Padma Bhushan Award for PV Sindhu.? సిందుకు పద్మభూషణం.. హోంశాఖకు సిఫార్సు చేసిన క్రీడాశాఖ

Pv sindhu nominated for padma bhushan award

pv sindhu, Padma Bhushan, Award, MS Dhoni, BCCI, sameer Verma, Son Wan, Sung Ji Hyun, Minatsu Mitani, sindhu badminton, korea super series 2017, india badminton, badminton news, Badminton, sports news, latest badminton news, latest sports news

PV Sindhu has been nominated for the prestigious Padma Bhushan award by the Sports Ministry on Monday.

సింధూరం సిగలోకి పద్మభూషణం.. హోంశాఖకు సిఫార్సు చేసిన క్రీడాశాఖ

Posted: 09/25/2017 05:28 PM IST
Pv sindhu nominated for padma bhushan award

ప్రముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి, ఒలింపిక్ రజత పతక విజేత‌, తెలుగు తేజం పీవీ సింధుకు మ‌రో గౌర‌వం ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆమె పేరును ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు కేంద్ర హోంశాఖకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఈ అవార్డుకు ఇప్పటికే బిసిసిఐ ఓ వైపు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ కు మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని పేరును సిఫార్సు చేయగా, ఆయనకు ఈ సారి కూడా నిరాశే ఎదురుకానుంది అని సమాచారం.

ఇదిలావుండగా, సరిగ్గా ప్రధాని మోడీ జన్మదినం రోజునే కొరియా ఓపెన్ టైటిల్ ను తన వైరిగా నిలిచిన జపాన్ క్రీడాకారిణి ఒకుహారాతో తలపడిన పూసర్ల వెంకట సింధూ.. తన ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ ప్రతీకారం తీర్చుకుని టైటిల్ ను సాధించింది. అదే రోజున తనకు ఈ టైటిల్ ప్రధాని మోడీ జన్మదినం రోజుల లభించింది కాబట్టి.. దానిని అయనకే అంకితమిస్తున్నాని. ఆయన దేశం కోసం అనునిత్యం శ్రమిస్తున్నందున ఈ అవార్డును అంకితం చేస్తున్నానని చెప్పింది.

ఈ క్రమంలో పద్మ అవార్డుల జాబితాలో అప్పటి వరకు లేని అమె పేరు ఒక్కసారిగా చేరిపోయింది. అమె పేరును ఏకంగా పద్మభూషన్ అవార్డుల కోసం ఎంపిక చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్ర హోం మంత్రిత్వశాఖకు సిఫార్సు చేసింది. ఏదిఏమైనా తెలుగుతేజానికి పద్మాన్ని అందించడం హర్షనీయమే. ప్ర‌స్తుతం ప్ర‌పంచ నెం. 2 ర్యాంకులో కొన‌సాగుతున్న‌ సింధు బ్యాడ్మింట‌న్‌లో వివిధ అంత‌ర్జాతీయ టోర్నీల్లో అత్యుత్తమ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రీడాశాఖ చేసిన సిఫార్సును ప్ర‌స్తుతం హోం శాఖ ప‌రిశీలిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badminton  Korea Open Super Series  Minatsu Mitani  PV Sindhu  Padma Bhushan  Award  MS Dhoni  BCCI  

Other Articles