దంతక్షయం సమస్య ప్రతిఒక్కరికి అప్పుడప్పుడు వస్తుంటుంది. రెగ్యులర్ డైట్ ప్రాపర్ గా లేనప్పుడు.. నోట్లో ఉండే ఆమ్లాలు దంతాల ఔటర్ లేయర్ ను కరిపోయోలా చేస్తాయి. దాంతో దంతాలు మరింత సెన్సిటివ్ గా మారి.. దంతక్షయానికి కారణమవుతాయి. తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు దంతాలు నొప్పించడం, వేడి లేదా చల్లటి పదార్థాలు తీసుకొనేటప్పుడు సెన్సిటివ్ గా అనిపించడం, దంతాల మీద కలర్ మార్పు చెందడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. కొన్ని హెల్దీ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకుంటే చాలు. ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా..
* క్యాల్షియం రిచ్ ఫుడ్స్ : క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యానికి మాత్రమే కాదు, దంతాలు-చిగుళ్లకు కూడా మంచిదే. చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం వంటి సమస్యల్ని దూరంగా వుంచాలంటే క్యాల్షియం ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పెరుగు చీజ్, అరటిపండ్లు, బ్రొకోలీ వంటివాటిలో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది.
* మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ : రక్తంలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది విటమిన్ డి గ్రహించడానికి అది క్యాల్షియంగా మార్పు చెందడానికి చాలా అవసరం అవుతుంది. ఆకుకూరలు, ధాన్యాలు, బాదం, బీన్స్, ఫిష్, అవొకాడో, అరటిపండ్లలో ఎక్కువగా వుంటుంది. ఇది దంతక్షయాన్ని నివారించడానికి ఒక ఉత్తమమైన మార్గం.
* మాంసాహారం : మాంసాహారం నోటిలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేయడానికి, అసిడిక్ ఫైటిక్ యాసిడ్ పిహెచ్ క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది. రెడ్ మీట్, చికెన్, ఫిష్, సీఫుడ్స్ లో విటమిన్ బి12, బి2 లు ఎక్కువగా ఉన్నాయి. దంతక్షయాన్ని నివారించడంలోనూ ఈ మాంసాహారం తోడ్పడుతుంది.
* కొబ్బరి నూనె : ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది నోట్లో హానికరమైన బ్యాక్టీరియాన్ తొలగించడానికి సహాయపడుతుంది. టూత్ పేస్ట్ లో కొద్దిగా కొబ్బరితురుము లేదా కొబ్బరి నూనె జోడించి బ్రష్ చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.
* వెజిటేబుల్స్ : ఇవి అన్నికంటే ఎంతో మేలైన రెమెడీలు. ఈ వెజిటేబుల్స్ దంత క్షయాన్ని నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వెజిటేబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది నోట్లో లాలాజలం ఊరడానికి సహాయపడుతుంది. తద్వారా దంతక్షయం రాకుండా మినిరల్ డిఫెన్స్ ను క్రియేట్ చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more