చెన్నమనేని చేతిలో చెన్నై జాతకం... పన్నీరు ఎవరికి? కన్నీరు ఎవరికి? | Governor seeks clarity from Centre on Tamil Nadu Politics.

Sasikala silence after governor meeting

Sasikala Natarajan, O panneerselvam, AIADMK General Secretary, Tamil Nadu Raj Bhavan, C Vidya Sagar Rao, CH Vidya Sagar Rao, Panneerselvam Sasikala, Tamil Nadu New Chief Minister, Panneerselvam Revolt, Tamil Nadu Politics, Sasikala Silence, Governor Decision

Sasikala stakes claim, OPS hopes for 'good things', all eyes on Raj Bhavan. AIADMK general secretary V K Sasikala met Tamil Nadu Governor C Vidyasagar Rao Friday evening and staked claim to form the government after O Panneerselvam, the caretaker Chief Minister who revolted against her, also held talks at Raj Bhavan.

శశికళ ష్... గప్ చుప్

Posted: 02/10/2017 07:47 AM IST
Sasikala silence after governor meeting

త‌మిళ‌నాడు పొలిటికల్ డ్రామా దాదాపు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే. ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు... ప‌న్నీర్ సెల్వం, శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్‌ల‌తో వేర్వేరుగా చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఇక మిగిలిన అంశం గ‌వ‌ర్న‌ర్ ఓ నిర్ణయం తీసుకోవ‌డ‌మే. పన్నీర్ సెల్వం భేటీ అనంతరం మీడియాతో మాట్లాడగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్లిపోవటం ఆసక్తికరంగా మాట్లాడింది. అయితే ఈ విషయంపై చిన్నమ్మ నోరు మెదపకపోయినా, ఆమె శిబిరంలోని నేతలు మాత్రం కొంత సమాచారం బయటపెట్టారు.

తనకు మద్దతుగా ఉన్న 130 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారట. ప్రభుత్వం ఏర్పాటు చేసే నిమిత్తం తనకు అవకాశమివ్వకపోతే, మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను రాష్ట్రపతి ముందు ప్రవేశపెట్టేందుకు తాను సిద్ధమని గవర్నర్ తో చెప్పారట. కాగా, శశికళ తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంతకాలు చేసిన పత్రాన్ని గవర్నర్ కు సమర్పించినట్లు సమాచారం. మరోవైపు ఈ సంతకాలన్నీ ఫోర్జరీ చేసినవే అని పన్నీర్ సెల్వం వర్గీయుడు మైత్రేయన్ ఆరోపించడం విదితమే.

ప‌న్నీర్ సెల్వం బ‌ల‌నిరూప‌ణ‌కు సిద్ధ‌మ‌ని గ‌వ‌ర్న‌ర్‌కు చెప్ప‌గా, శ‌శిక‌ళ కూడా అవ‌స‌ర‌మైతే బ‌ల‌నిరూప‌ణ చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టిస్తూ.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోరారు. దీంతో గవర్నర్ తీసుకోనున్న‌ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ‌వ‌ర్న‌ర్ త‌న నిర్ణ‌యాన్ని ఎప్పుడు ప్ర‌క‌టిస్తార‌న్న అంశంపై స్ప‌ష్టత లేదు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి నివేదిక కూడా ఇచ్చారన్న సమాచారం ఉంది. న్యాయ నిపుణుల సలహా తీసుకుని నేడో, రేపో దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

అయితే, గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించాక‌ ప‌న్నీర్ సెల్వంలో క‌నిపించిన సంతోషం చూస్తోంటే ఆయ‌న‌కు అనుకూలంగానే గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం ఉంటుంద‌ని ప‌లువురు అంటుంటే, మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తోన్న శ‌శిక‌ళ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని మ‌రికొంద‌రు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ ఉత్కంఠ‌కు తెర ఎలా ప‌డుతుంద‌న్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

సెల్వంకే పట్టం...

తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగాలంటూ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో 95 శాతం మంది పన్నీర్ సెల్వానికే పట్టం కట్టారు. 52 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో నెటిజన్లలో అత్యధికశాతం పన్నీర్‌కే మద్దతు తెలిపారు. ‘తమిళనాడుకు నాయకత్వం వహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగాలా?’ అన్న ప్రశ్నను ఆన్‌లైన్‌లో ఉంచగా అత్యధికులు పన్నీర్‌కే ఓటేశారు.

ఇక తనపై అసత్య ప్రచారం చేస్తే శశికళ బండారం బయట పెడతానని హెచ్చరించారు. ఆమె శశికళ కాదు కుట్రకళ అని మండిపడ్డారు. గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చెన్నైలోని తన నివాసంలో మరోసారి మాట్లాడారు. పార్టీకి తాను ద్రోహం చేశానం టూ విమర్శిస్తున్నారని, ద్రోహి ఎవరో ప్రజల కు, పార్టీ శ్రేణులకు బాగా తెలుసని అన్నారు. పార్టీ ద్రోహులను గతంలో జయలలితే గుర్తిం చారని చెప్పారు. పార్టీ, ప్రభుత్వ పదవులు కోరుకోనంటూ జయలలిత వద్ద లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరిన శశికళ అందు కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబ ట్టారు. పోయెస్‌ గార్డెన్‌లో తన బంధువులకు స్థానం కల్పించడం ద్వారా జయకు శశికళ ద్రోహం చేశారని పన్నీర్‌ విమర్శించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : O Panneerselvam  Sasikala Natarajan  Ch Vidya Sagar Rao  Tamil Nadu  Raj Bhavan  

Other Articles