Will Ruling TRS party win Munugode Assembly by-elections అక్కడ కలసి రానీ లక్కు.. మునుగోడులో కలసి వచ్చేనా..?

Will luck favour ruling trs party to win munugode assembly by elections

Can TRS win Munugode By-Elections, TRS Govt Developmental works, who wins in Munugode Assembly by-polls, will Komatireddy Rajgopal Reddy regain his MLA seat, CM KCR win sketch for munugode, Minister KTR big campaign plan, By-Elections, TRS party, Munugode Assembly by-polls, Komatireddy Rajgopal Reddy, CM KCR, Minister KTR, Revanth Reddy, Nalgonda, Telangana, Politics

It will turned to be a landmark achievement for Ruling Telangana Rashtra Samithi (TRS) party if the party wins Munugode Assembly By-Elections which are to be held soon. As the TRS leaders saying, how can the ruppee which was rejected in Gajwel and Huzurabad by-elections can be accepted in Munugode bypolls.

అక్కడ కలసిరానీ లక్కు.. మునుగోడులో కలసి వచ్చేనా..?

Posted: 09/07/2022 08:34 PM IST
Will luck favour ruling trs party to win munugode assembly by elections

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన తరువాత.. ఎవరెన్ని హామీలు ఇచ్చినా.. వరాలు కురిపించినా.. యావత్ రాష్ట్రం టీఆర్ఎస్ వైపునే నిలబడింది. ఆ పార్టీకి చెందిన నేతలకు ఉద్యమ నేపథ్యం ఉందా.? లేదా.? అన్న విషయాల్లోకి వెళ్లకుండా కేవలం ఆ పార్టీకి చెందిన వ్యక్తులా.? కాదా.? అన్న అలోచన మాత్రమే చేసింది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీకే విజయాన్ని కట్టబెట్టారు ప్రజలు.

ఈ క్రమంలో తొలి పర్యాయం ముగిసిన తరువాత ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణతా శాతం తగ్గిపోవడం.. దాంతో దాదాపుగా రెండు పదులకు పైగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం కూడా జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారగా, ఆలస్యంగా దిద్దుబాటుచర్యలకు ఉపక్రమించింది రాష్ట్ర సర్కారు. ఇక ఆతరువాత ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో  ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో అనేక మంది అసువులు బాసారు. ఎటువంటి పరిస్థితుల్లో కార్మికులను విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిన సర్కార్.. కార్మికులు బలవన్మరణాలు తీవ్రచర్చనీయాంశం కాగా.. ఆనక దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

ఈ రెండు ఘటనలతో రాష్ట్రప్రభుత్వంపై ప్రజల్లో ఓ విధమైన అసంతృప్తి ఏర్పడింది. దీనికి తోడు నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్యలకు నోటిఫికేషన్ల మంత్రం పనిచేస్తున్నా.. ఇప్పటికీ ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడిన అసంతృప్తి మాత్రం అదృశ్యం కావడం లేదు. ఈ లోగా రెండో పర్యాయంలో ఇప్పటికే ఉపఎన్నికలు కూడా కలవర పెడుతున్నాయి. ఒక్క నాగార్జున సాగర్ మినహా అటు గజ్వల్, ఇటు హుజూరాబాద్ లలో ఓటిమిని చవిచూసిన అధికార పార్టీ.. ఎలాగైన మునుగోడులో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే గజ్వెల్, హుజూరాబాద్ లలో కోట్ల రూపాయల ప్రజాధనం కుమ్మరించినా కలసిరాని అదృష్టం ఇప్పుడైనా కలసివస్తుందా.. అన్నది ప్రశ్నర్థకంగా మారింది.

ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసివచ్చినవి ఉప ఎన్నికలు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉపఎన్నికలలో విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అధికార పార్టీ తాజాగా తిరోగమనం బాట పడుతోంది. పార్టీ ఆవిర్బావం నుంచి కలసి నడిచిన ప్రముఖ నేతలు.. బయటకు వచ్చి వేరే పార్టీల బాట పడుతున్నారు. రఘునందన్ రావు సహా ఈటెల రాజేందర్ ఇద్దరూ ఈ కోవకు చెందినవారే. ఉపఎన్నికలలో వీరు విజయం సాధించగా.. అడ్డుకునేందుకు అహర్నిషలు పనిచేసిన అధికార వర్గాలకు ఆఖరుకు అపజయం మాత్రమే దక్కింది. గజ్వల్ పక్కన బెడితే హుజూరాబాద్ లో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించి అభివృద్ది చేసినా.. విజయం మాత్రం ఈటెలనే వరించింది.

ఉపఎన్నికల దిట్టగా పేరోందిన టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు మాత్రం ఉప ఎన్నికలు అంటేనే ప్రచారాంశాలు పక్కనబెట్టి.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు సాధ్యమైనంత ప్రజాధనం కుమ్మరించి అభివృద్ది పనులు చేస్తోంది.  అయినా అధికార పార్టీ నేతలు తమ నానుడిగా మార్చుకన్న ఊతపదం.. ‘‘అక్కడ చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుబాటు అవుతుందా.? గజ్వల్, హుజూరాబాద్ లలోని ఉప ఎన్నికలలో చెల్లని రూపాయి.. ఇప్పుడు మునుగోడులో ఎలా చెల్లతుంది.?’’ ప్రజలే ఆలోచించుకోవాలని ప్రత్యర్థి పార్టీలు కూడా ప్రజలకు బలంగానే చెబుతున్నాయి.

మునుగోడులో అధికార పార్టీకి బలమైన పట్టులేదు. గత ఎన్నికల మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపోందడం నల్లేరు మీద నడకలా సాగింది. మరీ అదే ఈ సారి కూడా రిపీట్ అవుతుందా.? అంటే అనుమానాలకు తాజాగా వినిపిస్తున్న విమర్శలు అనేకం తావిస్తున్నాయి. తాను ఇన్నాళ్లు కోనసాగిన పార్టీని కాదని.. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని కాదని, ఆ పార్టీకి బద్ద వ్యతిరేకి అయిన బీజేపి తీర్థం పుచ్చుకుని వెళ్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం తన అప్పులను.. వ్యాపారా లావాదేవీలను చక్కబెట్టుకునేందుకు మాత్రమే రాజగోపాల్ రెడ్డి బీజేపి తీర్థం పుచ్చుకున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ఈ తరుణంలో ఉపఎన్నికలను ఎవరు ఎవరికి అనుకూలంగా మార్చుకుంటారోనన్నది ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles