Postpartum Women Should Avoid Some Non-Healthy Foods | Health Tips | Healthy Food Items

After postpartum women should avoid some non healthy foods health tips

postpartum women, postpartum women health tips, pregnant women health tips, healthy food items, postpartum women healthy foods, postpartum women non healthy foods, non healthy foods, health tips telugu

After Postpartum Women Should Avoid Some Non-Healthy Foods Health Tips : Postpartum Women Should Avoid Some Non-Healthy Foods which cause unhealthy to child.

బాలింతలు తినకూడదని హానికరమైన ఫుడ్స్

Posted: 07/14/2015 10:12 AM IST
After postpartum women should avoid some non healthy foods health tips

ప్రసవించిన తర్వాత తల్లిలో ఆరోగ్యపరంగా కొన్ని ఆందోళనలు వుంటాయి. పైగా.. అప్పుడే పుట్టిన పిల్లలకు పాలు పెట్టాల్సి వుంటుంది కాబట్టి.. తీసుకునే ఆహారం శిశువుకు పాలద్వారా పోషణ అందించబడుతుంది. అలాంటప్పుడు బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే.. బాలింతలు కొన్ని ఆహారాల నుంచి దూరంగా వుండాలి. అలాకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే.. శిశువు పొట్టలో అసౌకర్యం కలిగి, వారిలో మానసిక స్థితిని చికాకుపరుస్తుందని నిపుణులు కనుగొన్నారు. ఇంతకీ ఆ హానికర ఆహారాలేంటో తెలుసుకుందామా..

* కెఫిన్ : గర్భదారణ సమయంలో, గర్బిణీని కాఫీ తాగడానికి అనుమతించరు. అదేవిధంగా ప్రసవం తర్వాత కాపీకి కొన్నినెలలపాలు దూరంగా వుంటే మంచిది. కెఫిన్ కలిగిన పానియాలు తాగడం వల్ల శిశువులో క్రాంకీ, ఇరిటేషన్ ను సృష్టిస్తుంది. ఇది నిద్ర సమయంలో శిశువుని నిద్రపోనివ్వకుండా మేలుకొని ఉండేలా చేస్తుంది.

* గ్యాస్ ఉత్ర్పేరక ఆహారాలు : అధిక ఫైబర్ కలిగినటువంటి ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా క్యాప్సికమ్, ముల్లంగి వంటి వెజిటేబుల్స్ కు దూరంగా ఉండాలి. ఇవి గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలు. శిశువు పొట్టను అప్ సెట్ చేస్తాయి.

* సిట్రస్ పండ్లు : సిట్రస్ పండ్లలో ఉండే కొన్ని కాంపౌండ్స్.. శిశువుకు చికాకు పెట్టవచ్చు. సిట్రస్ పండ్లను తినడం వల్ల శిశువులో కనబడని రాషెస్, జల్లుకార్చడం వంటి లక్షణాలు కనబడుతాయి. కాబట్టి వీటిని దూరంగా వుంచాలి.

* జంక్ ఫుడ్ : జంక్ ఫుడ్ ఆరోగ్యకరమైన ప్రోటీనులు కలిగి ఉండవు. కాబట్టి బాలింతలు ఈ ఫుడ్స్ ని నివారించడం ఎంతో శ్రేయస్కరం. ఒకవేళ వీటిని తింటే.. పాల ద్వారా శిశువు ఆరోగ్యానికి హానికర క్యాలరీలు అందుతాయి.

* కారంగా ఉండే ఆహారాలు : స్పైసీ ఫుడ్ తిని శిశువుకు పాలు పట్టిన తర్వాత శిశువులో fussyకి కారణం అవుతుంది. కాబట్టి పాలిచ్చే తల్లులు, స్పైసీ ఫుడ్స్ ను నివారించడం ఉత్తమమైన మార్గం.

* గోధుమ : గోధుమలు శిశువుకు అలర్జీని కలిగించవచ్చు. దాంతో బ్లీడింగ్ స్టూల్స్, ఆబ్డామినల్ పెయిన్ వంటి సమస్యలు శిశువుకు కలగవచ్చు. కాబట్టి.. వీటికి దూరంగా వుండాలి.

* చాక్లెట్ : చాక్లెట్ తినడం వల్ల కూడా శరీరానికి కెఫిన్ శరీరానికి చేరుతుంది. కాబట్టి కెఫిన్ సోడా వంటివి పాల ద్వారా బేబికి అందకుండా జాగ్రత్త తీసుకోవాలి.

* వెల్లుల్లి : గార్లిక్ అధికంగా తీసుకోవడం వల్ల తల్లి పాలలో వాసన మారుతుంది. దాంతో శిశువు పాలు తాగడానికి నిరాకరించవచ్చు.

* పెప్పర్ మింట్ : బాలింతలు పుదీనాతో తయారు చేసి వంటను తీసుకోవడం వల్ల, శిశువు తరచూ ఏడుస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags :

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more