Telangana Congress to the grave

Telangana congress to the grave

congress, Telangana, TRS, Congress party in telangana, Telangana state, Warangal bypolls, Warangal

Telangana congress party facing hard time. Congress party not getting minimum response from the people. In Warangal bypolls congress bags The worst defeat

కాంగ్రెస్ కు తెలంగాణలో సమాధి..?

Posted: 11/24/2015 04:26 PM IST
Telangana congress to the grave

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తూ నాటి అధికార యుపిఎ పక్షం తీసుకున్న నిర్ణయానికి ఆంద్రా ప్రజలు కన్నెర్రజేశారు. ఏపిలో ఎక్కడా కూడా కాంగ్రెస్  ఆనవాలు లేకుండా చేశారు. అయితే తెలంగాణలో మాత్రం పార్టీకి మంచి పట్టుందని.. తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ కూడా ఉందని ముందు నుండి వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా నూకలు చెల్లినట్లు కనిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కూడా పార్టీకి ఏ మాత్రం అనుకూలంగా లేదని తేలింది. కాంగ్రెస్ అభ్యర్థి కనీసం టిఆర్ఎస్ అభ్యర్థి దరిదాపుల్లో కూడా లేకపోవడం. గత కొంత కాలంగా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగలడం పార్టీకి సంకటంగా మారింది.

కేసీఆర్ దీక్ష ఎందుకు విరమించారు..? చెప్పండి

తెలంగాణ తెచ్చింది మేమే.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేలా మేమే పోరాటం  చేశాం.. అమ్మ సోనియమ్మ దయతోనే తెలంగాణ కల సాకారమైందని రకరకాలుగా డబ్బా కొట్టిన కాంగ్రెస్ నాయకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏపిలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి కూడా జనాలు కనిపించడం లేదో అదే తరహాలో తెలంగాణలో కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క సారి కూడా అధికార పార్టీకి ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. అందుకే పార్టీకి ఎక్కడా కూడా పట్టురాలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నా కానీ భవిష్యత్ లో వరంగల్ తరహా ఫలితాలే వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ  పరిస్థితి ఏంటా అని సర్వత్రా చర్చ సాగుతోంది.

పవన్-బాబుల మీటింగ్.. ఒక ‘హైడ్రామా’! 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్కోప్ ఉన్నా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో టిఆర్ఎస్ కు మాత్రం ఎదురు నిలబడలేకపోతోంది. ఇప్నటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు పార్టీ మారారు.. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకే భవిష్యత్ ఉంటుందని ఆలోచించి గులాబీ దళంలో చేరారు. అలా కాంగ్రెస్ క్యాడర్ చాలా వరకు ఖాళీ అయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం చాలా మైనస్. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఉన్నా కానీ క్యాడర్ ను నడిపించే సత్తా లేకనోవడంతో పార్టీకి గడ్డుకాలం వచ్చింది. పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సమాధి ఖాయంగా కనిపిస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  Telangana  TRS  Congress party in telangana  Telangana state  Warangal bypolls  Warangal  

Other Articles