Kepler 22b the new earth could have oceans and continents

planet, moon, space, exomoon, exoplanet, colonised, light years, Space,Science

Kepler 22b, the planet which scientists say hold the best hope yet for future human habitation, could have continents, oceans and creatures already living

new Earth Kepler 22b.gif

Posted: 12/07/2011 05:38 PM IST
Kepler 22b the new earth could have oceans and continents

kepler-22b

ప్రపంచ జనాభా రోజు రోజుకు పెరిగిపోతుంది.  దానితో పాటు ప్రజా సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. పరిజ్ణాణంలో ఎంతో ముందుకు వెళ్తున్నా మన దేశంలో ఉండే కొందరికి ఉన్న సమస్యలు అస్సలు తీరడంలేదు. అయితే  వీరందరి కోరికలు త్వరలోనే తీరనున్నాయని, వారి కోరికలు తీరితే ఆంధ్రప్రదేశ్ గాక, భారతదేశం కూడా సమస్యలులేని దేశంగా తయారుకానుందని అనుకుంటున్నారు.

తాజాగా భూమిని పోలిన మరో గ్రహం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో భూమి కన్నా 2.4 రెట్ల పరిమాణంలో ఉన్న కెప్లర్ 22 – బి అనే ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత కూడా సుమారు 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అందువల్ల దీన్ని ‘ఎర్త్ 2.0’ అనొచ్చని నాసా చెబుతుంది. నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా దీని అనుపానులు కనుగొన్నారు. మట్టితో పాటు నీరు కూడా ఉండే ఈ గ్రహం మీద జీవనానికి కావాల్సిన స్థాయిలోనే ఉష్ణోగ్రతలు  కూడా ఉంటాయట. నక్షత్రానికి గ్రహం ఎంత దూరంలో ఉందన్న దాని మీదనే ఆ గ్రహం మీద జీవనం సాగించగలదా లేదా అన్నది ఆధార పడుతుందని . కెప్లర్ 22 – బి మీద సంవత్సరానికి 290 రోజులు ఉంటాయి. కెప్లర్ 22బి నివాసానికి అనుకూలమని , దాని ఉష్ణోగ్రతలు కూడా బాగున్నాయని నాసా తెలిపింది.

అదేంటి కొత్త గ్రహం ఏర్పడితే భారతదేశం, ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎలా తీరుతాయనే కదా మీ సందేశం...... కొత్త భూమి వల్ల సమస్యలు తీరుతాయని కామెడీగా చెప్సుకుంటున్నారు. ఎలా అంటే... ముందుగా మన రాష్ట్రానికి సంబంధించిన అంశం తీసుకుంటే....
టీడీపీ ఆధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత అధికారం లేక అల్లాడుతున్నాడు. ఈయన గనుక అక్కడికి వెళ్తే విజన్ 20-20 అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి రావచ్చని, అక్కడ కూడా హైటెక్ సిటీల లాంటివి కట్టి మరింత టెక్నాలజీని అందించవచ్చని ప్రజలు అనుకుంటున్నారు.

అనుకోని పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డిని పంపిస్తే... తన పై అక్కడ అవిశ్వాసం గోల ఉండదని, తను ప్రవేశ పెట్టదలుచుకున్న ‘రాజీవ్ యువ కిరణాల’ వంటి పథకాలను అందరి మీద ప్రసరింప చేయవచ్చని అనుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ రాజకీయ నాయకులకు, ఇటు ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తుస్తు తెలంగాణ అంశానికి అగ్గి రాజేస్తున్న కేసీఆర్ ను గనుక ఈ కొత్త భూమి మీదికి పంపినట్లయితే.... అక్కడ కేసీఆర్ ఈజీగా తెలంగాణ రాష్ట్రం సంపాదించ వచ్చని, అక్కడ అధిష్టానం ఉండదని తనకు తానే తెలంగాణ ప్రకటించుకోవచ్చని, తానే ముఖ్యమంత్రి కావచ్చని, తన కుటుంబానికి చెందిన వారే అక్కడ పరిపాలించ వచ్చని అనుకుంటున్నారు.

తన తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించిన జగన్ ని అక్కడికి పంపిస్తే.... అధికారం కోసం తపిస్తున్న జగన్ ముఖ్యమంత్రి కావచ్చని, అక్కడ తన అవినీతి ఎవరికి తెలియదు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి అవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదని,  ఇతనికి భూగ్రహం మీద అండగా ఉన్న కర్ణాటక గాలి జనార్థన్ రెడ్డిని కూడా అక్కడికి పంపిస్తే అక్కడ జగన్ ముఖ్యమంత్రి అయ్యి అతను తవ్వుకోవడానికి గనులు ఇష్టానుసారంగా లీజుకు పొందవచ్చని, అక్కడ ఇద్దరు కలిపి ఇక్కడి కన్నా ఎక్కువ సంపాదించవచ్చని అక్కడ ఎంత సంపాదించిన అడిగేవారు ఉండరని, జైలు వెళ్ళే కర్మ పట్టదని, గాలి లాంటి వారికి గనుల లీజులు కట్టబెట్టాలంటే శ్రీలక్మి, రాజగోపాల్ లాంటి ఆఫీసర్లను పంపిస్తే జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారని వారిని అక్కడ అరెస్టు చేసే వారు ఉండరని అనుకుంటున్నారు.
అక్కడ జగనే ముఖ్యమంత్రి గా ఉంటాడు కాబట్టి కోనేరు రంగారావు లాంటి వాళ్ళను పంపిస్తే అక్కడ కూడా ఎమ్మార్ లో పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద ప్రాజెక్టులు కట్టవచ్చని, విల్లాలు ఇక్కడి ధర కన్నా అక్కడ ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చని అంటున్నారు.
ఇక కేంద్రం విషయానికి వస్తే...... భారతదేశాన్ని ఓ కుదుపు కుదుపేసిన 2జి స్కాం నిందుతులు రాజా, కనిమొళి లాంటి వాళ్ళను పంపిస్తే అక్కడ జగన్ అధికారంలో ఉంటాడు కాబట్టి వీరు అక్కడ కూడా 3.జి, 4జి, 5జి లాంటి టెక్నాలజీలు పెట్టి పెద్ద పెద్ద స్కాంలు చేయవచ్చని, వాటితో అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానెల్ లు ఏర్పాటు చేసుకోవచ్చని అంటున్నారు.

ఇక్కడ కేంద్ర క్రీడలశాఖ మంత్రిగా చేసి జైలు పాలైన సురేష్ కల్మాడీని అక్కడికి పంపిస్తే... అక్కడ కామన్ వెల్త్ క్రీడలు నిర్వచించకుండానే మొత్తం డబ్బులు కాజేయవచ్చని, వాటితో అక్కడ ఒలంపిక్స్ కూడా నిర్వహించవచ్చని అంటున్నారు. వీటన్నింటిని అక్కడికి చేరవేయడానికి మన లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా తన విమాన సర్వీసులను నడుపుకోవచ్చని అక్కడ సురేష్ కల్మాడీ లాంటి కిలాడీతో కలిసి ఫార్మలా 1 వంటి రేసులు నిర్వహించుకోవచ్చని, అక్కడి వెళ్ళిన తరువాత ఇక్కడి విమాన చమురు సంస్థలకు డబ్బులు కట్టాల్సిన పనిలేదని అంటున్నారు.

ఎప్పటి నుండో ప్రధానికి పదవిని ఆశిస్తున్న అధ్వానిని పంపిస్తే... ఇక్కడ రథయాత్రలు చేసినట్లు అక్కడ గ్రహయాత్రలు చేసుకోవచ్చని, ప్రధాన మంత్రి కావచ్చని అంటున్నారు.

ఎలాగూ అక్కడికి వెళ్ళేది అవినీతి పరులే కాబట్టి అక్కడ పోరాటం చేయడానికి అన్నా హజారే, కిరణ్ బేడీ, క్రేజీవాల్ లాంటి వాళ్ళను పంపిస్తే గట్టి లోక్ పాల్ ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు.
అక్కడ వున్న వారికి యోగా నేర్పించడానికి రామ్ దేవ్ బాబాను, మత ప్రచారం చేయడానికి స్వామి నిత్యానందను పంపిస్తే బాగుంటుందని అంటున్నారు.

అక్కడి వారికి సినిమాలు కావాలి కాబట్టి... సినీ రంగం నుండి బాలక్రిష్ణను పంపిస్తే అక్కడ ‘శ్రీగ్రహ రాజ్యం’ సినిమా తీసి పైవారి మన్ననలు పొందవచ్చని అంటున్నారు.వీరందరు తమ తమ సమస్యలతో సతమతమై ప్రజలకు సమస్యగా తయారయ్యారు. ఎలాగు కొత్త భూమి ఏర్పడింది కాబట్టి వీరందరిని అక్కడికి పంపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వారికున్న బాధలు తీరిపోయి సంతోషాలతో ఉంటారని, దాంతో దేశం కూడా భాగుపడుతుందని అనుకుంటున్నారు ప్రజలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi vs akhilesh yadav campaign in up
Jagan avaiod the telugu media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more