BJP behind aamir khan intolerance comments..?

Who is behind aamir khan intolerance comments

aamir khan, political analyists, shiv sena, congress, uddav thackery, intolerance, anupam khar, puri jaganath, mamata banerjee, aravind kejriwal, abhishek manu singhvi, snapdeal,, BJP, PM modi, Play Store, e-commerce, Dil ki Deal, AdEx India, TAM Media Research, bjp bihar assembly elections defeat

Is Bharatiya Janata Party behind Aamir khan comments on intolerance..? political analyists says aamir khan might be under influence of bjp to make bihar defeat, and anti bjp issues side track

అమీర్ ఆ వ్యాఖ్యల వెనుక వారి ప్రమేయం..?

Posted: 11/29/2015 05:23 PM IST
Who is behind aamir khan intolerance comments

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మత అసహనంపై చేసిన వ్యాఖ్యలు వెనుక ఎవరున్నారు..? రచయితలు, నటులు, కళాకారులు తమ అవార్డులను తిరిగిస్తూ.. మోడీ ప్రభుత్వంపై అవార్డ్ వాపసీ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ తరుణంలో ఆ ఉద్యమం కాస్త మెతకబడుతుందన్న తరుణంలోఅమీర్ ఖాన్ మళ్లీ  ఎందుకు రగిలించారు. నిజంగా అమీర్ ఖాన్ ఎవరి ప్రేరణతో ఈ వ్యాఖ్యలు చేశారన్నది తెలియని ప్రశ్నగా మారుతుంది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ ను దేశం విడిచి వెళ్లాలని కోందరు విమర్శించగా, మరెందరో ఎన్నో రకాలుగా విమర్శలు గుప్పించారు.

స్వయంగా బీజేపి కేంద్ర మంత్రి అమీర్ ఖాన్ ఎవరి ప్రేరణతోనే ఈ వ్యాఖ్యాలు చేస్తున్నారని అన్నారు. ఇక నిదానంగా స్పందించిన శివసేన నిజంగానే అమీర్ ఖాన్ ఆలాంటి వ్యాఖ్యలు చేసి వుంటూ చంపి వేస్తామన్నారు. మరోవైపు హిందుత్వ సంఘ నేతలు అమీర్ ఖాన్ ని చంపదెబ్బ కోడితే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇక కోందరైతై రాజకీయాలకు కూడా అమీర్ వ్యాఖ్యలను ముడిపెట్టారు. అమీర్ ఖాన్ కాంగ్రెస్ వాది అని అందుకనే ఆలాంటి వ్యాఖ్యాలు చేశార్నన్నారు.

అయితే అమీర్ వ్యాఖ్యల వెనుక బిజేపీ నేతలే వున్నారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సాహితీ వేత్తల అవార్డులు వెనక్కివ్వడం నుంచి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం పెరిగిపోయిందంటున్నారు, దీనికి తోడు గోమాంసం ఉదంతం దానిపై అప్పట్లో రాజుకున్న వేడి కూడా బీజేపిని ఇరకాటంలో పెట్టాయని అంటున్నారు. ఇది చాలదన్నట్లు హిందూత్వ వ్యాఖ్యల ఆ పార్టీకి చెందిన నేతలు, ఎంపీలు కూడా పార్టీ ప్రతిష్ట దిగజార్చేందుకు కారణమయ్యారని విశ్లేషకులు అంటున్నారు.

వీటన్నింటికన్నా దేశ ప్రజలకు మరో ఐదేళ్ల వరకు గుర్తిండిపోయేలా బీహార్ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరాంగనంలో ఇచ్చిన తీర్పుతో బీజేపీ ప్రతిష్ఠను మసకబార్చాయని, ఇది ఇరత రాష్ట్రలలో బీజేపి ఎదుగుదలకు  అడ్డుకట్ట వేస్తుందన్నారు. అన్ని రాష్ట్రాలలో బీజేపిని అధికారంలోకి తీసుకురావాలనుకున్న తమ కల సాకారం కాకుండా పోతుందని, ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిష్ట వాటిల్లిన అపఖ్యాతిని పక్కదారి పట్టించాలంటే.. ఏదో ఒక మంచి అంశం.. అది కూడా తమకు లాభపర్చే అంశాన్ని తెరమీదకు తీసుకురావాలని బీజేపి అగ్రనేతలు భావించారని వారన్నారు.

అందులో భాగంగానే బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ తో లోపాయికారి ఓప్పందం చేసుకునే మత అసహనానిక సంబంధించిన వ్యాఖ్యలు ఆయనతో చెప్పించి.. దేశ ప్రజలు దృష్టిని బీజేపి చాకచక్యంగా పక్కదారి పట్టించిందని విశ్లేషకులు పేర్కోంటన్నారు. అమీర్ చేసిన వ్యాఖ్యలు దేశంలోని హిందూత్వ వాదులను ఏకతాటిపైకి తెచ్చాయి. వీరంతా బీజేపీకి అండగా నిలిచారు. అమీర్ ఖాన్ మాట్లాడింది తప్పంటూ విమర్శించారు. దీంతో అప్పటి వరకు బీజేపి పైనున్న వ్యతిరేకత కాస్త పోయింది. ఇక బీహార్ ఎన్నికల ఓటమిని ప్రజలు మర్చిపోయారని ఇదంతా బీజేపి నేతలు వ్యూహాత్మక తెరవెనుక నాటకంలో భాగమని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  political analyists  modi  bihar defeat  bjp  congress  

Other Articles