Why KCR broke fasting in protest

Why kcr broke fasting in protest

KCR, Jaipal Reddy, KCR in Protest, Telangana, Congress, Jaipal Reddy Slams KCR, KCR on Congress party, KCR in Fasting, Jaipal Reddy slams KCR

Congress senior leader jaipal Reddy slams Telangana cm KCR. He said that KCR must tell the reason behind the broken fasting. Actually KCR broke his fasting while the time to protest for seperate telanagana state.

కేసీఆర్ దీక్ష ఎందుకు విరమించారు..? చెప్పండి

Posted: 11/18/2015 01:36 PM IST
Why kcr broke fasting in protest

కాంగ్రెస్ లో అప్పుడెప్పుడో కనిపించిన నాయకులు మళ్లీ తెర మీదకు వస్తున్నారు. యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వెలుగు వెలిగిన జైపాల్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. వరంగల్ ఎన్నికల నేపధ్యంలోనో లేదంటే మరో కారణంతోనో కానీ కేసీఆర్ మీద అంతెత్తున మండిపడ్డారు జైపాల్ రెడ్డి. అసలు తాను రాజకీయం చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని కూడా వెల్లడించారు. అలాగే తెలంగాణ ఏర్పడడానికి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయని.. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని ఆయన వెల్లడించారు.

Also Read: ఏపి నుండి మోదీకి 'మట్టి' పార్సిల్

ఊహకందని అసత్యాలు, అబద్ధాలతో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ నిరాహారదీక్ష ఎలా చేశారో అందరికీ తెలుసన్నారు. అసలు కేసీఆర్ దీక్షను ఎందుకు విరమించారో ఇంతవరకూ వివరణ ఇవ్వలేదన్నారు. ప్రజాసంఘాల ఒత్తిడి మేరకే...భయపడి కేసీఆర్ తిరిగి దీక్షను కొనసాగించారని ఆరోపించారు. కేసీఆర్‌ దీక్ష మర్మాన్ని త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని... తెలంగాణ కోసం కాంగ్రెస్‌ ఎంపీలను ఏకతాటిపై నడిపించానన్నారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసివుంటే తెలంగాణ వచ్చేదేకాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఎందుకు నిరాహార దీక్ష చేశాడో తాను తొందరలోనే వివరిస్తానని జైపాల్ రెడ్డి బాంబ్ పేల్చారు. మరి చూడాలి వరంగల్ ఎన్నికల నేపధ్యంలో కేసీఆర్ మీద కాంగ్రెస్ ఎలాంటి ఆరోపణలు చేస్తుందో.. అందులో ఎన్నింటిని నిరూపిస్తుందో..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles