Simple Home Tips To Lose Body Wight | Remedies For Weight | Weight Lose Tips

Simple home tips to lose body wight remedies

lose weight tips, weight lose tips, tips to lose weight, home remedies, best tips to lose weight, body massage, simple remedies to lose weight

Simple Home Tips To Lose Body Wight Remedies : Experts Giving Some Tips To Lose Body Weight As Soon As Possible.

బరువు తగ్గాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

Posted: 09/11/2015 03:58 PM IST
Simple home tips to lose body wight remedies

ప్రస్తుతరోజుల్లో చాలామంది ఊబకాయం సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరంతరాయంగా కూర్చొని పనిచేయడం కారణంగా శరీర బరువు క్రమక్రమంగా పెరుగుతూ వుంటుంది. అలాంటప్పుడు బరువును తగ్గించాలంటే నిత్యం వ్యాయాయం చేయడంతోపాటు కొన్ని మందులు తీసుకోవాల్సి వుంటుంది. అయితే.. బరువు తగ్గాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటిని రెగ్యులర్ పాటిస్తే.. బరువు తగ్గడంతో ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నారు. మరి.. అవేంటో తెలుసుకుందామా..

ఆహారం తీసుకోవడానికి గంటముందు ఒక టమోటాను తింటే బరువును నియంత్రించుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎందుకంటే.. టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి తదితర పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి.. శరీరంలో వుండే వ్యర్థాలను తొలగించడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. అలాగే.. కొలెస్టిరాల్ శాతాన్ని తగ్గిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే.. తరచూ టమోటాలు తీసుకోవడం వల్ల ఎక్కు ఆకలి అవకుండా వుంటుంది. అందుకే.. రెగ్యులర్ వంటకాల్లో టమోటాలు వేసుకుంటే ఎంతో శ్రేయస్కరం. అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది.

మరిన్ని చిట్కాలు :

* ఉదయం నిద్రలేవగానే, ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఈ హెల్దీ చిట్కా ద్వారా శరీరాన్ని మనస్సును తాజాగా ఉంచుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు కలుగుతాయి.
* ఒక గ్లాసు లెమన్ జ్యూస్‌ను తీసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్‌ను ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల, చాలా త్వరగా బరువు తగ్గుతారు. అలాగే ప్రతి రోజూ ఉదయం, ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి.
* ఉదయం నడక లేదా చిన్న పాటి జాగింగ్ వల్ల త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. ఇది శరీరం ఫిట్‌గా ఉండటానికి, వ్యాధినిరోధకతను పెంచుతుంది.
* రోజంతా ఆకలి అనిపించకూడదనుకుంటే, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా ఎక్కువగా తీసుకోవాలి. అందులోనూ అధిక ప్రోటీనులున్న ఎగ్, బ్రౌన్ బ్రెడ్ వంటి ఆహారాలను రెగ్యులర్‌గా తీసుకోవాలి.
* మద్యాహ్నాం భోజనానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. భోజనంలో తీసుకొనే పదార్థాల్లో ప్రోటీన్స్, మినిరల్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి.
* వేగంగా బరువు తగ్గాలనుకొనేవారు, ఎక్కువ విశ్రాంతి తీసుకోకూడదు. చిన్నపాటి విరామాలు తీసుకుంటే సరిపోతుంది.
* ఆహారంలో విటమిన్స్ మాత్రమే కాకుండా, శరీరానికి మరో ప్రధానమైన విటిమిన్ డి చాలా అవసరం అవుతుంది. ఈ విటమిన్ ఉదయం సూర్యరశ్మి వల్ల పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lose weight tips  home remedies to lose weight  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more