Rahi Sarnobat shoots down gold స్వర్ణాన్ని గురిచూసి కొట్టిన రాహీ సర్ణోబత్

Asian games 2018 shooter rahi sarnobat wins gold

Asian Games 2018, Manu Bhaker, Rahi Jeevan Sarnobat, Manu Bhaker Shooting, Shooting, Asian Games 2018 shooting

Rahi Sarnobat won the 25m Pistol gold medal as India continued their brilliant run in shooting at the Asian Games 2018 on Wednesday. Manu Bhaker finished sixth.

స్వర్ణాన్ని గురిచూసి గెలిచిన రాహీ సర్ణోబత్

Posted: 08/22/2018 04:40 PM IST
Asian games 2018 shooter rahi sarnobat wins gold

ఆసియన్ గేమ్స్ లో భారత్ తన సత్తాను చాటుతుంది. భారత్‌ బుధవారం మరో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో షూటర్‌ రహీ జీవన్‌ సర్నోబత్‌ పసిడిని గురిచూసి కొట్టింది. ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠకరంగా జరగడం గమనార్హం. బంగారాన్ని ముద్దాడేందుకు రహీ రెండు సార్లు షూటాఫ్‌‌లో పోటీ పడటం విశేషం. థాయ్‌ షూటర్‌ యంగ్‌పైబూన్‌, కొరియా అమ్మాయి కిమ్‌ మిన్‌జుంగ్‌ రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.

ఫైనల్లో రహీ జీవన్‌, యంగ్‌పైబూన్‌ హోరాహోరీగా తలపడ్డారు. ఇద్దరూ చెరో 34 పాయింట్లతో సమానంగా నిలిచారు. స్టేజ్‌-1లో మూడు రౌండ్లలో జీవన్‌ 15 పాయింట్లకు గాను 14 సాధించింది. స్టేజ్‌-2లో జరిగిన 7 రౌండ్లలో 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. స్టేజ్‌-1లో వెనకబడిన యంగ్‌పైబూన్‌ స్టేజ్‌-2లో పుంజుకోవడంతో ఇద్దరూ చెరో 34 పాయింట్లు సాధించారు. తొలి షూటాఫ్‌లోనూ తలో ఐదు గుళ్లు కాల్చగా ఇద్దరూ 4-4తో సమంగా నిలిచారు. రెండో షూటాఫ్‌లో ఐదు గుళ్లకు రహీ జీవన్‌ 3 పాయింట్లు కొల్లగొట్టగా ప్రత్యర్థి కేవలం 2 మాత్రమే చేసింది. దీంతో స్వర్ణం భారత్‌ వశమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles