భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో లాంఛనంగా చోటు లభించింది. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ ‘ప్రతిష్టాత్మక క్యాప్’ను సన్నీకి అందజేశాడు. జనవరి 2009లో ప్రాథమికంగా విడుదల చేసిన 55 మంది జాబితాలో గవాస్కర్ పేరు ఉన్నప్పటికీ ఆయనకు ఈ గౌరవం అధికారికంగా ఇప్పుడు దక్కింది. హాల్ ఆఫ్ ఫేమ్‌లో ప్రస్తుతం ఉన్న 72 మంది (పురుష, మహిళ) క్రికెటర్ల సరసన ఈ మాజీ కెప్టెన్ స్థానం సంపాదించాడు. ‘ఇదో గొప్ప గౌరవం. ఎందుకంటే దిగ్గజాలు ఈ జాబితాను ఎంపిక చేస్తారు. ఈ పురస్కారం లభించడానికి కాస్త సమయం పట్టింది.
అయినప్పటికీ చాలా సంతోషంగా ఉంది. భారత క్రికెట్‌లో కపిల్ ఓ మేటి ఆటగాడు. అతని నుంచి ఈ క్యాప్‌ను తీసుకోవడం నిజంగా గొప్ప విషయం. వరల్డ్‌కప్ (1983) విజేత బృందంలో సభ్యుడిగా కపిల్‌తో కలిసి నాకు చాలా ఆనందకర క్షణాలు ఉన్నాయి. ఈ ఆనందం ఎప్పుడూ నా వెంటే ఉంటుంది. కపిల్ క్యాప్ అందించడంతో ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది’ అని ఈ లిటిల్ మాస్టర్ వ్యాఖ్యానించాడు. గవాస్కర్‌కు క్యాప్‌ను బహుకరించడం గొప్ప గౌవరంగా భావిస్తున్నానని కపిల్ అన్నాడు. ఇప్పటికీ సన్నీనే గొప్ప ఓపెనర్ అని తన మాజీ సహచరుడికి కితాబిచ్చాడు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గాట్, రమీజ్ రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more