Jammu kashmir | Srinagar | ISIS | Modi | India | Pakistan | Flags

Isis and pakistan flags waved in jammu kashmir

Jammu kashmir, Srinagar, ISIS, Modi, India, Pakistan, Flags

ISIS and Pakistan flags waved in Jammu kashmir On a day when Prime Minister Narendra Modi is visiting Jammu and Kashmir, flags of terror group ISIS, Pakistan and Lashkar-e-Toiba were waved after the Juma-tul-Wida namaz in Nohwatta area

జమ్ముకాశ్మీర్ లో ఐఎస్ఐఎస్.. పాక్ జెండాలు

Posted: 07/17/2015 04:41 PM IST
Isis and pakistan flags waved in jammu kashmir

పాకిస్థాన్ భారత్ కు పక్కలో బల్లెంలా కాదు.. ఏకంగా పక్కలో కొరివిలా మారుతోంది. జమ్ము కాశ్మీర్ లోని వేర్పాటువాదులను ప్రోత్సహించేలా పాకిస్థాన్ చేస్తున్న కార్యక్రమాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఓ పక్క రక్తపాతంతో వణికిస్తున్న ఐఎస్ఐఎస్ భారత్ మీదకు దూసుకువస్తోందని అని గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే భారత్ కు వ్యతిరేకంగా అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలు నిర్వహించే వేర్పాటువాదులు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కలిస్తే ఎలా ఉంటుంది..? ఊహించడానికి కాస్త వింతగా ఉన్నా కానీ అదే జరుగతోంది. భారత్ లోకి చొచ్చుకువచ్చేందుకు ఐఎస్ఐఎస్ అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోంది. అది అందుకు పాకిస్థాన్ కూడా సహాయం చేస్తోంది.

Also Read:  ఐఎస్ఐఎస్ టార్గెట్ నరేంద్ర మోదీ..!
Also Read:  కాశ్మీర్ లో మంటలు.. దేశం మొత్తం సెగలు

జమ్ముకాశ్మీర్‌లో మరోసారి వేర్పాటువాదులు బరితెగించారు. పాక్‌ జెండాలతో పాటు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ జెండాలను ప్రదర్శించారు. శుక్రవారం ప్రార్థనలు ముగియగానే భారీ సంఖ్యలతో వీధుల్లోకి వచ్చిన వేర్పాటువాదులు పాక్‌, ఐసిస్‌ జెండాలతో ర్యాలీ వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వాళ్లను అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇళ్లపైకి చేరుకొని మరీ వేర్పాటువాదులు జెండాలను ప్రదర్శించారు. దాంతో జమ్ము కాశ్మీర్ లోకి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదలు వచ్చారా.? భారత్ మీద దాడికి అన్ని సిద్దంగా చేశారా..? వారి దాడి ఎలా ఉండబోతోంది..? ఇలా సవాలక్ష ప్రశ్నలు కానీ ప్రస్తుతానికి ఒక్కదానికి కూడా సమాధానం లేదు.

Also Read:  పాక్ నీతులు....వెనక గోతులు

ప్రధాని మోడీ జమ్మూ పర్యటన రోజున సరిహద్దులో పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడితే..శ్రీనర్‌లో వేర్పాటువాదులు బరితెగించారు. మరోసారి పాక్‌, ఐసిస్‌ జెండాలతో ర్యాలీ నిర్వహించబోయారు. పోలీసులు అడ్డుకోవటంతో వాళ్లపై రాళ్లు విసిరారు. వేర్పాటువాదల ఓవరాక్షన్‌తో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో శ్రీనగర్‌ వీధులు ఉద్రిక్తంగా మారాయి. కాశ్మీర్ వేర్పాటువాదులు ప్రతిసారి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ కు చేతులు కలుపుతుండటం.. ఉగ్రవాదానికి అవకాశం కల్పిస్తోంది. తాజాగా దీన్నే అవకాశంగా తీసుకొని జమ్ము కాశ్మీర్ లో ఐఎస్ఐఎస్ పాగా వేసేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

By Abhinavachary

Also Read:  వేర్పాటువాదులపై మండిపడ్డ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu kashmir  Srinagar  ISIS  Modi  India  Pakistan  Flags  

Other Articles