్నపూర్ణ స్టూడియోలో దాసరి స్వీయ నిర్మాణంలో ఓ సినిమా తీశారని, స్టూడియో రెంటు, ప్రొడక్షన్ పరికరాకు సంబంధించిన డబ్బు దాసరి చెల్లించలేదని, ఈ విషయంలో వచ్చిన గొడవ ముదిరి పెద్దదయిందని అంటున్నారు. దాసరి విషయంలోనే కాదు....గతంలో గంటసాల, సావిత్రి, శోభన్ బాబులు మరణించినప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖలంతా వారి చివరి చూపుకు తరలి వెళ్లగా, అక్కినేని మాత్రం అటు వైపు చూడలేదు. మరి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడం అక్కినేనికి ఇష్టం లేదా? లేక మరేదైనా కారణం ఉందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more