జయప్రద మేడం రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారొస్తార నే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ (మంగళవారం) పుట్టిన రోజు సందర్భంగా ఆమె కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు తావిస్తున్నాయి. పనిలోపనిగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని జయప్రద దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన ఆమె 2014కల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తిని కనబరిచారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకీ అంత సీన్ లేదంటున్నామె, చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటరని కితాబిస్తున్నారు.
కాగా, సొంత రాష్ట్రాన్ని వదలి ఉత్తరప్రదేశ్ లో కొన్నాళ్లు చక్రం తిప్పిన జయప్రద, అక్కడ సీన్ రివర్స్ కావడంతో మళ్లీ పుట్టింటికే రావాలని భావిస్తున్నట్టు ఉన్నారు. సమాజ్ వాది పార్టీ తరపున యూపీలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన రాంపూర్ రాణిగా పేరు తెచ్చుకున్న జయప్రద, అక్కడ తన ప్రాభవం, ప్రభావం తగ్గడంతో ఇప్పుడు సొంత రాష్ట్రంపైనే మక్కువ చూపుతున్నారు.
అనుకోని పరిస్థితుల్లో యూపీలో సమాజ్ వాది పార్టీకి గుడ్ బై చెప్పి అక్కడ అమర్ సింగ్ పెట్టిన రాష్ట్రీయ లోక్ మంచ్ కు జయప్రద అండగా నిలిచింది. అయితే ఆ పార్టీ ప్రభావం యూపీలో ఏ మాత్రం లేదనేది మొన్నటి యూపీ ఎన్నికలే నిరూపించాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ జయప్రద సొంత రాష్ట్రం వైపు చూస్తున్నారు.
తెలుగుదేశంలో ఒకప్పుడు క్రీయాశీలకంగా జయప్రద మళ్లీ అదే పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు చాలా మంచి నాయకుడని టీడీపీ అధినేతపై జయ ప్రశంసల వర్షం ఈ కోవలోదేనని రాజకీయ విశ్లేషకుల భావన. రాష్ట్రంలో కొత్త పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పటికి, అక్కడ రోజా ఉండటం తో తెలుగుదేశం వైపే ఆమె అడుగులు వేస్తున్నట్టు విదితమౌతోంది.
తిరుమతి పర్యటన అనంతరం ఆమె కొద్ది సేపటిక్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం రామ్‌పూర్ ఎంపీ గా ఉన్న జయప్రద త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తానన్నారు. ఎంపీ పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉన్నందున రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని అప్పుడే చెప్పలేనని మీడియా ప్రతినిధులకు జయప్రద చివరిమాటగా సెలవిచ్చారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more