Rice or chapati What is more Healthy? | అన్నం-చపాతీ.. ఏది ఎక్కువ ఆరోగ్యం?

Annam chapathi good for health

Rice, Chapati, Rice Chapati, Rice Chapati, Rice vs Chapati

Nowadays people think that rice or chapati is sole reason for obesity. This article will make sure that both are important if taken correctly. Rice vs chapati (wheat roti) is a very common and controversial topic; both these grains being the staple food in many parts of the globe. People blame rice for causing obesity, diabetes and related conditions.

అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

Posted: 02/06/2018 06:47 PM IST
Annam chapathi good for health

అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం. కానీ, భారతీయులు ఎక్కువగా తీసుకునే ఆహారంలో బియ్యం లేదా గోధుమలే ప్రాధాన్యం ఉన్నవి. అలాంటప్పుడు అన్నం.. చపాతీ ఈ రెండింటిలో ఏది మంచిది? అన్న విషయంపై సందేహాలు కలగటం సాధారణం. డైటీషియన్లు చెబుతున్న దాని ప్రకారం ఏది ఉత్తమం? అన్న విషయాన్ని ఓసారి చూద్దాం.

రోటీ

  • గోధుమ పిండితో నూనె లేకుండా చేసుకునే రోటీలు, బియ్యం మధ్య తేడా చూస్తే... వైట్ రైస్ కంటే గోధుమ పిండిలో ప్రొటీన్ నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. 
  • అలాగే, మూడు రెట్లు ఎక్కువగా కార్బొహైడ్రేట్లు, 10 రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. పైగా రైస్ కంటే గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా సహకరిస్తుంది. 
  • రైస్ కంటే రోటీలో ఆరు రెట్లు అధికంగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలిని తెలియనీయదు. 
  • బియ్యంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహులకు ఇదే ఇబ్బందికరమైన అంశం. అదే గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి.

రైస్

  • వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో ఫైబర్, మైక్రో న్యూట్రియెంట్లు ఎక్కువ. తక్కువ తిన్నా కడుపునిండినట్టు భావన ఉండాలని కోరుకునే వారికి బ్రౌన్ రైస్ తగినవి. 
  • పోషక విలువల పరంగా చూస్తే బ్రౌన్, వైట్ రైస్ లో పెద్దగా తేడా ఏమీ లేదు. 
  • షుగర్ వ్యాధి ఉన్నవారు, గుండె జబ్బులున్నవారికి ముమ్మాటికీ రోటీలే నయం. ఎందుకుంటే, గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న పదార్థాలతో రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగిపోతుంది. కనుక గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న రోటీల వంటి వాటిని తీసుకోవడం మంచిది. 
  • అలాగే బరువు పెరగకుండా ఉండాలన్నా రోటీలే తగినవి. సన్నగా ఉండి కొంచెం ఒళ్లు చేయాలని అనుకునేవారు రైస్ నిశ్చింతగా తీసుకోవచ్చు. 
  • ఒకవేళ గోధుమ పిండి అంటే నచ్చనివారు, బియ్యాన్నిఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది మోతాదుల్లో తీసుకోవడం వల్ల నష్టం ఉండదు.

మిగిలిన వారు...

రైస్, రోటీ రెండూ కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రోజుకు రెండు సార్లే భోజనం తీసుకోవడం... భోజనంలో ఒక రోటీని భాగం చేసుకోవడం, ప్రొటీన్స్ తో పాటు కాయగూరలు, ఆకు కూరలను ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. తదుపరి తీసుకునే ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా లభించేలా చూసుకోండి. దానివల్ల సమతులాహారం లభించి ఆరోగ్యంగా ఉంటారు.

ఆరోగ్యంగా ఉండండి.. ఆనందదాయకమైన జీవితం గడపండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rice  Chapati  అన్నం  చపాతీ  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more

  • Smart phone lock tips

    స్మార్ట్ ఫోన్ కి సెక్యూరిటీ పెట్టాల్సిందే!

    Oct 11 | స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో కనిపించేందే. తక్కువ ధరలో అడ్వాన్స్ అప్లికేషన్లతో లోకల్ బ్రాండ్లు కూడా ఫోన్లు మార్కెట్ లోకి దించేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోనూ దాదాపుగా 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్... Read more

Today on Telugu Wishesh