Transporter aide of jagan held in emaar case

Transporter aide of Jagan held in Emaar case,N Sunil Reddy, a trusted aide of Kadapa MP YS Jagan Mohan ReddyS Jagan PA, YS Jagan PA Sunil Reddy, YS Jagan personal assistant, YS Jagan close aide, YS Jagan Sunil Reddy, YS Jagan Emaar, YS Jagan illegal assets, YS Jagan disproportionate assets, YS Jagan, Sunil Reddy arrest, Sunil Reddy Emaar case, Sunil Reddy

Transporter aide of Jagan held in Emaar case

Sunil.gif

Posted: 01/27/2012 04:10 PM IST
Transporter aide of jagan held in emaar case

Transporter aide of Jagan held in Emaar case

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో అరెస్టయిన సునీల్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌కు అంత సన్నిహితుడు ఎలా అయ్యారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఊచలు లెక్కిస్తున్న విజయసాయిరెడ్డి ఒక పార్శ్వమైతే, జగన్‌ వ్యవహారాలలో సునీల్‌ రెడ్డి మరో పార్శ్వంగా పేరు పొందారు. వీరిద్దరూ గుట్టు విప్పితే జగన్‌ వ్యవహారం అంతా రట్టు అవుతుందని సీబీఐ భావిస్తున్నది. ఇప్పటికే విజయసాయిరెడ్డికి సత్యశోధన పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్న సీబీఐ, సునీల్‌ రెడ్డి ద్వారా జగన్‌ చిట్టా రాబట్టాలని ప్రయత్నిస్తోంది.

చిరుద్యోగిగా చేరి

జగన్‌ సంస్థలో చిరుద్యోగిగా చేరిన సునీల్‌ రెడ్డి తన చురుకుదనంతో జగన్‌కు ఆంతరంగికుడిగా మారిపో యారు. కడప జిల్లా వీరపు నాయునిపల్లె మండలం అనిమెల గ్రామంలోని సర్రెడ్డి సంగిరెడ్డి రెండవ కుమారుడు సునీల్‌ రెడ్డి. మూడు దశాబ్దాల క్రితమే ఆయన కుటుంబం పులివెందులకు వలస వెళ్ళింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బావ సీవీ సుబ్బారెడ్డికి సంగిరెడ్డి సమీప బంధువు కావటం, వృత్తి రీత్యా జియాలజిస్టు కావటంతో వైఎస్‌ కుటుంబంతో అనుబంధం ఏర్పడింది. గనుల వ్యాపారంలో నష్టపోయిన సంగిరెడ్డిని దివంగత వైఎస్‌ ఆదుకున్నారు. సునీల్‌రెడ్డికి జగన్‌ కంపెనీలో చిరుద్యోగం ఇప్పించారు.

ఆంతరంగిక స్నేహం

సునీల్‌ చురుకుదనాన్ని గమనించిన జగన్‌ అతణ్ణి తన ఆంతరంగికుడుగా నియమించుకున్నారు. వ్యక్తిగత సహాయకుని హోదా కల్పించారు. ఇక అప్పటినుంచి సునీల్‌కు ఎదురు లేకుండా పోయింది. జగన్‌ ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాలన్నీ సునీల్‌ డైరెక్షన్‌లోనే నడిచేవని చెబుతారు. జగన్‌ విద్యుత్‌ రంగంలో అడుగు పెట్టిన మొద టి కంపెనీ సరస్వతీ పవర్‌, ఇది మొదలు జగన్‌ సృష్టించిన చాలా కంపెనీల్లో జగన్‌ సతీమణి భారతీరెడ్డితో పాటు సునీల్‌ కూడా ఒక డైరెక్టర్‌. ఆమెకు బంధువు కూడా. ఎలాంటి హోదా లేకపోయినా జగన్‌ శిబిరంలో అన్నీ ఆయనే. 

జగతి పబ్లికేషన్స్‌లోకి మళ్ళించారని చెబుతున్న కంపెనీల్లో కీలాస్‌ టెక్నాలజీస్‌కు విజయసాయిరెడ్డి, ఆయన సతీమణి ప్రమోటర్లు. అయితే మిగిలిన ఐదు కంపెనీలు జడ్‌ఎం ఇన్ఫోటెక్‌, సిగ్మా ఆక్సిజన్‌, సాయిసూర్య వేర్‌ హౌసింగ్‌, ఎక్సెల్‌ గ్రో సాఫ్ట్‌, రెవెరా జగన్‌ వ్యాపార సామ్రాజ్యానికి కేంద్రంగా చూపించి సండూర్‌ పవర్‌కు ఇన్వెస్టర్ల హోదాలో నిధులు సమకూర్చాయి. ఈ ఐదు కంపెనీల్లోనూ జగన్‌ సతీమణి భారతీరెడ్డితో పాటు సునీల్‌ రెడ్డి చురుకైన పాత్ర పోషించారు.

ఈ నేపథ్యంలోనే... సునీల్‌ పేరు బహిర్గతం

ఈ నేపథ్యంలోనే సునీల్‌రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఎమ్మార్‌ కేసులో కోనేరు ప్రసాద్‌ నుంచి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి డబ్బులు అందజేసింది సునీల్‌ రెడ్డి అని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన కోనేరు ప్రసాద్‌ వాంగ్మూలంలో సునీల్‌ రెడ్డి పేరు ప్రస్తావన ఉన్నందునే ఆయనపై సీబీఐ దృష్టి సారించిందని తెలుస్తోంది. అన్ని అంశాలనూ ధ్రువీకరించుకున్న తర్వాతే సునీల్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసినట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే జగన్‌ పేరు చెబితేనే ఒంటికాలిపై లేచే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుడి అల్లుడే సునీల్‌ రెడ్డి. కడప జిల్లా నక్కలదిన్నెకు చెందిన వీరశివారెడ్డి సోదరుడి కుమార్తెను సునీల్‌ రెడ్డి వివాహమాడారు.
ఎలా పట్టుబడ్డారు?
అసలు సునీల్‌ రెడ్డి ఎలా పట్టుబడ్డారు? ఒక వివాహానికి హాజరు కావటం ఆయన అరెస్టుకు మార్గం సుగమం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. కోనేరు ప్రసాద్‌ను అరెస్టు చేసిన తర్వాత సీబీఐ తన విచారణను వేగవంతం చేయటంతో సునీల్‌ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు సమాచారం కోనేరు అందించిన సమాచారం తన కొంప ముంచుతుందని భావించే సునీల్‌ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు తెలిసింది. అయితే ఇటీవల ఒక వివాహానికి హాజరైన సునీల్‌ రెడ్డి ఆచూకీని కొందరు సీబీఐకి చేరవేశారని,ఆ రకంగా ఆయన పట్టుబడ్డారని చెబుతున్నారు. 

వ్యాపారంపై కన్ను

సునీల్‌ రెడ్డి వ్యాపారంపై కూడా సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సునీల్‌ రెడ్డి గృహ అలంకరణ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆ దుకాణంపై సీబీఐ ఒక కన్ను వేసి ఉంచినట్టు తెలుస్తోంది. గృహ అలంకరణ వస్తువుల దిగుమతుల ముసుగులో జగన్‌కు సంబంధించిన నిధులను విదేశాలకు తరలించారా అనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఈ కోణంలోనూ సీబీఐ దర్యాప్తు సాగుతున్నట్టు సమాచారం.

ఎమ్మార్, ఓబుళాపురం గనులు, జగన్ అక్రమాస్తుల కేసుల నిందితులున్న చంచల్‌గూడ జైలుకే సునీల్ రెడ్డిని రిమాండ్‌కు పంపారు. 'వైఎస్ బంధువు సునీల్ రెడ్డి అరెస్టు' అని తన సొంత పత్రికలో రాసుకున్న జగన్... 'కక్ష సాధింపు చర్యలో భాగంగానే నా సన్నిహితుడు సునీల్‌ను అరెస్టు చేశారు. సునీల్ రెడ్డి... జగన్‌కు సన్నిహితుడు. అంతేకాదు... జగన్‌కు 'కొరియర్'. కోట్ల రూపాయల సూట్‌కేసులను నిర్దిష్ట గమ్య స్థానానికి చేర్చే కొరియర్! ఎమ్మార్ కుంభకోణంలో విల్లాలు, ప్లాట్లు అమ్ముకుని 'నల్ల సొమ్ము' చేసుకున్న టి. రంగారావు... అందులో కొందరి వాటాను సునీల్ రెడ్డి ద్వారానే సూట్‌కేసుల్లో చేరవేశారని సీబీఐ భావిస్తోంది. 'కొరియర్ దొరికాడు అని ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో తెలింది. జగన్ మాత్రం 'సునీల్ రెడ్డితో తనకు ఏ బంధం ఉందో సీబీఐ చెప్పాలి' అని నిలదీయడం విశేషం. ఎమ్మార్ కేసులో అరెస్టైన జగన్ సన్నిహిత బంధువు, ఆయన వ్యాపార సామ్రాజ్యానికి 'ఆర్థిక మంత్రి' అయిన సునీల్ రెడ్డిని అరెస్టు చేసి. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను బే గంపేటలోని సీజీహెచ్ఎస్ ఆస్పత్రికి తీసుకేళ్లరట.

అయితే ఎమ్మార్‌లో విల్లాలు, ప్లాట్ల అమ్మకాల ద్వారా సంపాదించిన కోట్ల రూపాయలను తరలించేశారు. కోనేరు ప్రసా ద్ ఆదేశాల మేరకు తుమ్మల రంగారావు నల్ల ధనాన్ని సేకరించారు. ఆ నల్ల ధనాన్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్లిన వ్యక్తి సునీల్ రెడ్డి. ఆ డబ్బును సునీల్ రెడ్డి ఎవరికి ఇచ్చాడు? ఎంత మొత్తాన్ని తీసుకుని వెళ్లాడు? ఎవరి ఆదేశాల మేరకు సునీల్ ఆ డబ్బును తీసుకెళ్లాడు!? ఈ కుంభకోణం వెనక ఉన్న మూలవిరాట్టు ఎవరు? ఈ విషయాలను నిగ్గు తేల్చాలంటే సునీల్ రెడ్డిని చెప్పాల్సిందే. ఈ కుంభకోణంలో రిజిస్ట్రేషన్ విలువను తగ్గించి.. రికార్డుల్లో చూపకుండా వసూలు చేసిన సొమ్ము చివరికి ఎవరి చేతికి చేరిందో సునీల్ రెడ్డికే తెలుసాడట. అయితే సునీల్ కేసును ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. మళ్లి సునీల్ రెడ్డిని వచ్చే నెల ఒకటో తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు.
అయితే విల్లాలు, ప్లాట్ల అమ్మకాలకు సంబంధించి ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన భూమిని అమ్ముకుని వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని సేకరించిన కోనేరు ప్రసాద్‌కు సునీల్ రెడ్డి సన్నిహితుడని సీబీఐ తన పిటిషన్లో స్పష్టం చేసింది. విల్లాలు, ప్లాట్లకు సంబంధించి ఈహెచ్‌టీపీఎల్‌కు ఏపీఐఐసీ కేటాయించిన 258.36 ఎకరాల భూమిని వీరు అమ్ముకున్నారని తెలిపింది. కోనేరు ప్రసాద్ ఆదేశాల మేరకు విల్లాలు, ప్లాట్ల యజమానుల నుంచి నల్ల ధనా న్ని తుమ్మల రంగారావు సేకరించారు. ఆ తర్వాత ఆ డబ్బును రంగారావు నుంచి సునీల్ రెడ్డి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో డాక్యుమెంటేషన్ ధరకన్నా ఎక్కువగా వసూ లు చేసిన మొత్తాన్ని రంగారావు నుంచి ఎప్పటికప్పుడు తీసుకుని వెళ్లిన సునీల్‌రెడ్డి ఆ డబ్బును ఎవరికి ఇచ్చాడో ఎవరికి తెలియదట. ఎమ్మార్ కేసులో నిందితుడు, జగన్ సమీప బంధువు సునీల్‌రెడ్డికి చంచల్‌గూడ జైలులో నెంబర్ కేటాయించారు. విచారణ ఖైదీ అయిన ఆయనకు యూటీ నెంబర్ 3574 ఇచ్చారు. సునీల్‌రెడ్డిని ప్రస్తుతం అడ్మిషన్ బ్లాక్‌లో ఉంచారట. ఆయనతో పాటు ఈ బ్లాక్‌లో సుమారు 20 మంది ఖైదీలున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jr ntr chandrababu naidu
Mass raja ravi teja is celebrating his birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more