setback for Pv sindhu as Telangan govt rejects her plea పివి సింధూకు షాక్.. వినతి తిరస్కరణ..

Setback for pv sindhu as telangan govt rejects her plea

thailand open, PV sindhu, Bharani layout, jubilee hills, additional land, appliation, rejection, telanagana, andhra pradesh, sports, badminton, badminton news, sports news, latest sports news, sports

It's a setback for Indian star shuttler Pv sindhu by Telangan govt as the state authorities rejects her plea, to allot an additional land which is side to her site alloted by the government after winning a silver medal in Rio olympics.

పివి సింధూకు షాక్.. వినతి తిరస్కరణ..

Posted: 07/13/2018 12:09 PM IST
Setback for pv sindhu as telangan govt rejects her plea

ఇండియన్ స్టార్ షట్లర్ కు పీవీ సింధుకు షాక్ తగిలింది. రియో ఒలంపిక్స్ లో రజత పథకం సాధించిన తెలుగమ్మాయికి రెండు తెలుగు రాష్ట్రాలు బహుమతులను ప్రకటించాయి. అయితే అమెకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం థాయ్ లాండ్ ఓపెన్ టార్నోమెంటులో క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లిన సింధూ.. మరో టైటిల్ తన ఖాతాలో వేసుకునేందుకు రెండడుగుల దూరంలో వుండగా, అమెకు రెండో తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి మాత్రం చుక్కెదురైంది.

రియో ఒలంపిక్స్ గెలిచిన సందర్భంగా ప్రోత్సహకంగా తనకు తెలంగాణ ప్రభుత్వం అందించిన వెయ్యి గజాల స్థలం పక్కన వున్న మరో 398 గజాల స్థలాన్ని తనకు అదనంగా కేటాయించాలని అమె రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీని తెలంగాణ ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకుంది. సింధూకు మరో గజం స్థలాన్ని కూడా కేటాయించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధుకు... హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని భరణి లేఔట్ లో 1000 గజాల స్థలాన్ని కేటాయించింది.

దీని విలువ దాదాపు రూ. 15 కోట్లు. దీనికి తోడు, రూ. 5 కోట్ల నజరానాను కూడా అందించింది. తనకు ఇచ్చిన స్థలం పక్కనే ఉన్న 398 గజాల స్థలాన్ని కూడా తనకు కేటాయించాలంటూ కొన్నాళ్ల క్రితం ప్రభుత్వానికి ఆమె దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆమె విన్నపాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం కూడా ఆమెకు స్థలంతో పాటు, నగదు బహుమతిని, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ఇచ్చిందని... ఈ నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల నుంచి ప్రయోజనాలను పొందిన ఆమెకు... అదనంగా స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం భావించినట్టు సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV sindhu  Bharani layout  jubilee hills  additional land  appliation  rejection  telanagana  badminton  

Other Articles