india beat Kenya 2-0 to clinch Intercontinental Cup ఇంటర్ కాంటినెంటల్ కఫ్ భారత్ కైవసం.. మళ్లీ కెప్టెన్ ట్వీట్..

Milestone man chetri helps india beat kenya to clinch intercontinental cup in style

sunil chhetri, Intercontinental Cup, indian football team, india, supporters, champions, AFC Asian Cup 2018 schedule,Amitabh Bachchan Tweet,Captain Sunil Chhetri,Cristiano Ronaldo,India beat Kenya 2-0,India vs Kenya highlights,India win Intercontinental cup 2018,Intercontinental Cup 2018 Finals highlights,Lionel Messi,Sunil Chetri brace,Sunil Chetri goals,Sunil Chetri international goals,Sunil Chhetri brace,sunil chhetri international matches,sunil chhetri message,Sunil Chhetri tweet,Sunil Chhetri twitter,sports news, football news, latest sports news, sports

Indian captain Sunil Chhetri’s tweet post-India’s victory, read, “What a feeling! Thank you, India! This win is for the fans who filled the stands, cheered from home and backed and believed in us. The boys and staff pulled together and now it’s time to enjoy. We regroup soon because the road is long – very long.”

ఇంటర్ కాంటినెంటల్ కఫ్ భారత్ కైవసం.. మళ్లీ కెప్టెన్ ట్వీట్..

Posted: 06/11/2018 02:25 PM IST
Milestone man chetri helps india beat kenya to clinch intercontinental cup in style

టీమిండియా ఫుట్ బాల్ జట్టు ప్రతిషాత్మకమైన ఇంటర్ కాంటినెంటల్‌ ఫుట్ బాల్‌ కప్ ను కైవసం చేసుకుంది. ఫైనల్లో కెన్యాపై టీమిండియా జట్టు అద్భుతంగా రాణించి విజయాన్ని అందుకోవడంతో పాటు టైటిల్ ను కూడా సోంత చేసుకుంది. టీమిండియా కెప్టెన్‌ సునీల్‌ చెత్రీ రెండు గోల్స్‌ చేయడంతో పాటు.. డిఫెండర్లు మెరుగైన ప్రదర్శనతో అద్భుత విజయం భారత్ సోంతమైంది. అయితే ఈ మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్(8వ, 29వ నిమిషాల్లో) కెప్టెన్ చెత్రీ చేసినవే. ఇక దీంతో టీమిండియా కెప్టెన్ చత్రి చేసిన గోల్స్ తో ఏకంగా ఫుట్ బాల్ దిగ్గజ అటగాడు మెస్సీ సరసన స్థానం సంపాదించాడు.

అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచులో ప్రత్యర్థి కెన్యా ఖాతా కూడా తెరవనీయకుండా టీమిండియా డిఫెండర్లు బాగా రాణించారు. చెత్రీ ఎనిమిదో నిమిషంలో థాపా నుంచి పాస్ ను అందుకుని గోల్ కొట్టాడు. ఇక 29వ నిమిషంలో సెంటర్‌ బ్యాక్‌ నుంచి వచ్చిన పాస్ ను కాలితో గోల్‌ పోస్టులోకి పంపాడు. దీంతో విరామానికి ముందే భారత్‌ 2-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక రెండో భాగంలో భారత గోల్ కీపర్లు కెన్యా గోల్స్ ను అడ్డుకోవడంతో.. కెన్యా జట్టు ఒక్క గోల్ కూడా చేయలేదు. దీంతో భారత్‌ చేతిలో 2-0తో ఓటమిపాలయింది.

ఈ టోర్నీ మొత్తంలో భారత్‌ తరఫున మొత్తం 11 గోల్స్‌ నమోదయ్యాయి. అందులో చెత్రీ ఒక్కడే 8 గోల్స్‌ చేసాడు. ఈ మ్యాచ్ లో రెండు గోల్స్ తో మెరిసిన కెప్టెన్ చెత్రీ అత్యధిక గోల్స్‌ చేసిన రెండో ప్లేయర్‌గా అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనల్ మెస్సీ సరసన చేరాడు. మెస్సీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్‌ చేయగా.. చెత్రీ 102 మ్యాచ్‌ల్లోనే 64  గోల్స్‌ చేసాడు. పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. రోనాల్డో 150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్‌ సాధించాడు.  ఇక చెత్రితో పాటు తన జట్టు కూడా కొంత సమయాన్ని ఎంజాయ్ చేస్తుందని.. ఆ తరువాత మళ్లీ రీయూనియన్ అవుతుందని అన్నారు.

ఈ మేరకు మ్యాచు గెలిచిన అనంతరం ఆయన భారత క్రీడాభిమానులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరోమారు ట్వీట్ చేశాడు. ఈ విజయం భారత క్రీడాభిమానులదని అయన వ్యాఖ్యానించాడు. తన విజ్ఞప్తితో స్టేడియంకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చి.. మ్యాచులను వీక్షించిన అభిమానులతో పాటు ఇళ్లలో నుంచి మ్యాచులను లైవ్ లో వీక్షించిన అభిమానుల వల్లే ఈ విజయం సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇక తన తదుపరి టార్టెట్ చాలా సుదీర్ఘమైనదని అది ఛాంఫియన్స్ గా అవతరించడమేనని ట్వీట్ చేశాడు చత్రి. ఇక చత్రి అండ్ టీమ్ పై బాలీవుడ్ బిగ్ బి నుంచి మొదలు అనేక మంది నెట్ జనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil Chhetri  team india  kenya  intercontinental cup  amitabh bachchan  twitter  football  sports  

Other Articles