Contraversy on jammukashmir cms statements

pdp, mufti, jammukashmir, pakistan, afsal guru, elections, modi, ndagovt

mufti statements rising new contraversys in the nation. mufti mohmad statemented that pakistan and terrorists are coperate to elections in jammu kashmir. afsal guru who attacked on indian parliament, pdp demand to handover his belonging to his family.

కాశ్మీర్ లో మంటలు.. దేశం మొత్తం సెగలు

Posted: 03/03/2015 09:32 AM IST
Contraversy on jammukashmir cms statements

వేర్పాటువాదులు, పాకిస్తాన్‌ వల్లే ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని అన్న ముఫ్తీ వ్యాఖ్యలతో దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నో చర్చోపచర్చల తర్వాత జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ముఫ్తీ మహమ్మద్‌ సయ్యద్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని గంటలైనా గడవక ముందే సీఎం వివాదాలకు తెరలేపారు. వేర్పాటువాదులు, పాకిస్తాన్‌ వల్లే జమ్మూకాశ్మీర్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరగాయని వ్యాఖ్యాలు దేశంలో పెద్ద దుమారమే రేపారు. సీఎం ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ వ్యాఖ్యలు పార్లమెంట్‌ను ఓ కుదుపు కుదిపేశాయి. ముఫ్తీ వ్యాఖ్యలతో ఇరుకున పడ్డ మోడీ సర్కారు... వాటితో తమకేం సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంది. ఇక ఈ అంశంపై దేశవ్యాప్తంగా రచ్చ రచ్చ జరగుతుండగానే... పీడీపీ నేతలు మరో వివాదానికి తెరలేపారు. అప్జల్ గురు అస్తికలు అప్పగించాలని ఆ పార్టీ నేతలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం... కమలనాథులకు పుండుపై కారం పోసినట్లయింది.

పార్లమెంట్‌ దాడుల కేసులోఆప్జల్‌గురు కీలక నిందితుడు. ఈ కేసులో ఆయనకు ఉరిశిక్ష ఖరారైంది. యుపీఏ ప్రభుత్వ హయాంలో 2013 సంవత్సరం ఢిల్లీలోని తీహార్‌ జైలులో శిక్ష అమలు చేశారు. ఐతే ఆప్జల్‌ గురును ఉరి తీసి వుండాల్సింది కాదని... క్షమాబిక్ష పెట్టాల్సిందని.. పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ లోలోనే అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. పీడీపీ నేతల వ్యవహారం బీజేపీకి అంతుబట్టని వ్యవహారంగా మారింది. ఆప్జల్ గురు విషయంలో పీడీపీ వాదన సరైంది కాదని విమర్శిస్తూనే... భవిష్యత్‌ వ్యూహరచనలో మునిగిపోయారు. మొత్తానికి తాజా పరిణామాల నేపథ్యంలో వీరి సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగుతుందా? మూణాళ్ల ముచ్చటే అవుతుందా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మొత్తానికి ముఫ్తీ ద్వయం చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాలకు తెరతీశాయి. ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. మరి పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pdp  mufti  jammukashmir  pakistan  afsal guru  elections  modi  ndagovt  

Other Articles