11 players suspended for Nehru Cup violence హాకీ ఇండియా సంచలనం: 11 మంది ఆటగాళ్ల సస్పెన్షన్..

Hockey india suspends 11 players after nehru cup final brawl

FIH, Gursimran Singh, hockey, Hockey India, Hockey Jammu and Kashmir, India, Punjab Armed Police, Punjab National Bank, Sarbat Daa Bhalaa, Sukhjeet Singh, Sumit Toppo, Nehru Cup final, Hockey news, sports news, Hockey, sports

Hockey India Disciplinary Committee suspended 11 players and two team officials for their respective roles in the recent violence that broke out during the 56th Nehru Cup finals between Punjab Armed Police and Punjab National Bank.

హాకీ ఇండియా సంచలనం: 11 మంది ఆటగాళ్ల సస్పెన్షన్..

Posted: 12/11/2019 04:44 PM IST
Hockey india suspends 11 players after nehru cup final brawl

భారత్ హాకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటలో అద్భుత ఫలితాలు రావాలంటే.. ఆటగాళ్ల మధ్య క్రమశిక్షణ ఉండాలని చాటేలా తీసుకున్న నిర్ణయం క్రీడాకారులకు కనువిప్పు కలిగించేలా వుంది. ఆటలో క్రమశిక్షణారాహిత్యాన్ని తాము అసలు సహించమని భారత హాకీ తమ నిర్ణయాన్ని స్పష్టం చేస్తోంది. మైదానంలో పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్న ఘటనకు సంబంధించి 11 మంది ఆటగాళ్లను భారత హాకీ ఇండియా క్రమశిక్షణ సంఘం సస్పెండ్‌ చేసింది. వారితో పాటు ఇద్దరు అధికారులపై వేటు వేసింది.

క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గానే రెండు జట్లపై కూడా సస్పెషన్ విధించింది. 56వ నెహ్రూకప్‌ ఫైనల్లో పంజాబ్‌ సాయుధ పోలీసులు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు జట్లు తలపడ్డాయి. మ్యాచ్‌ మధ్యలో చిన్న వివాదం తలెత్తి రెండు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు పడి పిడిగుద్దులు కురిపించారు. హాకీ కర్రలతో మైదానంలోనే కొట్టుకున్నారు. ఈ ఘటన అందరినీ నివ్వెరపరిచింది. హాకీ ఇండియా ఉపాధ్యక్షుడు భోలానాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని క్రమశిక్షణ సంఘం దీనిపై విచారణ చేపట్టింది. ఆధారాలన్నింటినీ పరిశీలించింది. తమ నివేదికను కమిటీ ముందుంచింది.

రెండు జట్లకు సంబంధించి 11 మంది ఆటగాళ్లను పొరపాటు స్థాయిని బట్టి 12-18, 6-12 నెలలు సస్పెండ్‌ చేయాలని నిర్ణయించింది. పంజాబ్‌ సాయుధ పోలీసుల జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను 18 నెలలు, ఐదుగురు ఆటగాళ్లకు 12 నెలల సస్పెన్షన్‌ విధించారు. 2019, డిసెంబర్‌ 11 నుంచి శిక్ష అమలవుతుంది. పోలీస్‌ జట్టు మేనేజర్‌ అమిత్‌ సంధుపై 18 నెలల సస్పెన్షన్‌ వేటు పడింది. పంజాబ్‌ బ్యాంకు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు 12 నెలలు, మరో క్రీడాకారుడికి ఆరు మాసాలు, జట్టు మేనేజర్ కు ఆరు నెలలపాటు సస్పెండ్ చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles