Tapping | Telangana | AP | Central Govt | Telecom, Chandrababu Naidu, Delhi, KCR, Service providers

Is the central govt conform the phone tapping

Tapping, Telangana, AP, Central Govt, Telecom, Chandrababu Naidu, Delhi, KCR, Service providers

Is The Central govt conform the phone tapping. The central govt wrote letters to the ap and telangana govts on tapping issue. In the ap letter central govt wrote the the service providers took actions by the another state orders.

ట్యాపింగ్ ను ధృవీకరించిన కేంద్రం..!

Posted: 07/18/2015 08:30 AM IST
Is the central govt conform the phone tapping

తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న ట్యాపింగ్ వివాదం కీలక మలుపులు తిరుగుతోంది. ఏపి ప్రభుత్వం కోరిన ఫోన్ నెంబర్ల డాటాను ఇవ్వడానికి సర్వీస్ ప్రొవైడర్లు నిరాకరించడంతో కేసులు నమోదు చెయ్యాలని కోర్టు ఆదేశించింది. దాంతో కేసు ఎలాంటి కీలక మలుపులు తిరుగుతుందా అని సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే వివాదం ఇలా సాగుతుండగా మరోపక్క కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య మరింత అగాధాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ట్యాపింగ్ వివాదం మీద ఇప్పటికే ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పెద్దన్న పాత్ర వహించాల్సిన కేంద్రం.. రెండు రాష్ట్రాల మధ్య మరింత అగ్గి రాజుకునేలా వ్యవహరిస్తోందని తెలుస్తోంది.
 
Also Read:  కాల్ డేటా ఇవ్వని సర్వీసు సంస్థలపై కేసులు నమోదు చేయండి
Also Read:  బాబూ.. ట్యాపింగ్ టెక్నాలజీ బేరం.ఎందుకు.?

ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారికంగానే సర్వీస్‌ ప్రొవైడర్లు చర్యలు తీసుకున్నారంటూ ఏపీ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది. ఈ విషయంలో సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అదే సమయంలో ప్రభుత్వాలు సంయమనంతో చట్టాలకు లోబడి వ్యవహరించాలి అని సూచిస్తూ తెలంగాణకు మరో లేఖ పంపింది ఈ వింత వైఖరిపై ఇరు రాష్ట్రాల అధికారులూ విస్తుపోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుసహా అనేక మంది ప్రముఖుల సెల్‌ఫోన్లను ట్యాప్‌ చేశారనే ఆరోపణలపై ఏపీలో అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని స్పష్టమైన ఆధారాలను ఏపీ సర్కారు సేకరించి కేంద్ర టెలీకమ్యూనికేషన్‌ శాఖకు, హోంశాఖకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎవరి ఆదేశాల మేరకు తమ ఫోన్లు ట్యాప్‌ చేశారో చెప్పాలంటూ సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది.

Also Read:  ఫోన్ ట్యాపింగ్ కేసు ముందకా..? వెనక్కా..?

ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి తాము రాసిన లేఖలనుకానీ, కాల్‌డేటా కానీ ఎవ్వరికీ ఇవ్వొద్దని తెలంగాణ సర్కార్‌ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించినట్లు కాదని వివరాలు బయటపెడితే ప్రాసిక్యూట్‌ చేస్తామని కూడా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సర్వీస్‌ ప్రొవైడర్లు కేంద్రాన్ని ఆశ్రయించారని తెలుస్తోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం వివరాలు అడుగుతోంది... వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని మరో ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కాబట్టి మీరే రక్షించాలంటూ టెలికాం శాఖను కోరినట్లు సమాచారం. దీంతో టెలికం శాఖ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు, సర్వీస్‌ ప్రొవైడర్లకు కూడా తగిన సూచనలతో ఒక లేఖ రాసింది. ఇంటర్‌సెప్ట్‌ అంటే ట్యాపింగ్) డేటా సర్వీస్‌ ప్రొవైడర్ల వద్ద లేదని, అది నిఘావర్గాల అంటే బహుశా తెలంగాణ వద్ద మాత్రమే ఉంది అని ఈ లేఖలో తెలిపింది.

Also Read:  ఫోన్ ట్యాపింగ్ అంశంలో డీజి అనురాధపై బదిలీ వేటు

మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వీస్‌ ప్రొవైడర్లు చర్యలు తీసుకున్నారంటూ పరోక్షంగా ట్యాపింగ్ ను కేంద్రం ధ్రువీకరించడం విశేషం. అయితే ఏపి ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. తమకు బాసటగా నిలుస్తుందనుకున్న కేంద్ర ఇలా రెండు నాలుక ధోరణి అవలంభించడం ఏంటని ఏపి అధికారులు చర్చించుకుంటున్నారట. అయితే మొత్తం వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు పుష్కరాలు ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు కూడా సిద్దంగా ఉన్నారని అధికార వర్గాలు అనుకుంటున్నాయి.

By Abhinavachary

Also Read:  ట్యాపింగ్ పై మొదటిసారి పేర్లు వెల్లడించిన లోకేష్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tapping  Telangana  AP  Central Govt  Telecom  Chandrababu Naidu  Delhi  KCR  Service providers  

Other Articles