పన్నిర్ సెల్వం బయటపెట్టిన లేఖలో ఏముంది..? panneerselvam issues letter to media.. what is in it..?

Panneerselvam issues letter to media what is in it

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, O.Panneerselvam, March 2012, VK Sasikala, letter, betray, vidyasagar rao, PM modi, Governor, tamil politics

In a letter to late Tamil Nadu chief minister J Jayalalithaa in March 2012, VK Sasikala wrote: I have never thought of betraying akka (elder sister) even in my wildest dreams.

పన్నిర్ సెల్వం బయటపెట్టిన లేఖలో ఏముంది..?

Posted: 02/09/2017 09:13 AM IST
Panneerselvam issues letter to media what is in it

తమిళనాట రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ మారిపోతున్నాయి. ప్రజల్లో అంతకంతకూ అసక్తిని రేపుతూ.. ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారన్న విషయమై అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతుంది. అయితే ఇన్నాళ్లు అమ్మ చేతిలో రిమోట్ గా వున్న పన్నీరు సెల్వం.. తాను రిమోట్ మాత్రమే కాదు పార్టీని కాపాడుకునే తరుణంలో.. అమ్మ ఆశయాల సాధనలో చిన్న పాటి బాంబు అని కూడా తేల్చేశారు. అమ్మ తరువాత చిన్నమ్మ అని అందరూ పాట పాడుతున్న తరుణంలో పార్టీ కోశాధికారిగా ఆయనపై వేటు వేయగానే చిన్నమ్మపై తన వ్యతిరేక వైఖరిని బయటపెట్టారు.

ఎమ్మెల్యేల మద్దతు తనకే వుందంటూ పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావు బలనిరూపణకు అవకాశమిస్తే తన బలాన్ని చూపుతానని నమ్మబలుకుతున్నారు. ఇవాళ గవర్నర్ చెన్నైకి రానున్నారని సమాచారం వుండటంతో ఇక రాజ్ భవన్ పైపు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందని అందరి దృష్టి అటు వైపే వుంది. ఈ క్రమంలో తమిళనాడు అపధర్మ ముఖ్యమంత్రి తాజాగా ఓ లేఖను బయటపెట్టారు. పార్టీలో స్టానం కానీ, రాజకీయాలలోకి రావాలన్న అశ కానీ తనకు లేదని శశికళ.. జయలలితకు రాసిన లేఖ అది. కానీ ఇప్పుడు అటు ముఖ్యమంత్రి పీఠంతో పాటు ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు పార్టీపై పట్టు బిగించారు. అసలు ఆ లేఖ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా..? ఆ లేఖలో ఏముందో తెలుసా..?

2012లో శశికళను, ఆమె బంధువులను జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు గెంటివేశారు. ఆ సమయంలో తనను క్షమించాలంటూ శశికళ జయలలితకు లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖను పన్నీర్‌ సెల్వం బయటపెట్టారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘మా బంధువులు, మిత్రులు కొంతమంది నేను పోయ్‌సగార్డెనలో కలిసి ఉంటున్న సమయంలో నా పేరుని వాడుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అన్నాడీఎంకేకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారు. అంతేకాకుండా మీకు వ్యతిరేకంగా కుట్రలు కూడా పన్నారు. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగాయి. కలలో కూడా నేను మీకు ద్రోహం తలపెట్టను. నా బంధువులు అక్రమాలకు పాల్పడ్డారు.

ఇది మన్నించరానిది. నేను మీతో ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావాలనిగానీ, పార్టీ పదవులు కట్టబెట్టాలని ఏనాడూ కోరలేదు. అసలు ప్రజా జీవితంలో ప్రవేశించాలన్న ఆశ నాకెప్పటికీ రాలేదు. నా జీవితాన్ని మీ కోసమే అర్పించాను. నన్ను క్షమించి మళ్లీ దగ్గరకు తీసుకోండి’ అని ఆ లేఖలో శశికళ పేర్కొన్నారు. కాగా తనకు తెలిసిన విషయాల్లో 10 శాతమే బయటపెట్టానని, ఇంకా 90 శాతం తనలోనే ఉన్నాయని పన్నీర్‌ చెప్పడం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles