కరీనా కపూర్ పెళ్లికి ముందే గర్భం దాల్చిందా? ప్రస్తుతం ఈ విషయం గురించే జోరుగా చర్చ సాగుతోంది. దీనికి కారణం.. ఇటీవల కరీనా గర్భంతో ఉన్నట్టుగా ఓ పొటో బయటికి రావడమే. కరీనాకపూర్ ప్రెగ్నెంట్ అట, బాలీవుడ్లో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న గాసిప్ ఇది. కనిపించీ కనిపించని నాలుగు నెలల గర్భం ధరించిన మాదిరి ఆమె ఓ షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తున్న ఫొటోలు ఇంటర్నెట్లో ప్రత్యక్షమవ్వడమే ఈ గాసిప్‌కు కారణం. ఇదిలా ఉండగా గాసిప్‌కు ఊతమిచ్చేలా ఉన్న ఆ ఫొటోలు కొందరు బాలీవుడ్ నిర్మాతల హృదయాల్లో కల్లోలం రేపుతున్నాయి.
అసలు కారణం దర్శకుడు మధుర్ భండార్కర్ రంగంలోకి దిగాల్సిందే అని కరీనా అంటున్నారు. ఇప్పుడు ఈ పుకార్లు కు , ఆయనకు సంబందం ఏమిటీ? అంటే దీనికి కారణం ఆయనే అని కరీనా చెబుతుంది. కరీనా కపూర్ ప్రస్తుతం మధుర్ దర్శకత్వంలో హీరోయిన్ అనే చిత్రం చేస్తోంది. ఆ సీనిమా కొన్ని సన్నివేశాల్లో కరీనా గర్భవతిగా నటించిందట. ఇప్పుడు ఆ ఫోటోలను దర్శకుడు ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడని కరీనా అంటుంది.
కరీనా ప్రస్తుతం దాదాపు ఓ అరడజను చిత్రాలకు సైన్ చేశారు. ఇంతలో ఈ ఫొటోల మర్మం ఏంటి అంటూ సదరు నిర్మాతలు హైరానా పడిపోతున్నారట. దీనిపై వివరణ అడగడానికి బాలీవుడ్ మీడియా ప్రయత్నించగా -అది పనికిమాలిన గాసిప్ అంటూ వారిపై అంతెత్తు లేచారట కరీనా.నిజం ఏమిటో ప్రజలకు తెలియాలంటే మీరు మాట్లాడటమే కరెక్ట్ అనుకుంటాను? అని మీడియా మరోసారి వత్తిడి చేయగా… చెత్త గాసిప్పులు తీసుకొచ్చి వివరణ అడిగితే నేను సమాధానం చెప్పాలా? మీ కంటి ముందే నేను కనిపిస్తున్నానుగా. కరీనా బాధాలు చూసిన దర్శకుడు అది సినిమాలోని ఫొటోనే అనవసరంగా పుకార్లు పుట్టించవద్దు అని చెప్పాడని కరీనా అంటుంది.
ఎవడో పనికిమాలిన వాడు చేసిన మార్ఫింగ్ అది అంటూ కస్సుబుస్సులాడారట కరీనా. మరోపక్క సైఫ్ సైతం కరీనా ప్రెగ్నెన్సీపై వచ్చిన గాసిప్పులను కొట్టిపారేశారు. టైంపాస్‌కి సృష్టించే ఇలాంటి గాసిప్పులకు స్పందించడం అంటే అంతకన్నా తెలివితక్కువ పని మరొకటుండదు అన్నారు సైఫ్. ఇదిలా ఉండగా ఇలాంటి వాటిని ఫేస్ చేసేబదులు చక్కగా ఇద్దరూ పెళ్ళి చేసుకోవచ్చుకదా?’’ అని శ్రేయోభిలాషులు కరీనాకు సలహాలు ఇస్తున్నారట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more