Ramadan | Pranabh Mukharjee | Chandrababu Naidu | KCR, Narasimhan

Today muslims celebrating ramadan

Ramadan, Pranabh Mukharjee, Chandrababu Naidu, KCR, Narasimhan

Today muslims celebrating Ramadan. President, Modi, Governor and Telangana cm kcr, Ap cm Chandrababu naidu wish the muslims for ramadan festival.

నేడే రంజాన్.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

Posted: 07/18/2015 08:28 AM IST
Today muslims celebrating ramadan

రంజాన్‌ ఈదుల్‌ ఫితర్ ను ముస్లింలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్‌ పండగను నేడు జరుపుకోవాలని రువాయత్‌-యే-హిలాల్‌ కమిటీ ప్రకటించింది. నెలరోజుల పాటు కఠోర దీక్షతో ఉపవాసాలు ఉన్న ముస్లింలు శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనం ఇవ్వడంతో దీక్షను ముగించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి నేడు రంజాన్‌ పండగను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదులు, ఈద్గాల్లో ఈ  ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చెయ్యనున్నారు.

ప్రత్యేక ప్రార్థనల కోసం రాష్ట్రంలోని ఈద్గాలన్నింటినీ శోభాయమానంగా అలంకరించారు. అన్నిచోట్లా రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేసి రాత్రి పొద్దుపోయే వరకు ట్యాంకర్ల ద్వారా పాలను సరఫరా చేసింది. ఈద్ ప్రత్యేక ప్రార్థనల కోసం రాష్ట్రంలోని ఈద్గాల వద్ద అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముస్లింలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

modi-greeting-ramadan

రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో పవిత్ర ఉపవాసదీక్షలు ఆచరించిన ముస్లింలు ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకోవాలని సీఎం కోరారు. గంగాజమున తెహజీబ్ కలిగిన తెలంగాణ రాష్ట్రంలో రంజాన్ మాసం మతసామరస్యాన్ని, పరమత సహనాన్ని పెంచే విధంగా సాగిందని ముఖ్యమంత్రి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramadan  Pranabh Mukharjee  Chandrababu Naidu  KCR  Narasimhan  

Other Articles