sayyad ali sha gilani | Jammu | Kashmir | Flag | Pakistan

Sayyad ali sha gilani support the pakistan and handed pak flag

sayyad ali sha gilani, jammu, kashmir, rajnathsingh, pakistan, india,

sayyad ali sha gilani support the pakistan and handed pak flag. In jammu kashmir sayyad ali sha gilani commence a rally to support pak. The central home minister rajnath singh oppose the action.

వేర్పాటువాదులపై మండిపడ్డ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్

Posted: 04/17/2015 08:00 AM IST
Sayyad ali sha gilani support the pakistan and handed pak flag

జమ్ము కాశ్మీర్ లో వేర్పాటువాదులు మరీ రెచ్చిపోతున్నారు. భారత్ భూభాగంలొ ఉంటూ పాకిస్థాన్ జెండాను చేతపట్టి, పాక్ కు అనుకూలంగా నినాదాలు చేసి సయ్యద్ అలీ షా గిలానీ వివాదానికి తెర తీశారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్ గడ్డపై పాకిస్తాన్ జిందాబాద్ అంటే సహించేది లేదని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. జాతి వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీమహ్మద్ సరుూద్‌కు ఆయన సూచించారు. శ్రీనగర్ శివార్లలో జరిగిన ఓ ర్యాలీలో వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ భారత్ వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పాకిస్తాన్ జెండా ప్రదర్శించడంపై రాజ్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఉదంతంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన వివరాలు తెలుసుకున్నారు. జాతి భద్రత, ప్రయోజనాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని ముఫ్తీకి రాజ్‌నాథ్ స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి కూడా గిలానీ ర్యాలీ వ్యవహారం, ఏం జరిగింది పూర్తి వివరాలు హోమ్‌మంత్రికి వివరించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. జాతి వ్యతిరేక శక్తులను ఉపేక్షించేది లేదని, అలాంటి సంస్థలు, వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాలని రాజ్‌నాథ్ ఆదేశించారు.

దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.  వేర్పాటువాద కార్యకలాపాలు, వాటిని ప్రోత్సహిస్తున్న శక్తులను కట్టడి చేయండి అని ఆయన చెప్పారు. ఐదేళ్ల విరామం తరువాత వేర్పాటువాద నాయకుడు గిలానీ ర్యాలీకి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత నెలలో జైలు నుంచి విడుదలైన మసరాత్ అలం, గిలానీ మద్దతుదారులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. ర్యాలీలో పాకిస్తాన్ జెండాను ఊపడమే కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. 2010 తరువాత గిలానీ బహిరంగంగా వచ్చి పాల్గొన్న ర్యాలీ ఇది. అప్పట్లో అతడి నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో 100 మంది యువకులు మృతి చెందారు. వారంపాటు రాష్ట్రాన్ని కుదిపేసిన హింసాత్మక ఘటనల్లో ఉగ్రవాది అలం కీలక భూమిక పోషించాడు. ఇటీవల అతడిని పిడిడి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీనగర్ విమానాశ్రయం నుంచి హైదర్‌పొరలోని గిలానీ నివాసం వరకూ పెద్ద ప్రదర్శన చేశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sayyad ali sha gilani  jammu  kashmir  rajnathsingh  pakistan  india  

Other Articles