షారూఖ్ ఖాన్ తెలంణావాడే. షాక్ తిన్నారా ? అవును మీరు విన్నది కరెక్టే. కొంపదీసి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కాదు కదా ? అవును బాలీవుడ్ బాద్ షానే. బాలీవుడ్ లో ఉన్నవాడు ముంబయిలో ఉండేవాడు తెలంగాణకు సపోర్టు చేస్తున్నాడు కాబట్టి తెలంగాణ వాడు అవుతాడనుకుంటే అది మీ పొరపాటు. షారూఖ్ ఖాన్ నిజంగా తెలంగాణ బిడ్డేననట. అదెలాగంటారా?
ఆయన తాజాగా నటించిన చిత్రం ‘డాన్-2’. ‘డాన్’ చిత్రానికి ఇది సీక్వెల్ ఈ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని మూడు భాషలలో విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన పాటల విడుదల కార్యక్రమంలో కోసం ఈ బాద్ షా హైదరాబాద్ వచ్చాడు. అంత మాత్రాన తెలంగాణ వాడు వాడు ఎలా అవుతాడనేగా?
ఈ కార్యక్రమంలో షారూఖ్ ఖాన్ హైదరాబాద్ తో ఉన్న అనుంబంధాన్ని పంచుకున్నాడు. ‘‘ మా అమ్మమ్మ వాళ్ళది హైదరాబాదే. నేను చిన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఇక్కడే పెరిగాను. ఆ తరువాత ముంబయి వెళ్ళిపోయాం. అని చెప్పాడు. అంటే షారూక్ ఖాన్ 5 సంవత్సరాలు ఇక్కడ పెరిగాడు, అందులోనూ వాళ్ళమ్మమ్మ వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాబట్టి ఇతను కూడా తెలంగాణ వాదిగానే పరిగించవచ్చని, ముంబయిలో ఉన్నంత మాత్రాన ఇండియన్ అవుతాడు కానీ, బేసిగ్గా చూస్తే తెలంగాణ వాదే అవుతాడని తెలంగాణ వాదులు కొందరు అనుకుంటున్నారు. షారూఖ్ తన అనుభవాలను చెబుతూ, నాకు హైదరాబాదీ బిర్యానీ అన్నా, హలీమ్ అన్నా చాలా ఇష్టం. ఇక్కడ ఉన్నట్లు మరెక్కడ ఉండదని కూడా కితాబు ఇచ్చాడు.
సో... మొత్తానికి బాలీవుడ్ హీరోలలో కూడా తెలంగాణ హీరోలు ఉన్నారని తెలంగాణ వాదులు సంబరపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more