Yasin Bhathkal | Terrorists | Dilsukhnagar Bombblast | Octopus, Charlapalli jail

Terrorist sleeper cells plans to escape the terrorist yasin bhathkal from charlapalli jail

Yasin Bhathkal, Terrorists, Dilsukhnagar Bombblast, Octopus, Charlapalli jail

Terrorist sleeper cells plans to escape the Terrorist Yasin Bhathkal from Charlapalli Jail. Intelligence Beauro gor information about the Yasin Bhathkal and arrange the Octopus security at Charlapalli jail.

యాసిన్ భత్కల్ పరారీకి ప్లాన్.. చర్లపల్లి జైల్ వద్ద ఆక్టోపస్ భద్రత

Posted: 07/18/2015 09:00 AM IST
Terrorist sleeper cells plans to escape the terrorist yasin bhathkal from charlapalli jail

ధిల్ సుఖ్ నగర్ పేలుళ్లకు కారణమైన ఉగ్రవాది యాసి న్ భత్కల్‌ను జైలు నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని సమాచారం. ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ఇందుకు కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో  గుర్తించింది. చర్లపల్లి జైల్లో ఉన్న అతన్ని తప్పించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు వేస్తున్నట్లు ఐబీ నుంచి జైలు అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ హెచ్చరికలతో ఒక ప్లాటూన్ ఆక్టోపస్ బలగాలతో జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యాసిన్ భత్కల్‌తోపాటు చర్లపల్లి జైలులో 13 మంది ఉగ్రవాదులున్నారు. వీరందర్నీ హై సెక్యూరిటీ జోన్‌లో భారీ భద్రత మధ్య ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు.

Also Read: గ్రవాది యాసిన్ భత్కల్ చేతిలో గులాబీ పువ్వు

జైలు నుంచి తప్పించుకోబోతున్నట్లు జైల్లోని ఫోన్ ద్వారానే తన కుటుంబసభ్యులకు భత్కల్ చెప్పినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మధ్య కాలంలో అతడు చేసిన 27 ఫోన్స్ కాల్స్ రికార్డ్‌ను అధికారులు పరిశీలించారు. భత్కల్‌ను తప్పించేందుకు స్లీపర్ సెల్స్ ప్రణాళికలు వేస్తున్నట్లు గుర్తించారు. గత 15 రోజుల్లో మూడుసార్లు రంగారెడ్డి కోర్టు లో ఉన్న ఎన్‌ఐఏ కోర్టులో హాజరు పరిచిన సమయంలో భత్కల్ హల్‌చల్ సృష్టించాడు. ఒకసారి భద్రత పేరుతో ఒక పేపర్‌ను కోర్టు ఆవరణలో విడిచిపెట్టాడు. రెండోసారి రోజా పూవును చూపించి కోర్టు ఆవరణలో పోలీసులను పరుగులు పెట్టించాడు. మూడోసారి ఒక నోట్‌బుక్‌ను చూపిస్తూ హల్‌చల్ చేశాడు. చర్లపల్లి జైలు అధికారులపై కూడా ఫిర్యాదు చేశాడు.

Also Read:  యాసిన్ భత్కల్ పరారీకి కుట్ర

యాసిన్ భత్కల్ ఉంటున్న బ్యారక్ వద్ద సీసీ కెమెరాలు, సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ కూడా దాఖ లు చేశాడు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఆక్టోపస్ బలగాలు రంగంలోకి దిగడంతో యాసిన్ భత్కల్ పారిపోయేందుకు చేస్తున్న కుట్ర వాస్తవమేనన్న అనుమానాలు వ్యక్తమతున్నాయి. అయితే యాసిన్ భత్కల్ కోర్టుకు వస్తున్న సమయంలో వింతగా ప్రవర్తిస్తున్నారు. ఒకసారి గులాబి పువ్వుతో మరోసారి పుస్తకంతో కనిపించారు. అయితే యాసిన్ భత్కల్ ను తప్పించేందుకు ఉగ్రవాద సంస్థలకు అవి సిగ్నల్స్ అయి ఉండవచ్చు అని అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

By Abhinavachary

Also Read:  దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల యాసిన్ భత్కల్ అరెస్టు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yasin Bhathkal  Terrorists  Dilsukhnagar Bombblast  Octopus  Charlapalli jail  

Other Articles