ట్రంప్ రోగం.. వాట్ ఏ సెన్సాఫ్ హ్యుమర్! | Donald Trump one big ugly and useless mass.

Uk woman names cancer tumour as donald trump

President Donald Trump, Donald Trump Cancer, Cancer tumour Donald Trump, Donald Trump Disease, Donald Trump Programs, Donald Trump Anti, Anti Donald Trump, Donald Trump Sense of Humour

A woman in the UK vowed not to lose her sense of humour after she was diagnosed with an uncommon form of cancer and named her tumour after US President Donald Trump.

ట్రంప్ రోగం అంటే ఏంటో తెలుసా?

Posted: 02/11/2017 08:33 AM IST
Uk woman names cancer tumour as donald trump

ట్రావెల్ బ్యాన్ లాంటి వివాదాస్పద నిర్ణయంతో ప్రపంచాగ్రహానికి గురవుతున్న అమెరికన్ ప్రెసిండెంట్ డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన రెండు వారాలకే తీవ్ర నిరసనలు ఎదుర్కుంటున్నాడు. ఓవైపు నిషేధం సరికాదంటూ కోర్టులన్నీ వ్యతిరేకంగా తీర్పులు వెలువరిస్తున్నా... సొంత పార్టీయే ట్రంప్ ను దించేసేందుకు తెర వెనుక యత్నాలు చేస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దేశ భక్తి పేరుతో తిక్క నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అసహనం తారాస్థాయిలో చేరిందనే నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు వివిధ రకాలుగా తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, అసభ్యపదజాలంతో పోస్టర్లు వెలవటం చూశాం. ఇక ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్లి చెడు కార్యక్రమాలకు, రోగాలకు ఆయన పేరు పెడుతూ కసి తీర్చుకుంటున్నారు. 24 ఏళ్ల ఎలీసే స్టేపుల్టన్ అనే యువతి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు హాడ్జ్‌కిన్ లొఫోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. చికిత్సలో భాగంగా కణతిని తగ్గించేందుకు ఎలీస్‌కు వైద్యులు కీమో థెరపీ చేశారు. దీంతో యువతి జుట్టు మొత్తం రాలిపోయింది. అయినా ఎలీస్ ఏమాత్రం బాధపడడం లేదు. పైగా నవ్వులు చిందిస్తోంది.

ఇక తనను అంతగా ఇబ్బందులకు గురిచేసిన ఆ కణతికి డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టింది. ట్రంప్ లాగే అది కూడా చాలా అసహ్యమైనదని, పనికిమాలినదని పేర్కొంది. ఇది మనిషిని యాతన పెడుతుందని చెబుతూ పరోక్షంగా ట్రంప్‌ను దుమ్మెత్తి పోసింది. అంతేకాదు కాన్సర్ డే సందర్భంగా ఓ బ్లాగ్ ను కూడా క్రియేట్ చేసి వైరల్ చేస్తోంది. దీంతో ఆమె సెన్సాఫ్ హ్యుమర్ కి అంతా హాట్సాఫ్ చెబుతున్నారు. మరోవైపు చర్మ వ్యాధులకు, సుఖరోగాలకు కొందరు ట్రంప్ పేరును పెట్టి పిలుస్తూ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఫ్లోరిడాలో ఓ ప్రాంతంలో డ్రైనేజీ క్లీనింగ్ కార్యక్రమానికి ట్రంప్ పేరునే వాడుకోవటం, ట్రంప్-కంపు పేరిట కథనం మీడియాలో ప్రసారం అవుతుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  UK Woman  Cancer Tumour  

Other Articles