సాధారణంగా క్రికెటర్లు ఆటతో పాటు బిజినెస్ లు చేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే బిజినెస్ నిర్వహించే క్రికెటర్లు ఇప్పుడు వారి భార్యలతో కూడా బిజినెస్ చేయిస్తున్నారు. ప్రముఖ క్రికెటర్లు టెండూల్కర్ భార్య అంజలి, సెహ్వాగ్ భార్య ఆర్తి కలిసి ఓ బిజినెస్ లోకి ప్రవేశించి వాళ్ళ లక్ ని చూసుకోబోతున్నరు. చెన్నైకి చెందిన స్పోర్ట్స్ మిషన్ అనే సంస్థలో వీరిద్దరు వాటాదారులుగా చేరారని తెలుస్తుంది. . భారత జట్టు వీడియో అనలిస్టు సుబ్రహ్మణ్యన్ రామకృష్ణన్ స్థాపించిన చెన్నైలోని స్పోర్ట్స్ కంపెనీలో వారిద్దరు మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సంస్థలో అంజలికి 35 శాతం, ఆర్తికి 25 శాతం, రామకృష్ణన్‌కు 38 శాతం వాటాలు ఉన్నట్లు సమాచారం.
వీరిద్దరు ఆసంస్థను ప్రారంభించినప్పటి నుండి అందులో బోర్డు సభ్యలుగా ఉన్నారు. స్సోర్ట్స్ మెకానిక్స్‌లో 30 మంది సిబ్బంది ఉన్నారు. చాలా మంది పాఠాశాల, కాలేజీ స్థాయి క్రీడాకారులు. నిరుడు రూ. 3 కోట్ల రూపాయల టర్నోవర్ మాత్రమే సాధించింది. దాన్ని వంద కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే దిశగా రామకృష్ణన్ నడిపించడానికి సమాయత్తమవుతున్నారు. విజ్యువల్ కోచింగ్ మెథడ్స్ పెరగడంతో స్పోర్స్ట్ మెకానిక్స్ వ్యాపారం పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
రామకృష్ణన్ తమిళనాడు జూనియర్ క్రికెట్ జట్టులో ఆడాడు. అదే విధంగా 13 ఏళ్ల పాటు ఇండియన్ బ్యాంక్ జట్టుకు నేతృత్వం వహించారు. దశాబ్దం క్రితమే ఆయన వీడియో అనాలిసిస్ సోల్యూషన్స్‌ను ప్రవేశపెట్టారు. పెర్మార్మెన్స్ అనలిస్టుగా జాన్ రైట్ 2003లో ఆహ్వానించినప్పుడు రామకృష్ణన్‌కు పెద్ద బ్రేక్ లభించింది. ఏది ఏమైనా క్రికెటర్లే కాకుండా వారి భార్యలతో కూడా బిజినెస్ చేయించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతయినా సచిన్, వీరూ సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు క్రికెట్ జనాలు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more