భవిష్యత్తులో ద్రుష్టిలో పెట్టుకుని కోహ్లిని వైస్ కెప్టెన్ గా నియమించారని తెలుస్తుంది. కోహ్లి భవిష్యత్తులో కెప్టెన్ కాగలడని బోర్డు భావిస్తోందట. అంతే కాకుండా కోహ్లి ఎదిగేందుకు బోర్డు అన్ని విధాల ప్రోత్సహించడం ముఖ్యమని కూడా చెబుతుంది. అంటే ధోని విషయంలో బోర్డు అసంత్రుప్తిగా ఉందని తెలుస్తుంది. ఇటీవల ధోని కూడా నేను రిటైర్డు అవుతానని ప్రకటన చేయటంతో .. బోర్డు కూడా అప్రమత్తం అయినట్లు తెలుస్తుంది.
సెహ్వాగ్ లేకపోతే గంభీర్, రైనాలలో ఒకరు జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. దాదాపు రెండేళ్లుగా ఇదే జరుగుతోంది. చాలా సందర్భాల్లో సెలక్టర్లు అసలు వైస్ కెప్టెన్ పేరు ప్రస్తావించరు. ఈసారి మాత్రం కోహ్లిని వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. జట్టు ఎంపికకు ఒక రోజు ముందు హోబర్ట్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లికి ఇది సముచిత గౌరవం. భారత అండర్-19 కెప్టెన్‌గా ప్రపంచకప్ గెలిచిన కోహ్లి భవిష్యత్ సారథి అనేది ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న అంశం. తాజాగా కోహ్లి ఫామ్, నిలకడ అతడికి ఈ అవకాశాన్ని అందించాయి. అన్ని ఫార్మాట్‌లలోనూ ఆడటం కూడా కలిసొచ్చింది. ‘కోహ్లి భవిష్యత్‌లో కెప్టెన్సీ మెటీరియల్. అవసరమైనప్పుడు సారథ్య బాధ్యతలు తీసుకునేందుకు వీలుగా ఇప్పటినుంచే అతడిని తయారు చేయాలని అనుకున్నాం’ అని శ్రీకాంత్ చెప్పారు.
ఈ రోజు జట్టు ఎంపిక ద్వారా సెలక్టర్లు రెండు విషయాలు స్పష్టం చేశారు. ఒకటి... భారత క్రికెట్‌లో ధోని అత్యంత శక్తివంతుడు. రెండు... కోహ్లి భారత్‌కు భవిష్యత్తు. ప్రస్తుత జట్టులో ఎవరైనా ధోని వెనకాల నిలబడాల్సిందే... కాదని నోరు విప్పితే జట్టులో ఉండరనే హెచ్చరికను కూడా పంపారని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
టీమిండియా చిచ్చరపిడుగు విరాట్ కోహ్లికి ప్రమోషన్ లభించింది. ఆస్ట్రేలియా టూర్‌లో మెరిసిన ఒకే ఒక్క హీరో విరాట్ కోహ్లి నిలకడైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆసీస్‌లో టెస్టుల్లో, వన్డేల్లో సెంచరీ చేసిన(ఇరు జట్లలో) ఒకే ఒక్క బ్యాట్స్‌మన్. టెస్టుల్లో, వన్డేల్లో 300పైగా పరుగులు చేసిన ఒకే ఒక భారత బ్యాట్స్‌మెన్‌గా ఇలా చాలా రికార్డులను ఈ యంగ్ గన్ తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్లు అందరూ కలిసికట్టుగా విఫలమైన చోట నిలబడి సెంచరీ చేసిన హీరో. భారత పరువు మంటగలవకుండా తన శాయశక్తులా ప్రయత్నించిన ధీరుడు. మొన్న జరిగిన వన్డేలో అద్భుత శతకంతో టీమిండియాను ఒడ్డున పడేసిన మెగా పవర్. ఒకప్పుడు సచిన్, సెహ్వాగ్‌లో కనిపించిన కసి ఇప్పుడు ఈ చిచ్చరపిడుగులో కనిపిస్తోందని మాజీలు మోసేస్తున్నారు. నిజంగానే విరాట్‌లో అపారమైన ప్రతిభ, పట్టుదల, దీక్ష ఉన్నాయి. ఇవే అతడిని ఈరోజు భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా నిలబెట్టాయి. ఇది అతడి కెరీర్‌లో మరో మెట్టుగా కాకుండా ఓ మైలురాయిగా మిగిలిపోతుంది.
కోహ్లి 2011వ సంవత్సరంలో 34 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.
47.62 సగటుతో 1381 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు 8 అర్థసెంచరీలు ఉన్నాయి.
2012లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 53.28 యావరేజ్‌తో 373 పరుగులు సాధించాడు
ఇందులో ఒక సెంచరీ రెండు అర్థసెంచరీలు ఉన్నాయి.
మరే ఇతర భారత బ్యాట్స్‌మెన్ ఇటువంటి గణాంకాలను నమోదు చేయలేదు.
అంతేకాదు వన్డేల్లో ప్రస్తుతం భారత్ తరఫున టాప్ ర్యాంక్‌లో.. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.
అండర్ 19 వరల్డ్ కప్ గెలిపించాడన్న చక్కని బ్యాగ్రౌండ్ ఉంది.
ఎటువంటి పరిస్థితుల్లో అయినా జట్టును ఆదుకోగలడు, ఒడ్డున పడేయగలడు.
మంచి ఫీల్డింగ్ కూడా కోహ్లికి పెద్ద ప్లస్ పాయింట్
ఆస్ట్రేలియా టూర్లో భారత తరఫున సెంచరీ చేసిన ఒకే ఒక ఆటగాడు విరాట్ కోహ్లి
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more