Chanu Wins India's First Gold at CWG 2018 సీడబ్యూజీలో భారత్ ఖాతాలో తొలి పసిడి..

Weightlifter mirabai chanu wins india s first gold at cwg 2018

commonwealth games, commonwealth games 2018, commonwealth games live, commonwealth games live updates, commonwealth games live streaming, live updates of 2018 commonwealth games, live streaming of commonwealth games, commonwealth games gold coast, cwg 2018, cwg 2018 live, cwg 2018 live streaming, commonwealth games news, sports news, latest sports news, sports

tar weightlifter Mirabai Chanu won the first gold for India at the 21st edition of the Commonwealth Games with a power-packed performance in the women’s 48 kilogram category

సీడబ్యూజీలో మీరాబాయ్ ఛాను ప్రతిభ.. భారత్ ఖాతాలో తొలి పసిడి..

Posted: 04/05/2018 06:14 PM IST
Weightlifter mirabai chanu wins india s first gold at cwg 2018

ఆస్ట్రేలియాలో అట్టహాసంగా జరుగుతున్న 21వ కామన్వెల్త్ పోటీల్లో భారత క్రీడాకారులు తమ హావాను కోనసాగిస్తున్నారు. వెయిట్ లిప్టింగ్ విభాగంలో గురురాజా రజతం పతకంతో ఖాతా తెరిచిన కొన్ని గంటల వ్యవధిలోనే భారత్ తొలి స్వర్ణ పతకాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. పతకాలలో బోణి కోట్టిన రోజునే స్వర్ణం పతకంలోనూ భారత్ బోణి కొట్టింది. ప్రపంచ ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ ఛాను 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని భారత్‌‌‌ కీర్తిని ఇనుమడింపజేసింది. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన మీరాబాయ్ చాను కామన్వెల్త్ గేమ్స్ లోనూ తన సత్తా చాటింది.

మహిళల 48 కేజీల విభాగంలో చాను.. తన శరీరం బరువుకు రెట్టింపు కంటే ఎక్కువ బరువును ఎత్తడం ద్వారా (103 కిలోలు, 107 కిలోలు, 110 కిలోలు) ఓవరాల్ గేమ్ రికార్డును సొంతం చేసుకుంది. చాను స్వర్ణం కైవసం చేసుకోగా.. మారిషస్‌కు చెందిన హనిత్రా(170కేజీలు) రజతం గెలుచుకోగా, శ్రీలంకకు చెందిన దినూష(155) కాంస్యంతో సరిపెట్టుకుంది. తన అత్యద్భుత ప్రతిభను ప్రదర్శించిన చాను.. స్వర్ణాన్ని ముద్దాడింది. 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు వచ్చిన తొలి పసిడి పతకం ఇదే కావడం గమనార్హం. ఇక ఈ పోటీల్లో ఇప్పటి వరకు భారత్‌ గెలుచుకున్న రెండు పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే కావడం విశేషం.

2014 గ్లాస్గో కామెన్వెల్త్ గేమ్స్ లో రజతంతో సరిపెట్టుకున్న చాను ఈసారి ఏకంగా స్వర్ణానికే గురిపెట్టింది. 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన చానుకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ‘నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాం, ఫస్ట్ గోల్డ్ లేడీ’ అని పెద్ద సంఖ్యలో అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ నుంచి మేరికోమ్ వరకు దేశవ్యాప్తంగా నెట్ జనులు మీరా చానుపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles