గవర్నర్ వచ్చినా చిన్నమ్మ సీఎం కాదా? కారణం? | Governor likely in Tamil Nadu bide time over Sasikala's ascension.

In tamil nadu all eyes on raj bhavan now

Tamil Nadu Raj Bhavan, Sasikala's Ascension, Sasikala Camp, Panneerselvam Amma Death, Governor Ch Vidyasagar Rao Sasikala, Sasikala Natarajan, Governor C Vidyasagar Rao Decision, Sasikala With MLAs, Sasikala Supporters, AIADMK Legislators Vidyasagar Rao, Vidyasagar Rao Raj Bhavan,

After a meeting of the AIADMK legislators at the party office, the Sasikala camp initially herded its MLAs on three air-conditioned luxury buses to the house of Public Works Department Minister Edappadi K. Palaniswami on Greenways Road. In the evening, the legislators were taken to the Chennai airport to be flown to New Delhi. However, shortly before they could board their flights, they were asked to return after it became known that Governor Ch. Vidyasagar Rao would be returning to Chennai from Mumbai on Thursday evening.

అందరి కళ్లు ఇప్పుడు రాజ్ భవన్ పైనే...

Posted: 02/09/2017 08:18 AM IST
In tamil nadu all eyes on raj bhavan now

సంక్షోభంతో దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం రాజ్‌భవన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేల ఏకగ్రీవ మద్ధతుతో శాసనసభాపక్ష నేతగా ఎన్నికై సీఎంగా ప్రమాణ స్వీకారం కోసం ఎదురుచూస్తున్న శశికళకు గవర్నర్ షాకివ్వటం తెలిసిందే. దీంతో కంగుతిన్న చిన్నమ్మ తన మద్ధతుదారులతో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ముందు పెరేడ్ చేయించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నై వస్తున్నట్లు ముంబై రాజ్ భవన్ సమచారం అందించింది.

ఈ మధ్యాహ్నం రెండు గంటలకు తనను కలిసేందుకు శశికళ, ఆమెకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు కలిసేందుకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో గవర్నర్ తీరుపై ఢిల్లీ వెళ్లి పెద్దలకు ఫిర్యాదు చేయాలనుకున్న శశికళ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. మధ్యాహ్నాం 2 గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్ వాళ్లకి లభించింది. మరోవైపు బుధవారం నుంచి క్యాంపులు నిర్వహిస్తూ శశికళలో గుబులు పుట్టించిన పన్నీర్ సెల్వం తమిళనాడుకు ఇప్పటికీ తానే ముఖ్యమంత్రినని ప్రకటించుకున్నారు. సొంత పార్టీ పెట్టే ఆలోచన లేదని, బలనిరూపణకు తాను సిద్ధమని, తనకు మెజార్జీ మద్ధతు ఉందని కూడా చెబుతున్నాడు. అదే సమయంలో అమ్మ మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరుతున్నాడు. ఇక శశికళ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి, వారిని చేజారనీయకుండా హోటల్ కి తరలించి క్యాంపు ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే.

సీనియర్ నేతలు సహా 129 మంది ఎమ్మెల్యేల మద్ధతు ప్రస్తుతం ఆమెకు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శశికళపై గుర్రుగా ఉన్న ఆమె వ్యతిరేకులంతా ఏకతాటిపైకి వస్తూ పన్నీర్‌కు మద్దతు తెలుపుతున్నారు. సెల్వం పై సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రజలు సోషల్ మీడియాలో మద్ధతు ప్రకటిస్తున్నారు. అదే సమయంలో శశికళకు మద్ధతు ఇస్తున్న ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దయచేసి అమ్మకు ద్రోహం చేయకండని, సెల్వంకే సపోర్ట్ ఇవ్వాలంటూ పోస్టులు పెడుతున్నారు. అవసరమైతే ఆయనకు మద్దతు ఇచ్చేందుకు డీఎంకే, కాంగ్రెస్‌లు కూడా సిద్ధంగా ఉండడంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. దీంతో ఇప్పుడందరి దృష్టి గవర్నర్‌ విద్యాసాగర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపైనే ఉంది.

అయితే సుప్రీం తీర్పు, ఈసీ నోటీసుల నేపథ్యంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దంటూ మాజీ అటార్నీ జనరల్‌ సోలిసొరాబ్జీ గవర్నర్ కు సూచించాడు కూడా. దీంతో శశికళను గడువు కోరే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

రాత్రంత ఆ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే...

ఓవైపు ఎవరెటు అన్నదానిపై సంగ్ధిగ్ధం కొనసాగుతుండగానే తన వెంట తీసుకెళ్లిన ఎమ్మెల్యేలకు మాత్రం రాత్రి నిద్రపట్టని పరిస్థితి వచ్చిపడిందంట. టెన్షన్ తో ఎంత మాత్రం కాదు. చెన్నైకు 80 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురానికి తీసుకెళ్లి, అక్కడ రాత్రంతా లగ్జరీ హోటల్స్‌ల్లో బస ఏర్పాటుచేసి సకల విందులు, వినోదాలు, ఆర్భాటాలు వారికి కలగుజేశారంట. గోల్డెన్‌ బే రిసార్ట్‌ లో బీచ్‌, మసాజులు, వాటర్‌ స్కైయింగ్‌ ఇలా ఎన్నో అబ్బురపడే ఏర్పాట్లు చేశారంట. అంతేకాదు.. వారి ఫోన్లన్నింటిని పక్కకు పడేసి పూర్తిగా వినోదంగా గడిపే చర్యల్లోనే ముంచెత్తారు. అయితే, ఈ బృందంలోని ఎస్పీ షణ్ముగనాథన్‌ అనే వ్యక్తి మాత్రం బాత్‌ రూం బ్రేక్‌ అని చెప్పి వెళ్లి ఇక తిరిగి రాలేదంట.దీంతో అతడు సెల్వం వెంట వెళ్లి ఉంటాడని చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Rajbhavan  Ch Vidyasagar Rao  Sasikala Natarajan  Panneerselvam  

Other Articles