Pak media on indian media jammu kashmir pak govt

pak media, the daily times, indian media, indian media pak tour, media on jammu

pak media on indian media jammu kashmir pak govt : pak media attack on indian media. An indian media enlarge the gaps bitween india and pak.

పాక్ నీతులు....వెనక గోతులు

Posted: 02/07/2015 11:15 AM IST
Pak media on indian media jammu kashmir pak govt

పాకిస్థాన్ మీడియా భారత్, పాక్ ల మధ్య సయోద్య కుదర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రకటించింది.  పాక్ లో అధికారంలో ఉన్న కొన్ని ప్రభుత్వాలు తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల పాకిస్థాన్ కు చెడ్డ పేరువస్తోందని  ఆవేదన వ్యక్తం చేసింది. జమ్ము కాశ్మీర్ భూభాగానికి సంబందించిన అంశం ఒక్కటే కీలకంగా భావిస్తున్నారని, కానీ అంతకన్నా ముఖ్యమైన సమస్యలు చాలానే ఉన్నాయని విశ్లేషించింది. గతంలో పాక్ పర్యటనకు వెళ్లిన మీడియా బృందంపై కూడా అక్కడి మీడియా ఘాటుగానే స్పందించింది. వీలైనంత వరకు ఘర్షణలు తగ్గించే విధంగా మీడియాలో కథనాలు రావాలే తప్ప, రెండు దేశాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా వార్తలు రాయవద్దని హితవు పలికింది. పైగా భారత్ , పాక్ చర్చలపై మీడియా విశ్లేషణ మరిన్ని మనస్పర్థలు పెంచేలా ఉంటున్నాయని మన మీడియా మిత్రులకు బాగానే క్లాస్ తీసుకుంది.  

తాజాగా ది డైలీ టైమ్స్ పత్రిక తన సంపాదకీయంలో భారత్, పాక్ వైఖరిపై పాక్ అనుచిత నిర్ణయాలను పేర్కొంది. మీడియా రెండు దేశాల  మధ్య వారధిగా ఉండాలని ఆకాంక్షించింది. కానీ చివర్లో మాత్రం కాశ్మీర్ పాకిస్థాన్ సంస్రృతి సంప్రదాయాల్లో ఒక భాగమని పేర్కొంది. ఇన్ని చిలుక పలుకులు పలిచి చివర్లో మాత్రం తన వాదనను వినిపించింది. దీనిపై భారత్ లో మీడియా విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. పాక్ మీడియా కథనాలు మాత్రం చర్చనీయాంశాలుగా మారాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : relations pak & india  an indian media  pak media  

Other Articles