2009 సంవత్సరంలో కేసిఆర్ చేవిలో గుసగుసలాడి.. తెలంగాణ ఇస్తాం అని చెప్పిన చిదంబరం. ఇప్పడు కొత్తగా 5 లక్షల పథకం ప్రవేశపెడుతున్నాడట. అదీ చాలా సింపుల్. ఒక మెషిన్ గన్ తీసుకుపోయి ఇస్తే .. 5 లక్షలు ఇస్తానని మీడియా మందు చిదంబరం చెబుతున్నాడు. అయితే ఆ 5 లక్షల పథకం ప్రజలకు కోసం కాదండీ. కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న చిదంబరం.. మావోయిస్టులను జనజీవన స్రవంతి లో కలిపేందుకు ఉపయోగించే చిదంబరం చిన్ని చిట్కా అని అంటున్నారు.
ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నూతన లొంగుబాటు విధానం అమలుచేయనుంది. జనజీవన స్రవంతిలో కలిసేలా మావోయిస్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక కొత్త లొంగుబాటు విధానాన్ని ముందుకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, లొంగిపోయే నక్సల్స్‌కు నగదు నజరానాను గణనీయంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. లైట్ మెషిన్‌గన్‌తో సహా లొంగిపోయే నక్సలైట్లకు రూ.5 లక్షల చొప్పున, ఏకే-47 రైఫిళ్లతో లొంగిపోయే వారికి రూ.3 లక్షల చొప్పున చెల్లించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు వేర్వేరు లొంగుబాటు విధానాలను అమలు చేస్తున్నాయి. ఆయుధాలతో లొంగిపోయే నక్సలైట్లకు వారి వద్దనున్న ఆయుధాలను బట్టి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ప్రస్తుతం చెల్లిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ గత ఏడాది ప్రకటించిన ప్రోత్సాహకాల ప్రకారం ఏకే-47/56/74 రైఫిళ్లకు రూ.15 వేలు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్ లేదా స్నైపర్ రైఫిల్‌కు రూ.25 వేలు, పిస్టల్ లేదా రివాల్వర్‌కు రూ.3 వేలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న లొంగుబాటు విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని, లొంగిపోయే నక్సల్స్‌కు చెల్లించే మొత్తాన్ని మరింత పెంచాల్సిందిగా రాష్ట్రాలను కోరామని, కేంద్రం కూడా తన వాటా నిధులను ఇందుకు సమకూరుస్తుందని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు.
అయితే చిదంబరం చిన్నిచిట్కాను .. మావోయిస్టులు నమ్మటం లేదని తెలుస్తుంది. ఆయన మాటలకు అర్థలు వేరుగా ఉంటాయాని నక్సలైట్లు పసిగట్టారు. ఎందుకంటే.. ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా చేయాలనే కోరిక ఏకకై వ్యక్తి చిదంబరం అని తెలుసు. ఆయన 2009లో కేసిఆర్ చేవిలో గుసగుసలాడిన విషయం కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసునని మావోయిస్టులు అంటున్నారు. చిదంబరం గుసగుసలతో రాష్ట్రం మొత్తం అతలకుతలమైందని అందుకే చిదంబరం మాటలు చిన్ని చిట్కాతో పోల్చామని మావోయిస్టులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more