Madhya Pradesh: 4 National Hockey Players Killed రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారుల మృతి

Mp four hockey players killed in hoshangabad road accident

mp road accident, MP Hockey Academy, mp car accident, madhya pradesh car accident, Hoshangabad Road Accident, Hoshangabad mishap, Hoshangabad car accident, hockey national players killed, All India Hockey Tournament, Shahnawaz Khan, Adarsh Hardua, Ashish Lal, Aniket, Crime

As many as four national-level hockey players were killed and three others injured in a car accident in Hoshangabad in Madhya Pradesh on Monday early morning.

రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారుల మృతి

Posted: 10/14/2019 10:52 AM IST
Mp four hockey players killed in hoshangabad road accident

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని హోంషంగాబాద్ సమీపంలో జరిగిన ప్రమాదంలో నలుగురు జాతీయస్థాయి హాకీ క్రిడాకారులు దుర్మరణం చెందారు. ఇటార్సీలో జరుగుతున్న అఖిలభారత ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు కారులో మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి వెళుతున్న జాతీయ హాకీ క్రీడాకారుల కారు హోంషంగాబాద్ లో అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు దిగువన చెట్టును ఢీకొనింది.

69వ జాతీయ రహదారిపై రైసల్ పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగంగా వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు.

మృతులంతా మధ్యప్రదేశ్ హాకీ అకాడమికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. మృతులను షానవాజ్ ఖాన్, ఆదర్శ హర్ధువా, ఆశీష్ లాల్, అంకిత్ లుగా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు క్రీడాకారులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన స్థానిక అసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hockey players  MP Hockey Academy  car accident  Hoshangabad  madhya pradesh  Crime  

Other Articles

Today on Telugu Wishesh