hi-drama behind chandrababu and pawan kalyan latest meeting | opposition party leaders comments on chandrababu | pawan with babu

Hi drama behind chandrababu pawan kalyan meeting says opposition party leaders

chandrababu naidu, pawan kalyan, pawan met chandrababu, congress leader c rama chandraiah, ysrcp leaders, pawan kalyan updates, pawan kalyan controversies, pawan kalyan news, pawan kalyan janasena, pawan kalyan with chandrababu, kamineni srinivas

hi-drama behind chandrababu pawan kalyan meeting says opposition party leaders : opposition party leaders creating new sensations by making controversial comments on pawan kalyan and chandrababu's meeting.

పవన్-బాబుల మీటింగ్.. ఒక ‘హైడ్రామా’!

Posted: 11/13/2015 07:12 PM IST
Hi drama behind chandrababu pawan kalyan meeting says opposition party leaders

జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడుతో ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ప్రత్యేకహోదా గురించి ఏమీ చర్చించలేదన్న పవన్.. గిరిజనుల సంక్షేమం కోసం మంచి పనులు చేయాలంటూ బాబుని కోరినట్లు చెప్పారు. అలాగే తమ భేటీలో మాట్లాడుకున్న మరికొన్ని విషయాలను వెల్లడించారు. అయితే.. విపక్ష పార్టీ నేతలు వీరి భేటీపై తమదైన శైలిలో విమర్శలు చేయడం మొదలు పెట్టేశారు. వీరి మీటింగ్ వెనుక పెద్ద కుట్రే దాగివుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సి.రామచంద్రయ్య వీరి భేటీపై విమర్శలు చేస్తూ.. బాబు-పవన్ ల భేటీ వెనుక పెద్ద హైడ్రామానే నడిచిందని ఆరోపించారు. చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో మీడియాతో శుక్రవారం ఆయన... ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. పవన్ రాకకోసం చంద్రబాబే స్వయంగా ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి సిద్ధం చేసిన స్ర్కిప్ట్ను జనసేన అధ్యక్షుడు పవన్ చదివి వినిపించారంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు ఏపీలో బలం ఉందని చెప్పుకోవడానికే పవన్ను విజయవాడ రప్పించుకున్నారని ఫైర్ అయ్యారు. వీరిద్దరూ లోలోపలే రహస్య ప్రణాళికలు నడుపుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో చంద్రబాబు బీజేపీకి దూరమవుతారని పేర్కొన్నారు. బాబు తన ఇమేజ్ ప్రజల్లో పెంచుకోవడం కోసమే పవన్ సహకారాన్ని కోరుకుంటున్నారన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. అటు వైఎస్ఆర్సీపీ నేతలు సైతం వీరి భేటీపై రకరకాల అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఈ విధంగా విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు వివరించేందుకు పవన్ తన సొంత ఖర్చుతో విజయవాడకు వచ్చారని ఆయన తెలిపారు. ప్రత్యేక విమానంలో ప్రభుత్వం ఆయన్ను తీసుకువచ్చిందని వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై వైసీపీకంటే మెరుగ్గా పవన్ పోరాడుతున్నారని ప్రశంసించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  pawan kalyan  kamineni srinivas  c rama chandraiah  

Other Articles