Gali special status in jail

Gali Special Status in Jail, Gali Janardhan Reddy, Gali, Chanchal Guda jail, B V Srinivas Reddy,former Karnataka minister Gali Janardhan Reddy, IAS Officer Sri lakshmi, VVIPs ,

Gali Special Status in Jail

Gali1.gif

Posted: 02/10/2012 12:45 PM IST
Gali special status in jail

Gali  Special Status in Jail

చంచల్‌గూడ జైలు గతంలో.. ఖైదీలకు నిలయంగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో చంచల్ గూడ జైలును కూడా వీవీఐపీలు కబ్జా చేశారు. జైల్లో వీవీఐపీలతో రోజంతా రచ్చ రచ్చగా ఉంటుంది. వీవీఐపీల కొత్త జీవితానికి చంచల్ గూడ వేదిక అయ్యింది. ఈ వీవీఐపీ ఖైదీలు .. బయట ఎలా ఉండే వారు .. కారాగారంలో కూడా తమ హావాను చూపిస్తున్నారు. అక్రమ ఘనుల గాలి జనార్థన్ రెడ్డి గురించి మనకు తెలిసిందే. కానీ జైల్లో ఆయన చేసే కార్యక్రమాలు గురించి అందరికి తెలియావు? ఆయన జైల్లో కూడా తన హవా చాటుతున్నాడని .. పోలీసులు అంటున్నారు. గాలికి బయటి జీవితం ఎలా ఉందో జైల్లో కూడా ఆయనకు అలాగే ఉందని చెబుతున్నారు.

జైల్లో గాలి చేసే పనులు పొద్దున నిద్దుర లేసి కాలూ ముఖమూ శుభ్రం చేసుకొని, కాలూ చేయీ కదిపి , దేవుడికి దండం పెట్టుకొని, సమయం ప్రకారం ఆయన టిఫిన్ చేసి తరువాత పత్రికల మీద దాడి చేస్తాడట. అంటే అన్నీ దిన పత్రికలను చదవటం ప్రారంభించి వాటి మీద కుస్తీ పడతాడని తోటీ ఖైదీలు అంటున్నారు. గాలి బయట క్షణం తీరికలేకుండా గడిపిన జనార్థన్ రెడ్డి , జైలులో ఎన్ని బ్యారక్‌లు ఉన్నా, ఓల్డ్ ఆసుపత్రి బ్లాక్ బ్యారక్‌లపైనే అందరి దృష్టి! ఎందుకంటే... గాలి జనార్దన రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్, విజయసాయి రెడ్డి, కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయ రాఘవ ఇలాంటి ముఖ్యులంతా ఇదే బ్యారక్‌లో ఉన్నారు పొద్దున్నే ఆరుగంటలకు నిద్ర లేవడంతో వీరి 'రోజు' మొదలవుతుంది. కాలకృత్యాలు, యోగా, షటిల్, స్నానం, పూజలు, అల్పాహారం! ఇదంతా రొటీన్‌గా సాగుతోంది.

అసలు జైలు పేరెత్తగానే 'చిప్ప కూడు' గుర్తుకొస్తుంది. కానీ... వీఐపీ ఖైదీలకు చక్కటి ఫుడ్డు దొరుకుతోంది. కారణం... స్పెషల్‌క్లాస్ ఖైదీలు కావడమే. గాలి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్, కోనేరు ప్రసాద్, విజయసాయిరెడ్డిలకు జైలులో ఒకేచోట వంటచేస్తున్నారు. కూరగాయలు, వంట సరుకులను రొటేషన్ పద్ధతిలో బయటి నుంచి తెప్పిస్తున్నారు. ఉదయాన్నే బ్రెడ్-జామ్, చపాతీ, ఇడ్లీ, ఉప్మా తింటున్నారు. మధ్యాహ్న భోజనంలో చాలామందికి 'ముక్క' పడాల్సిందే. చికెన్, మటన్, చేపలను నగరంలోని పేరొందిన దుకాణాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు. రాత్రిపూట మాత్రం చపాతీలు, పండ్లు, పాలతో సరిపెడుతున్నారు. కొందరు మాంసాహారం విషయంలో 'వారాలు' పాటిస్తున్నారు. కోనేరు ప్రసాద్ మంగళ, గురు, శనివారాల్లో నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటూ... రాత్రిళ్లు ఉపవాసం కూడా చేస్తున్నారు. ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డి రోజూ రాత్రి ఏమీ తినకుండా డైటింగ్ చేస్తున్నారు. ప్రత్యేక ఖైదీలుగా తమకు ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని బయటి నుంచి విదేశీ పండ్లు, ఖరీదైన ఆహారం తెప్పించుకుంటున్నారు.

గుడుంబా, చిన్న చిన్న దొంగతనాల కేసుల్లో జైలుకు వచ్చిన ఖైదీల్లో కొందరు 'ప్రత్యేక ఖైదీ'లకు సేవలు చేస్తూ, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు బదులుగా... క్యాంటిన్ టోకెన్లు, వారి కేసుల ఖర్చులకు ఎంతో కొంత డబ్బు ఇస్తే తీసుకుంటున్నారు. జైలులో మామూలు ఖైదీలకు పది పదిహేను రోజులకుగానీ షేవింగ్ చేయించుకునే వంతు రాదు. కానీ... వీఐపీ ఖైదీలు మాత్రం రోజూ గడ్డం చేయించుకుంటూ 'క్లీన్ షేవ్'తో కనిపిస్తున్నారు. మొత్తానికి... వీవీఐపీల రాక ఇదే బ్యారక్‌లోని ఇతర స్పెషల్ ఖైదీలకు వరంగా మారిందని పోలీసులు అంటున్నారు. జైలు లోపల తండ్రులు... బయట కుమారులు! ఇదీ పరిస్థితి. కోనేరు రాజేంద్రప్రసాద్, రాజగోపాల్ కుమారులు దాదాపు రోజంతా జైలు బయటే గడుపుతున్నారు. గాలి మనుషులతో కలిసి షెడ్డులో బాతఖానీ పెడుతూ... బండి దగ్గర చాయ్ తాగుతూ లోపలున్న తమ వారి అవసరాలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారు. విజయసాయి రెడ్డి మాత్రం జైలు సిబ్బందిని ఎక్కువగా వాడుకోవడంలేదని తెలుస్తోంది.

చంచల్‌గూడకు చేరిన తొలి ప్రముఖుడు గాలి జనార్దన రెడ్డే. ఆయన తన హవా జైలులో కూడా నడిపిస్తున్నారు. ఎక్కువ సమయం సూపరింటెండెంట్ గదిలోనే గడుపుతూ, అక్కడి నుంచే పనులు చక్కదిద్దుతున్నట్లు సమాచారం! జైలులో ఆయన స్వేచ్ఛగా విహరిస్తున్నట్లే! రోజూ పదిగంటల తర్వాతే ములాఖత్‌ను అనుమతించాల్సి ఉన్నా... గాలికి 8 గంటల నుంచే 'అరేంజ్' చేసిన సందర్భాలు న్నాయాని అధికారులు చెబుతున్నారు. గాలి అనుచరులు నలుగురు నిత్యం చంచల్‌గూడ బయటే ఉంటారు. లోపలి నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేయడం, గాలికి కావల్సిన వస్తువులను తెచ్చివడమే వారి పని. ఇందుకోసం వారికి ఒక్కొక్కరికి రోజుకు రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. గాలి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ... 10-12 వాహనాలు జైలు ముందు ఉంటాయి. 'బెయిలు రాలేదు' అని తెలియగానే అవన్నీ ఖాళీగా వెళ్లిపోతాయి. గాలి మనుషులు వచ్చారంటే జైలు సిబ్బందికి 'పండగే'నట!

చంచల్‌గూడ జైలుకు వచ్చిన ఖైదీలు స్పెషల్ క్లాస్ వసతులకోసం తహతహలాడటం మామూలే. కానీ... ఐఏఎస్ శ్రీలక్ష్మి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు ప్రత్యేక వసతులు కల్పిస్తూ గతనెల 25న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు జైలు అధికారులకు 28న అందాయి. కానీ... శ్రీలక్ష్మి మాత్రం ప్రత్యేక సదుపాయాలు ఉపయోగించుకోవడంలేదు. సాధారణ ఖైదీలాగానే ఉన్నారు. ఆమె రోజంతా పుస్తకాలు చదువుతూ, ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎక్కడైన గాలి స్వేచ్చగా వీస్తుందని రుజువు చేశాడు గాలి జనార్థన్ రెడ్డి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiran reddy lands in trouble with cabinet expansion
Salman khan asin marriage gossip news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more