గాయాలతో గత కొంతకాలం ఆటకు దూరమైన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కొరియా మాస్టర్ వరల్డ్ టూర్ 300 లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. హాంకాంగ్ సూపర్ సిరీస్ తో ఫామ్ లోకి తిరిగి వచ్చిన శ్రీకాంత్.. మరింత పుంజుకుని కొరియా మాస్టర్ టోర్నీపై కన్నేశాడు. టైటిల్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే వరుస వైఫల్యాలతో అలసిపోయిన సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్.. టోర్నీ నుంచి తప్పుకుంది.
ఈ ఏడాది ఇండియా ఓపెన్ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత ఆశించిన రీతిలో రాణించలేదు. కాగా, తన ఫామ్ ను తిరిగి కొనసాగిస్తున్న కిదాంబి శ్రీకాంత్.. కొరియా ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో అతడు వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో తలపడనున్నాడు. ప్రత్యర్థితో ఇప్పటికే పలుమార్లు పోటీపడిన శ్రీకాంత్ 10 పర్యాయాలు పైచేయి సాధించాడు. కాగా ప్రత్యర్థి మాత్రం కేవలం మూడు పర్యాయాలు మాత్రమే శ్రీకాంత్ తో తలపడి నిలదొక్కకున్నాడు.
తొలిరౌండ్ నుంచి పలు టోర్నీలలో విఫలమవుతూ వస్తున్న ప్రపంచ నంబర్ 9 క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. కొరియా ఓపెన్ నుంచి తప్పుకుంది. వచ్చే వారం లక్నోలో నిర్వహించే సయ్యద్ మోదీ టోర్నీలో ఆమె పాల్గొనే అవకాశం ఉంది. సైనా తప్పుకోవడంతో ఇక టోర్నీలో భారత మహిళల ప్రాతినిధ్యం లేనట్టే. కాగా, భారత యువ ఆటగాడు, ప్రపంచ నంబర్ 16వ ర్యాంకర్ సమీర్ వర్మ పురుషుల తొలి రౌండ్లో టాప్ సీడ్ షి యు కి (చైనా)తో తలపడనున్నాడు. అతడి సోదరుడు సౌరభ్ వర్మ అర్హత పోటీల్లో ఆడనున్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 21 | భారత యువ షూటింగ్ సంచలనం మను భాకర్ అంతర్జాతీయ షూటింగ్ విభాగంలో ప్రపంచ రికార్డును బద్దలు కోట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ కప్ ఫైనల్స్ జూనియర్ విభాగంలో ఈ భారత ఆశాకిరణం ప్రపంచ... Read more
Nov 21 | గాయాలతో గత కొంతకాలం ఆటకు దూరమైన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కొరియా మాస్టర్ వరల్డ్ టూర్ 300 లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో... Read more
Oct 14 | మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని హోంషంగాబాద్ సమీపంలో జరిగిన ప్రమాదంలో నలుగురు జాతీయస్థాయి హాకీ క్రిడాకారులు దుర్మరణం చెందారు. ఇటార్సీలో జరుగుతున్న అఖిలభారత ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు... Read more
Oct 10 | భారత దిగ్గజ బాక్సర్ మేరికామ్ తన సాటిలేని మేటి ప్రతిభతో మరో ఘనతను సాధించింది. రష్యాలోని ఉలన్ ఉదె వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సెమీ పైనల్స్ కు చేరిన... Read more
Sep 24 | భారత స్టార్ షట్లర్ పీవీ సింధూకి టోక్యో ఒలింపిక్స్ ముంగిట ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల స్విట్జర్లాండ్ వేదికగా ముగిసిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర... Read more