ఎంత లేట్ అయితే అంత మంచింది | Boost For OPS on Governor Decision Delay.

Tamil nadu governor favours wait and watch on sasikala

Tamil Nadu Governor, Governor Vidyasagar Rao, Vidyasagar Rao Sasikala, Governor Vidyasagar Rao Panneerselvam, Governor Vidyasagar Rao Central Government, Governor Vidyasagar Rao, Panneerselvam MLAs, Sasikala MLAs, AIADMK MLAs, AIADMK General Secretary

Tamil Nadu Governor Vidyasagar Rao Favours Wait and Watch On Sasikala, Says No Report Sent To Centre. Not prudent to invite Sasikala to form government.

శశికళకే ఫేవర్ గా నిర్ణయం?

Posted: 02/11/2017 08:03 AM IST
Tamil nadu governor favours wait and watch on sasikala

దర్శకుడు వర్మ చెప్పినట్లు తమిళనాడులో రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. అయితే ఉన్నపళంగా శుక్రవారం రాత్రి డ్రామాకు గవర్నర్ శుభం కార్డు వేసినట్టు శుక్రవారం రాత్రి ఒక్కసారిగా వార్తలు ప్రసారం కావటం పెను కలకలాన్నే రేపింది. దీంతో ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారంటూ టెన్షన్‌ మరింత ఎక్కువైంది. ఒక్క నిర్ణయం ఇద్దరి తలరాతలు మార్చేది కావడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. అయితే గవర్నర్ నిర్ణయం వెలువరించేందుకు తీసుకునే సమయం కూడా పన్నీర్ సెల్వం, శశికళ జాతకాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(2) ప్రకారం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే విచక్షణాధికారానికి కూడా పరిమితులు ఉంటాయి. గవర్నర్ కనుక వెంటనే నిర్ణయం తీసుకుంటే శశికళ సీఎం పీఠంపై కూర్చుంటారని, ఒకవేళ ఆలస్యమైతే కనుక పన్నీర్ సెల్వం తిరిగి గద్దెనెక్కడం ఖాయమని అంటున్నారు.

163(2) ఏం చెబుతోంది...

మెజారిటీ ఎమ్మెల్యేలున్న ఒక పార్టీ తమ నేతను ఎన్నుకుంటే రాజ్యాంగం ప్రకారం ఆ వ్యక్తితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాలని గతేడాది అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే గవర్నర్ 163(2) తో తన విచక్షణతో ఓ కారణం పేర్కొంటూ నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదే వేసే అధికారం ఉంది. సుప్రీంకోర్టు గత తీర్పును పరిగణనలోకి తీసుకుంటే శశికళతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. దీంతో ఆయన నిర్ణయం ఎంత ఆలస్యమైతే అంత మంచిదని పన్నీర్ వర్గం భావిస్తోంది. ఎందుకంటే ఆ సమయంలో మరికొందరు ఎమ్మెల్యేలు పన్నీర్ పంచన చేరే అవకాశం ఉంది కాబట్టి. అదే సమయంలో గవర్నర్ విచక్షణాధికారంపై ఇప్పటికిప్పుడు కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉండదు. కావాలంటే నిర్ణయం తీసుకున్న తర్వాత వెళ్లే వీలుంది. అయితే గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ బద్ధంగా ఉంటే మాత్రం కోర్టులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక మరోవైపు శుక్రవారం రాత్రి కేంద్రానికి ఓ నివేదిక పంపాడని, అందులో ఈ అంశాన్నే ఆయన పేర్కొన్నాడని పలువురు చెబుతున్నారు. అయితే కాసేపటికే అదంతా ఉత్తదేనన్న సమాచారం మీడియాకు అందించి. తాము ఎలాంటి నివేదిక పంపలేదని రాజ్ భవన్ వర్గాలు, మరోవైపు కేంద్రం తమకు ఏం అందలేదని తెలిపాయి.

గురువారం పన్నీర్ సెల్వం, శశికళ ఒకరి తర్వాత ఒకరు గవర్నర్‌ను కలిసి తమ వాదన వినిపించారు. బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత గవర్నర్ ప్రకటన చేస్తారని ఊహించినా రాజ్‌భవన్ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. శుక్రవారం విద్యాసాగర్ ‌రావు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సమావేశమయ్యారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తోనూ మాట్లాడారు. ఇంకోవైపు శశికళ ఆస్తులపై వచ్చేవారం కోర్టు తీర్పు రానుండడం, చట్టసభలో ఆమెకు సభ్యత్వం లేకపోవడంతో అవకాశం ఇవ్వకూడదని గవర్నర్ భావించినట్టు మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఓపీఎస్ గూటికి ఇద్దరు ఎంపీలు...

ఇక గవర్నర్ జాప్యం పన్నీర్ సెల్వంకు బాగా కలిసి వస్తోంది. ఇప్పటికే మధుసూదన్ లాంటి కీలక నేత జాయిన్ కాగా, ఇప్పుడు మరో ఇద్దరు కీలక ఎంపీలు కూడా సెల్వం గూటిలో చేరిపోయారు. నమక్కల్ ఎంపీ పీఆర్ సుందరం, కృష్ణగిరి ఎంపీ అశోక్ కుమార్ లు పన్నీర్ సెల్వం పంచన చేరినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇది శశికళకు మరో షాక్ అనే చెప్పుకోవాలి. 

 

రాజ్ భవన్ రహస్యం

 

అమ్మ లేఖలో సీక్రెట్ లు ఏంటి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Governor Vidyasagar Rao  Sasikala Natarajan  Panneerselvam  

Other Articles