Tokyo Olympics: India Men's Hockey Team Wins Bronze 41 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా హాకీ జట్టు

Tokyo olympics indian hockey ends 41 year medal wait with a bronze in tokyo

Indian Mens Hockey Team, Team India, Germany, Bronze Medal, Hockey, Simranjeet Singh, Hardik Singh, Harmanpreet Singh, Rupinder Pal Singh, 41 -year medal waitTokyo 2020 Olympic Games, Olympic Stadium, Tokyo Olympics

India sealed a 5-4 win against Germany in their men's hockey bronze medal match at Tokyo Olympics. Simranjeet Singh scored two goals for India at the Oi Hockey Stadium, along with Hardik Singh, Harmanpreet Singh and Rupinder Pal Singh also adding their names on the scoresheet. The win also helped the Indian men's hockey team end their 41-year medal wait at the Olympics.

41 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా హాకీ జట్టు

Posted: 08/05/2021 03:11 PM IST
Tokyo olympics indian hockey ends 41 year medal wait with a bronze in tokyo

ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు ప్రత్యర్థి జర్మనీ జట్టుపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. దీంతో దాదాపు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించింది. 1980 సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత ఇన్నాళ్లకు కాంస్య పతకం సాధించింది. జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్‌ 5-4 తేడాతో చిత్తు చేసింది టీమిండియా.

41 సంవత్సరాల సుధీర్ఘ విరామం అనంతరం పతకాన్ని సాధించి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసింది. మ్యాచ్ లో రెండు, మూడు క్వార్టర్స్ లో భారత స్ట్రయికర్లు సత్తా చాటగా.. ఆఖరి క్వార్టర్లో జర్మనీ క్రీడాకారులు దూకుడు ప్రదర్శించినా.. డిఫెండర్లు, గోల్‌ కీపర్‌ సమర్థవంతంగా అడ్డుకున్నారు. పలు పెనాల్టీ కార్నర్లను గోల్‌ కాకుండా అడ్డుకొని ఒలింపిక్‌ పతకాన్ని ఒడిసిపట్టారు. మ్యాచ్‌లో మొదటి క్వార్టర్లో 0-1 గోల్స్‌తో భారత జట్టు వెనుకపడింది.

రెండో క్వార్టర్లో కెప్టెన్ సిమ్రన్‌ జీత్‌ ఒక గోల్‌ సాధించి.. స్కోరును 1-1 సమమం చేయగా, జర్మనీ ఆటగాళ్లు రెండు గోల్స్‌ చేసి ఆధిక్యాన్ని కబర్చారు. కాగా, భారత్ ఆటగాళ్లు హర్ధిక్‌ సింగ్‌, హర్మన్‌ ప్రీత్‌ చేసిన గోల్స్ తో రెండో క్వార్టర్ సమంగా మారింది. మూడోక్వార్టర్లో జర్మనీపై భారత్‌ పూర్తిగా ఆధిపత్యం చెలాయించి 5-3తో ఆధిక్యంలో నిలిచారు. అయితే నాలుగో క్వార్టర్‌లో జర్మనీ గోల్‌ సాధించి ఆధిక్యాన్ని 5-4కు తగ్గించింది. స్కోర్‌ను సమం చేసేందుకు జర్మనీ ఎంత ప్రయత్నించినా భారత ఆటగాళ్లు అవకాశం ఇవ్వలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Mens Hockey Team  Team India  Germany  Bronze Medal  Hockey  Simranjeet Singh  Tokyo Olympics  

Other Articles