నేపాలీ బ్యూటీ మనీషా కొయరాలా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేస్తున్నారంటూ వచ్చిన వార్త బాలీవుడ్ ని కుదిపేస్తోంది. మధూర్ బండార్కర్ దర్శకత్వంలో కరీనాకపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హీరోయిన్ చిత్రం మనీషా జీవిత చరిత్ర ఆధారంగానే అని వినపడుతోంది. 1990-2005 ల మధ్య జరిగిన ఆమె జీవత ఎత్తు పల్లాలను సినిమాలో చూపిస్తాడని చెప్పుకుంటున్నారు.
అలాగే ఆమె ఆల్కహాల్ కు బానిస అవ్వటం,ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితం ఇలా ఇబ్బందికరంగా తయారవటం ప్రధానాంశాలు అంటున్నారు. అలాగే సెకండాఫ్ లో ఆమె వివాహ జీవితం ఫెయిల్యూర్ అవ్వటం కూడా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని దర్శకుడు మధూర్ ఖండిస్తున్నాడు. నో..నో..నా చిత్రం ప్రత్యేకంగా ఎవరి జీవితాన్ని ఉద్దేశించి కాదు అంటున్నాడు. ఇక రీసెంట్ గా మనీషా కొయరాల తాగి ఓ పంక్షన్ కి వెళ్లి మీడియా కళ్లల్లో పడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో తల్లి పాత్రలకు ట్రై చేస్తోంది.
బాలీవుడ్ సంచలన దర్శకుడు మధుర్భండార్కర్ కలల ప్రాజెక్ట్ ‘హీరోయిన్’ అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఐశ్వర్యరాయ్ కథానాయికగా ఈ సినిమాని ప్రారంభించిన మధుర్ కొన్ని నెలల క్రితం ఆమె ప్రెగ్నెట్ అని తెలియడంతో ప్రాజెక్ట్ ను నిలిపివేశాడు. దాదాపు అరవైశాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం నుంచి ఐశ్వర్య తప్పుకోవడంతో ఈ సినిమా భవిష్యత్తు సందిగ్ధంలో పడినట్లెంది. ఎట్టకేలకు కరీనాకపూర్ ను కథానాయికగా ఎంచుకొని ఈ సినిమాని పునఃప్రారంభించాడు దర్శకుడు మధుర్ భండార్కర్. ఇటీవలే ఈ చిత్రం ముంబయ్ లో తిరిగి ప్రారంభమైంది. హీరోయిన్స్ జీవితాల్లోని చీకటి కోణాల్ని, వారి తెర చాటు జీవితాన్ని ఆవిష్కరిస్తూ మధుర్ రూపొందించనున్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండటంతో కరీనా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. తన కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయే పాత్ర అని గర్వంగా చెబుతోంది.
ఈ చిత్రానికి కరీనా 10 కోట్ల పారితోషికంతో పాటు చిత్ర లాభాల్లో వాటాను కూడా తీసుకోనుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై కరీనా తనదైన శైలిలో స్పందించింది...‘నా కేరీర్లో హీరోయిన్ చిత్రం ఎంతో ప్రత్యేకం. హీరోయిన్స్ జీవితం తాలూకూ మనకు తెలియని, ఊహించని ఎన్నో విషయాల్ని దర్శకుడు మధుర్ భండార్కర్ ఈ చిత్రంలో మన కళ్లముందుంచుతున్నాడు. ఈ సినిమాకి నేను తీసుకుంటున్న పారితోషికం ఎంతన్నది సమస్యకాదు...నేను కలలు గన్న డ్రీమ్ రోల్ ఇది. ఈ సినిమా విషయంలో పారితోషికం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు’ అని సమాధానమిచ్చింది. దర్శకుడు మధుర్భండార్కర్ కూడా హీరోయిన్ సినిమాకి కరీనా రైట్ ఛాయిస్ అని కితాబిచ్చాడు
‘హీరోయిన్’ సినిమా కోసం కరీనాకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ చెల్లించారని, భారత దేశ సినీ చరిత్రలో ఇప్పటి వరకు కథానాయికకు చెల్లించిన పెద్ద మొత్తం ఇదేనని అంటున్నారు. కరినా నటించడం వల్లనే సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నాయనే వాదనను కూడా కరీనా కొట్టి పారేసిందట. కరీనా నటించిన త్రీ ఇడియట్స్, బాడీగార్డ్ , రా.వన్ చిత్రాలు వందకోట్ల కలెక్షన్లు దాటడంతో ఈ భామను బాలీవుడ్ నిర్మాతలంతా గోల్డెన్ హీరోయిన్ గా భావిస్తున్నారు.
కరీనా నటించిన ‘హీరోయిన్’, ఏంజెంట్ వినోద్ సినిమాలు విడుదల కావాల్సి ఉందిని. ఈ సినిమాలు కూడా భారీ విజయం సాధించిందంటే....కరీనా భవిష్యత్ భవిష్యత్ బంగారుమయం కాదు, వజ్రాల మయం అవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more