ISIS | Modi | Target | Attack | Home ministry, Intelligence

Isis targets indian pm narendra modi

ISIS, Modi, Target, Attack, Home ministry, Intelligence

ISIS targets indian PM Narendra modi. Central home ministry got some information about the ISIS. The ISIS likely to move LOC and after that India is the target.

ఐఎస్ఐఎస్ టార్గెట్ నరేంద్ర మోదీ..!

Posted: 07/05/2015 10:24 AM IST
Isis targets indian pm narendra modi

ప్రధాని నరేంద్రమోదీకి మత ఛాందసవాదుల నుంచి ముప్పు ఉందంటూ వస్తున్న వార్తలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం ఖండించింది. ఇవి నిరాధార వార్తలని, ప్రధానికి ముప్పు ఉందన్న నివేదికేదీ తమకు రాలేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రధాని భద్రతను అంతకుముందుకన్నా పెంచిందేమీలేదని పేర్కొన్నాయి. ప్రధాని మోదీ ఇటీవల ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ఛాందసవాదుల నుంచి ఆయనకు ముప్పు ఏర్పడిందంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో హోంశాఖ వర్గాలు స్పందించాయి. అయితే ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మోదీని టార్గెట్ చేసిందని సమాచారం. ఇప్పటికే ప్పపంచంలో రక్తపాతాన్ని సృష్టిస్తున్న ఈ ఉగ్రవాద సంస్థ మోదీని  టార్గెట్ గా చెయ్యడం కలకలం కలిగిస్తోంది.

ఇస్లామిక్ దేశాల్లో ఇప్పటికే కాలుమోపిన ఐఎస్ఐఎస్..పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత భద్రతా దళాలిప్పుడు...పీఓకేపై ఓకన్నేసి ఉంచాయి. శ్రీనగర్లో పాకస్థాన్ జెండా రెపరెపలు, భారత్ గడ్డపై ఇస్లామిక్ స్టేట్ ఫ్లాగ్స్... ఈ రెండు ఘటనలు చాలు...జమ్మూకాశ్మీర్లో పాకిస్థాన్ ఆగడాలు ఎంతగా శ్రుతిమించాయో చెప్పడానికి! ఇప్పడిక పరిస్తితి చేయి దాటిపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థ...ఇస్లామిక్ స్టేట్ పాగా వేసేందుకు సిద్ధమైంది. భారత భద్రతా దళాల అధికారి  దీన్నినిర్ధారిస్తున్నారు. పీఓకే...పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్....సహజంగానే, పీఓకే చాలా సున్నితమైంది. పాకిస్థాన్,భారత్ల మధ్య దశాబ్దాలుగా రగులుతున్న వివాదమిది. జమ్మూకాశ్మీర్లో...హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన కొనసాగుతోంది. 200నుంచి రెండొందల పాతికమంది ఐఎస్ మిలిటెంట్లు ఇప్పటికే పీఓకేలో కాలుమోపినట్లు భద్రతాదళాలు గుర్తించాయి. పీఓకేలో అడుగుపెట్టి...అక్కడి నుంచి భారత్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ గుర్తించింది. సరిహద్దు ప్రాంతంలో టెర్రిరిస్టుల శిక్షణా శిబిరాలు, సమావేశాలు సాగుతున్నాయని కూడా వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఇంతవరకూ...తాలిబన్లతో పాటు చిన్నచిన్న ఉగ్రవాద సంస్థలే కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. పాకిస్థాన్ సైన్యం కూడా వారికి పూర్తి సహకారం అందిస్తుండడంతో ఆ సంస్థల ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇప్పుడిక...ఇస్లామిక్ స్టేట్, పీఓకేలో కాలుమోపిందన్న వార్తలతో భారత హోమ్ మంత్రిత్వశాఖ అప్రమత్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Modi  Target  Attack  Home ministry  Intelligence  

Other Articles