National Highways turns a nightmare for commuters గోతులమయంగా జాతీయ రహదారులు.. నెట్టింట్లో వీడియోలు..

From reviews to photoshoots how pothole issues are going viral on social media

jharkhand national highway roads, kerala national highway roads, madhya pradesh national highway roads, uttar pradesh national highway roads, potholes on national highways, toll charges on national highway roads, poor condition of national highway roads, netizens on national highway roads, opposition parties on national highway roads, Congress MLA Deepika Pandey Singh, national highway, prime minister, union minister, national politics

A recent government data shows that road accidents caused by potholes led to death of 5,626 people between 2018 and 2020. Mumbai and Bengaluru are among two of the most prominent Indian cities where potholes are a regular menace for commuters.

గోతులమయంగా జాతీయ రహదారులు.. నెట్టింట్లో వీడియోలు..

Posted: 09/22/2022 03:04 PM IST
From reviews to photoshoots how pothole issues are going viral on social media

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర పరిస్థితులను ఎక్కుపెడుతూ ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. దేశ ప్రజలకు అందే నిత్యావసర సరుకులలో తమ వాటా ఎంతో చెప్పాలని నిలదీస్తున్న కేంద్రమంత్రులు.. దేశంలోని రోడ్లు ఎంతలా గోతులమయంగా మారాయో మాత్రం అడగడం లేదు. కార్లున్న మారాజులు కార్లలో, విమానాల్లో వెళ్తుంటే.. ప్రజలు మాత్రం గుంతలమయంగా మారిన ఈ రోడ్లపై ప్రయాణించి ప్రతీ రోజు నరకయాతన అనుభవిస్తున్నారు.

సోషల్ మీడియాలో నెటిజనులు తమ రోడ్డ పరిస్థితులపై గగ్గోలు పెడుతున్నా.. వాటికి సంబంధించిన వీడియోలు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతున్నా.. ఇవి మాత్రం అటు కేంద్రంలోని ప్రభుత్వానికి కానీ లేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు కానీ కనిపించడం లేదు. ఉత్తర్ ప్రదేశ్ లో తమ రోడ్ల దుస్థితిని వివరించేందుకు ఏకంగా తమ రోడ్లను గోవా బీచ్ లను తలపిస్తున్నాయని సింబాలిక్ గా చెబుతూ.. రోడ్డు మధ్యలోని గుంతలలో కుర్చీలు వేసుకుని పాప్ కాన్ తింటూ ఎంజాయ్ చేశారు. ఇక మధ్యప్రదేశ్ లో నెటిజనులు తమ రోడ్ల దుస్థితిని వివరించేందుకు ఏకంగా బురద నీటిలో పొర్లు దండాలు పెట్టారు.

ఇక కేరళలో యువకులు తమ జాతీయ రహదారుల తీరును ప్రదర్శిస్తూ.. ఏకంగా బురద నీటిలో స్నానం చేసి యోగాసనాలు వేశారు. ఇక అదే సమయంలో అటుగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కారు రావడం.. దానిని వారు నిలువరించడం.. అంతా చకచకా జరిగిపోయింది. అయితే ఇది జాతీయ రహదారి అని.. దీనికి తమకు సంబంధం లేదని.. వీటిపై కేంద్రంలోని జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ స్పందించాలని తెలిపారు. ఇలా ఒకటి రెండు కాదు సోషల్ మీడియాలో అనేక వీడియోలు జాతీయ రహదారుల దుస్థితిని తలపిస్తూన్నాయి. అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇక రెండు రోజుల కిందటే ఓ యువతి పెళ్లికూతురులా ముస్తాబై.. కేరళలోని భారీ గోతుల మయంగా మారిన రోడ్లపై నడిచింది. పెళ్లికూతురు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ను తలపించేలా ఉన్న ఈ ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేశాయి. ఇక అదే సమయంలో జాతీయ రహదారుల దుస్థితిని కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేసింది ఓ శాసనసభ్యురాలు. జార్ఖండ్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే తమ అసెంబ్లీ పరిధిలోని జాతీయ రహదారిని వెంటనే మరమత్తులు చేయాలని జల్ దీక్ష చేశారు. ఇందులో భాగంగా అమె రోడ్డుపై నిలిచిన బురదనీటితో స్నానం చేశారు. దీంతో నెటిజనులు కేంద్రం ప్రచారాలకు పెట్టే ఖర్చును.. పనులకు ఖర్చుపెడితే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles