Kidambi, Prannoy crash out of Japan Open జపాన్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన కిదాంబి, ప్రణాయ్

Kidambi srikanth hs prannoy crash out of japan open badminton

Japan Open, Japan Open Superseries, HS Prannoy, Kidambi Srikanth, Indian badminton, Shi Yuqi, PV Sindhu, Saina Nehwal, Japan Open badminton, Pranaav Jerry Chopra, N.Sikki Reddy, korea super series 2017, india badminton, badminton news, Badminton, sports news, latest badminton news, latest sports news

Kidambi Srikanth lost to the defending World Champion Viktor Axelsen, while HS Prannoy went down to China’s Shi Yuqi in the quarterfinals of the Japan Open Superseries badminton tournament.

జపాన్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన కిదాంబి, ప్రణాయ్

Posted: 09/22/2017 08:57 PM IST
Kidambi srikanth hs prannoy crash out of japan open badminton

జపాన్‌ ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణిలు పోరు ప్రీక్వార్టర్స్ లోనే ముగిసింది. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో తలపడిన సింధూ.. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినాతో తలపడిన సైనా నెహ్వాల్ ఒటమి కావడంతో మహిళల సింగిల్స్ విభాగంతో భారత్ పోరు ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ తన ఓటమిపై ట్విట్ చేసిన పీవీ సింధూ.. త‌న ఓట‌మిపై స్పందిస్తూ.. నిన్న జ‌పాన్‌ క్రీడాకారిణి నొజొమి ఒకుహర చేతిలో ఓటమి పొందేవ‌ర‌కు ఆట‌లో తాను చేస్తోన్న త‌ప్పులేంటో త‌న‌కు తెలియ‌రాలేద‌ని ఆమె చెప్పింది. ప్ర‌స్తుతం తాను కొంత విశ్రాంతి తీసుకోవాల్సి ఉంద‌ని, అనంత‌రం మ‌ళ్లీ శిక్షణకు వెళ‌్తాన‌ని పేర్కొంది. ఇక తాను డెన్మార్క్ ఓపెన్‌పై దృష్టి పెడ‌తాన‌ని చెప్పింది

ఇదలా వుండగా, ఇవాళ్టితో జపాన్ ఓపెన్ లో పురుషుల సింగిల్స్ విభాగంలో కూడా మన షెట్లర్ల పోరు ముగిసింది. క్వార్టర్స్ వరకు వెళ్లిన కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌ ఎస్‌ ప్రణయ్‌ కూడా ఇవాళ జరిగిన పోరులో నిరాశ పరిచారు. క్వార్టర్స్ లో భాగంగా చైనా క్రీడాకారుడు షి యుకీతో తలపడిన ప్రణయ్ 15-21, 14-21తో రెండు వరుస గేమ్ ల్లో ఓడిపోయాడు. అలాగే డానిష్ ఆటగాడు విక్టర్ ఎక్సల్సన్ చేతిలో 17-21, 17-21 తేడాతో కిదాంబి శ్రీకాంత్‌ ఓటమి చవిచూశాడు. కాగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ దక్షిణ కొరియా జోడీపై 21-18, 9-21, 21-19తేడాతో గెలుపొంది సెమీస్ కి దూసుకెళ్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles