Nallari kiran kumar reddy

Nallari Kiran Kumar Reddy,Congress leader, Nallari Kiran Kumar Reddy,Botsa Satyanarayana,DL Ravindra Reddy, Ex minister Peddi Reddy, Congress Party, Delhi leaders, Chief minister Kiran kumar Reddy, PRP party,

Nallari Kiran Kumar Reddy

Nallari.gif

Posted: 02/02/2012 01:14 PM IST
Nallari kiran kumar reddy

Nallari Kiran Kumar Reddy

ఇప్పుడు ముఖ్యమంత్రి భయం పట్టుకుందట. ఆయన ఎక్కడి వెళ్లిన ఆ భయంతో.. ఏం చేయలేక పోతున్నాడట. సీఎం భయం అంత.. ఆ ముగ్గురు గురించేనట. ముఖ్యమంత్రి భయపెడుతున్న ఆ త్రీ ఇడియట్స్ ఎవరని .. కాంగ్రెస్ వర్గాలు అనుకుంటున్నాయట. అసలు సీఎం ఎందుకు భయపడుతున్నారు? ముఖ్యంగా ఆ ముగ్గురు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఆ ముగ్గురు ఎవరు? సీఎం గుడికి వెళ్లిన కూడా అదే ధ్యాసలో ఉంటున్నాడట. నిన్న మేడారం జాతర కు వెళ్లిన సీఎం తన మొక్కు తీర్చుకుంటూ కూడా.. ఆ ముగ్గురు గురించే ఆలోచిస్తున్నాడట. ఆయన పరధ్యానంలో ఉండటం చూసి.. మంత్రి పొన్నాల లక్ష్మయ్య సీఎంను వారించడని.. కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

ఆ ముగ్గురు’ కాంగ్రెస్ ప్రముఖులు ఢిల్లీలో మకాం వేసి ఏ చేస్తున్నారు, అసలు వారి ప్రయత్నాలు ఏమిటి? ఎందుకోసం అన్న అంశాలపై ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నిహితులు ఆరా తీసే పనిలో పడ్డారు. త్వరలోనే శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, ఆంతకుముందే మంత్రివర్గ మార్పులు చేసి కొంతమంది మంత్రుల శాఖలను మార్చాలని ముఖ్యమంత్రి అనుకుంటున్న తరుణంలో ‘ఆ ముగ్గురు’ ప్రముఖులు ఢిల్లీలో మకాం పెట్టి అధిష్ఠానం పెద్దల చుట్టూ తిరుగుతూ ఉండటం కాంగ్రెస్ వర్గాల్లోను, ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల్లోను చర్చనీయాంశమైంది.

ఆ ముగ్గురు ఎవరు కాదు. 1. పిసిసి అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, 2. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి, 3. మాజీ మంత్రి, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఢిల్లీలో మకాం వేశారట. ఈ ముగ్గురూ ముఖ్యమంత్రి కిరణ్ వ్యతిరేకులే అని కాంగ్రెస్ నాయకులకు తెలిసిన విషయమే. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈ ముగ్గురు ఢిల్లీలో అధిష్ఠానం వద్ద లాబీయింగ్ జరుపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాయి. ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షునికి మధ్య ఉన్న విభేదాలు బహిరంగ రహస్యమే. మంత్రివర్గ మార్పుల్లో భాగంగా బొత్సను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు వీలుగా అధిష్ఠానంపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెస్తున్నారట. అయితే బొత్స మాత్రం జోడు పదవుల్లో కొనసాగేలా అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తున్నారట.

1. అంతే కాకుండా ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దర్ని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవడంతో మంత్రివర్గంలో కాపు కులానికి చెందిన వారి సంఖ్య పెరిగిందన్న కారణంతో అదే సామాజిక వర్గానికి చెందిన బొత్సను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఉందని గ్రహించిన బొత్స ఢిల్లీలో ఉంటుడని సీఎం అంటున్నాడట.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను పిసిసి అధ్యక్షుడు బొత్స వ్యతిరేకిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి మానస పుత్రికగా భావిస్తున్న ‘రాజీవ్ యువకిరణాలు’ పథకాన్ని బొత్స మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారట. యువకిరణాల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావలసిన ప్రధాని పర్యటన ఆఖరి క్షణంలో ఆగిపోవడానికి కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు జి వివేక్ ప్రధానికి రాసిన లేఖే కారణమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన పిసిసి అధ్యక్షుడు బొత్స కూడా రాజీవ్ యువ కిరణాలపై తనకున్న ఆనుమానాలను వ్యక్తం చేసినట్లు గాంధీ భవన్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

2. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి కూడా ముఖ్యమంత్రితో సంబంధాలు ఇటీవల కాలంలలో అంతంత మాత్రంగానే ఉండటం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రికి, ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా మంత్రి డిఎల్ బహిరంగంగానే చెబుతున్నాడు. డి ఎల్ ఇలా చేయటం ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణమైందని ఆయన సన్నిహితులు అంటున్నారు. అదే కోపంతో సీఎం కిరణ్ మంత్రివర్గ మార్పుల సందర్భంగా డిఎల్‌కు ఉద్వాసన చెప్పాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు అనే వార్తలు కాంగ్రెస్ బాగా వ్యాపించాయి. కిరణ్ చేయబోతున్న విషయం డిఎల్‌కు తెలియడంతో , ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అధిష్ఠానం పెద్దల వద్ద ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ వైద్య, ఆరోగ్య శాఖనే నిర్వహిస్తూండటంతో రాష్ట్రంలో ఆదే శాఖను నిర్వహిస్తున్న మంత్రి డిఎల్ శాఖాపరమైన అంశాలపై చర్చ నెపంతో ఆజాద్‌ను తరచూ కలుస్తూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చెబుతున్నట్లు ఢిల్లీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

3. చిత్తూరు జిల్లాకే చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆజెండా అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి పదవినుంచి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించేలా ప్రయత్నించడమే తన అజెండా అని పెద్దిరెడ్డి పలుమార్లు మీడియా వద్దనే బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనే స్వయంగా మీడియా ముందు ‘ నాకు మంత్రి పదవి అవసరం లేదు, ముఖ్యమంత్రి పదవినుంచి కిరణ్ తప్పించడం ఒక్కటే నా లక్ష్యం’ అని బహిరంగంగానే ప్రకటించాడు. అంతేకాకుండా అధిష్ఠానాం దగ్గర కూడా పెద్దిరెడ్డి ఈ విషయం తెలియజేశారట. ముఖ్యమంత్రి త్వరలో జరపాలనుకుంటున్న మంత్రివర్గ మార్పుల్ని అడ్డుకునేందుకు వీలుగా బొత్స, డిఎల్ ప్రయత్నిస్తుండగా ఏకంగా ముఖ్యమంత్రినే మార్చాలన్న లక్ష్యం దిశగా పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan supports junior doctors strike at gandhi hospital
Ian chappell says lara better than ponting and tendulkar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more