Manu Bhaker wins gold in World Cup Finals ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన మను భాకర్

Indian shooter manu bhaker bags gold breaks junior world record in 10m air pistol

Manu Bhaker, Indian shooter, ISS world cup, World cup shooting, 10m Air Pistol, Gold Medal, Heena Sidhu, Yashaswini Deswal, sports, shooting, sports news, shooting news, sports, cricket

Young shooting sensation, Manu Bhaker scripted history at 2019 ISSF World Cup as she bagged India's first gold medal at the tournament this year in Women's 10m Air Pistol on Thursday.

షూటింగ్లో స్వర్ణం.. ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన మను భాకర్

Posted: 11/21/2019 07:03 PM IST
Indian shooter manu bhaker bags gold breaks junior world record in 10m air pistol

భారత యువ షూటింగ్‌ సంచలనం మను భాకర్‌ అంతర్జాతీయ షూటింగ్ విభాగంలో ప్రపంచ రికార్డును బద్దలు కోట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ కప్‌ ఫైనల్స్‌ జూనియర్‌ విభాగంలో ఈ భారత ఆశాకిరణం ప్రపంచ రికార్డుతో పాటుగా స్వర్ణ పతకాన్ని కూడా కైవసం చేసుకుంది. ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్‌ ఫెడరేషన్‌ (ఐ.ఎస్‌.ఎస్‌.ఎఫ్‌.) ఈ సీజన్‌లో చివరి టోర్నమెంట్ ను చైనాలో నిర్వహిస్తోంది. ఈ పోటీలలో పాల్గన్న మను భకార్ ఎంతో ధృడత్వంలో తన లక్ష్యాన్ని సాధించింది.

గురువారం మహిళల విభాగంలో జరిగిన 10 మీటర్ల కేటగిరీ ఎయిర్‌ పిస్టల్‌ పోటీలో పాల్గోన్న మను భాకర్ ఈ ఘనత సాధించింది. ఆమె 244.7 పాయింట్లు సాధించి పతకాన్ని చేజిక్కించుకుంది. హినా సిద్దూ తరువాత ఈ ఘనతను సాధించిన భారతీయురాలిగా మను చరిత్ర సృష్టించింది. ఈ పోటీలో సెర్బియాకు చెందిన జోరానా అరునోవిక్‌ 241.9 పాయింట్లతో ద్వితీయ, చైనా యువతి క్వియాన్‌ వాంగ్‌ 221.8 పాయింట్ల తృతీయ స్థానాలను సాధించారు.

మరో భారతీయ క్రీడాకారిణి యశస్విని సింగ్‌ దేవల్‌ ఇదే షూటింగ్ ఈవెంట్లో పాల్గొని ఆరో స్థానంలో నిలిచింది. ఇక పురుషుల పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ, సౌరభ్‌ చౌదరి ఫైనల్‌లో ఆడటానికి అర్హత సాధించారు. ఈ క్వాలిఫైయింగ్‌ పోటీలో 588 పాయింట్లతో వర్మ తొలి స్థానంలో నిలువగా, 581 పాయింట్లు సాధించిన సౌరభ్‌ ఏడో స్థానంలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manu Bhaker  Indian shooter  10m Air Pistol  ISS world cup  Gold Medal  Heena Sidhu  sports  shooting  

Other Articles

Today on Telugu Wishesh