Business man success meet varma comments

Business Man Success Meet varma comments,Mahesh Babu, Kajal Agarwal, Ram Gopal Varma, Puri Jagannath, Krishna at Businessman Hexa,Leave a comment, Telugu Movie Businessman Success Meet Function Held at Hyderabad

Business Man Success Meet varma comments

varma.gif

Posted: 01/24/2012 03:38 PM IST
Business man success meet varma comments

Business Man Success Meet varma comments

సినీ ప్రపంచంలో ఎప్పడు సంచలన ప్రకటనలు చేస్తు .. మీడియా కనిస్తూ .. అందరికి వింతగా కనిప్పించే వర్మ మరో ప్రయోగాని పునుకున్నాడట. తెలుగు, హిందీ, తమిళ్ .. భాషల్లో వర్మ చేతులు కాల్చుకున్నా విషయం సినిమా ప్రేక్షకులకు తెలిసిన విషయమే. సినీ ప్రపంచంలో రామ్ గోపాల్ వర్మం .. ఒక క్రియేటివ్ డైరెక్టర్ అని అందరూ అంటారు. తన క్రియేటివ్ ను ఉపయోగించి మీడియా వాళ్లను ఎలా వినియోగించుకోవాలో వర్మ ఒక్కడే తెలుసు. అలాంటి వర్మ ఇప్పడు తన సినిమా కేరియను కొత్త దిద్దుకోవాలని చూస్తున్నాడట.
ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మతీసిన సినిమాలు అనుకున్నాంత స్థాయిలో రాలేదట. అంటే అన్నీ సినిమాలు ప్లఫ్ కావటంతో వర్మకు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడట. వర్మ దగ్గర ఒక విచిత్రమైన టెక్నిక్ ఉందట. వర్మ ఎవరుతో తన సినిమా తీయాలనుకుంటాడో .. వారిని మీడియా ముందు తెగ పొగిడేస్తాడట.
ఇప్పడు వర్మ టాలివుడ్ పై వల వేసాడట. వర్మ వలలో ఎవరు చిక్కుకుంటారోనని .. సినీ ప్రముఖులంత ఎదురుచూస్తున్నారట. అయితే వర్మ తెలివిగా .. తెలుగు సినిమాల దర్శకులలో పూరి జగ్ననాథ్ మంచి రేంజ్ లో ఉన్న విషయం తెలుసుకోని .. పూరిని గోకటం మొదలు పెట్టాడట. రామ్ గోపాల్ వర్మ ఏంటి , పూరిని గోకటం ఏమిటి అనుకుంటున్నారు. అక్కడే ఒక విషయం దాగి ఉందట. ఇప్పడున్న డెరెక్టర్లలలో పూరికి మంచి విజయాలు సాధించాడు. పూరి విజయం వెనుక ఒక ప్రిన్స్ ఉన్నాడని వర్మ కనిపెట్టాడట. ఇప్పుడు వర్మ కన్ను ప్రిన్స్ మీద పడిందట. ఎలాగైన వర్మ వలలో ఆ ప్రిన్స్ పడేవిధంగా వల విసురుతున్నాడట వర్మ. ఆ ప్రిన్స్ ఎవరో కాదు .. మొన్న ‘దూకుడు’ నిన్న ‘బిజినెస్ మెన్’ వరుసగా రెండు ఘన విజయాలను సాధించిన హీరో ప్రిన్స్ మహేష్ బాబు. హైదరాబాద్ లో జరిగిన ‘బిజినెస్ మెన్’ హెక్సా ప్లాటినమ్ వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా దాసరి నారాయణ రావు, రామ్ గోపాల్ వర్మలు హాజరయ్యారట.
ఈ వేడుక రామ్ గోపాల్ వర్మకు బాగా కలిసి వచ్చిందట. ఇక తన మనస్సులో ఉన్న మాటలను బయట పెట్టాలని మహేష్ బాబు పై పొగడ్తల వర్షం కురిపించాడట. హీరో మహేష్ బాబు అమితాబ్ కంటే గొప్ప నటుడు, మహేష్ బాబును మించిన వాడు ఈ భారత దేశంలోనే లేడని వర్మ కితాబులిచ్చాడట. అయితే వర్మ మహేష్ బాబు పై ఇంత సడన్ గా ఈ వర్షం ఎందుకు కురిపిస్తున్నాడో అక్కడున్న ప్రముఖులకు అర్థం కాలేదట. వంద శాతం అమితాబ్ ను మించిన నటుడు అని రెండు మూడు సార్లు వేదికపైనే వర్మ చెప్పాడట. మహేష్ ఇలా పోగడటం వెనుక అసలు విషయం వేరే ఉందని అక్కడున్న సినీమా విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.
అసలు మహేష్ బాబు పాల బుగ్గలలో అమయాకంగా కనిపింస్తున్నాడు.. కానీ ఆ పాల బుగ్గల వెనుక మహేష్ బాబు పెద్ద ముదురు అనే విషయం అందరి తెలిదని సినీ ప్రముఖులు అంటున్నారు. అయితే వర్మ హీరో మహేష్ బాబు వల వేసాడని .. చిత్ర సీమాలో చెవులు కోర్కుకుంటున్నారట. కానీ మహేష్ బాబు వర్మ ఇచ్చిన కామెంట్లను బాగా ఎంజాయ్ చేస్తున్నాడని వర్మ స్నేహీతులు అంటున్నారు. మరికొందరైతే .. వర్మ వలవేసిన మహేష్ బాబు పడి టైప్ కాదని .. ఆయన చాలా ముదురని ... వర్మకు మహేష్ దూకుడు చూపిస్తాడని ఆయన అభిమానులు గుసగుసలాడుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi parvathi comments on balakrishna
Damodar raja narasimha duputy chief minister of andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more